తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hansika Wedding: హ‌న్సిక పెళ్లి ఓటీటీలో స్ట్రీమింగ్ - భారీ ధ‌ర‌కు హ‌క్కుల్ని కొన్న‌ హాట్‌స్టార్‌

Hansika Wedding: హ‌న్సిక పెళ్లి ఓటీటీలో స్ట్రీమింగ్ - భారీ ధ‌ర‌కు హ‌క్కుల్ని కొన్న‌ హాట్‌స్టార్‌

14 November 2022, 7:00 IST

  • Hansika Wedding: వ్యాపార‌వేత్త సోహైల్‌ క‌తూరియాను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించింది హీరోయిన్ హ‌న్సిక. ఈ జంట పెళ్లి డిసెంబ‌ర్ 4న జైపూర్‌లో జ‌రుగ‌నుంది. కాగా పెళ్లి వీడియో హ‌క్కుల్ని ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. ఆ ఓటీటీ ఏదంటే..
హ‌న్సిక‌, సోహైల్‌ క‌తూరియా
హ‌న్సిక‌, సోహైల్‌ క‌తూరియా

హ‌న్సిక‌, సోహైల్‌ క‌తూరియా

Hansika Wedding: త్వ‌ర‌లోనే హీరోయిన్‌ హ‌న్సిక వైవాహిక బంధంలోకి అడుగుపెట్ట‌బోతుంది. చిర‌కాల మిత్రుడు, వ్యాపార‌వేత్త సోహైల్‌ క‌తూరియాను పెళ్లాడ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే హ‌న్సిక ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 4న జైపూర్‌లో వీరి పెళ్లి జ‌రుగ‌నుంది. జైపూర్‌లోని ప్రాచీన ముందోతా ఫోర్ట్ ప్యాలెస్‌ను పెళ్లి వేదిక‌గా ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi: ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

Heeramandi OTT: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడికి డ్రామా.. నెటిజన్ల ప్రశంసలు.. సిరీస్ ఎక్కడ చూస్తారంటే?

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?

డిసెంబ‌ర్ 2 నుంచి నాలుగో తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు పెళ్లి వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హించేలా ప్లాన్ చేసిన‌ట్లు తెలిసింది. పెళ్లి కోసం రెండో తేదీ నాడు హ‌న్సిక, సోహైల్‌తో పాటు వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, స‌న్నిహితులు జైపూర్ చేరుకోనున్న‌ట్లు చెబుతున్నారు.

కాగా హ‌న్సిక‌, సోహాన్ పెళ్లి వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలిసింది. పెళ్లి ప్ర‌సార హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌పామ్ డిస్నీప్ల‌స్ హాట్ స్టార్ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన‌ట్లు చెబుతున్నారు. పెళ్లి జ‌రిగిన కొద్ది రోజులుగా వీడియోను డాక్యుమెంట‌రీ రూపంలో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం హ‌న్సిక తెలుగులో 105 మినిట్స్‌, మై నేమ్ ఈజ్ శృతి సినిమాలు చేస్తోంది. ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల‌తో రూపొందిన ఈ సినిమాలు త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. త‌మిళంలో ఐదు సినిమాలు చేస్తోంది. న‌వ‌త‌రం తార‌ల పోటీ కార‌ణంగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పై దృష్టిపెడుతోంది హ‌న్సిక‌.


హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.