తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Miss Shetty Mister Polishetty Collections: నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ - అనుష్క క్రేజ్ త‌గ్గ‌లేదుగా!

Miss Shetty Mister Polishetty Collections: నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ - అనుష్క క్రేజ్ త‌గ్గ‌లేదుగా!

HT Telugu Desk HT Telugu

11 September 2023, 14:26 IST

google News
  • Miss Shetty Mister Polishetty Collections: అనుష్క మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి మూవీ బ్రేక్ ఈవెన్ అయిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి మూవీ
మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి మూవీ

మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి మూవీ

Miss Shetty Mister Polishetty Collections: అనుష్క, న‌వీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా న‌టించిన మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి మూవీ నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. సోమ‌వారం నాటి క‌లెక్ష‌న్స్‌తో ఈ మూవీ లాభాల్లోకి ఎంట‌ర్ కానున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. జ‌వాన్ పోటీ కార‌ణంగా తొలిరోజు యావ‌రేజ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ మూవీ మౌత్ టాక్‌తో పుంజుకున్న‌ది. రోజురోజుకు వ‌సూళ్లు పెరుగుతూ వ‌చ్చాయి.

ఫ‌స్ట్ డే కంటే ఆదివారం రోజు ఈ మూవీ డ‌బుల్ క‌లెక్ష‌న్స్ సాధించ‌డం గ‌మ‌నార్హం. ఆదివారం రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా తొమ్మిది కోట్ల గ్రాస్‌ను, నాలుగున్న‌ర కోట్ల‌కుపైగా షేర్‌ను సాధించిన‌ట్లు తెలిసింది. ప‌ద‌మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఆదివారం నాటికి ఇర‌వై ఆరు కోట్ల‌కుపైగా గ్రాస్‌ను, ప‌న్నెండున్న‌ర కోట్ల‌కుపైగా షేర్ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

మ‌రో యాభై ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను రాబ‌డితే ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. సోమ‌వారం నాటితో నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు లాభాల ప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టితో దాదాపు మూడేళ్ల త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది అనుష్క‌. రీఎంట్రీలోనే హిట్‌ను అందుకున్న‌ది.

స‌రోగ‌సీ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు మ‌హేష్‌బాబు ఈ సినిమాను తెర‌కెక్కించారు. న‌వీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. యూవీ క్రియేష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం