తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Geethanjali Malli Vachindi: పదేళ్ల తర్వాత గీతాంజలికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది.. క్లైమాక్స్ హైలెట్ అన్న అంజలి

Geethanjali Malli Vachindi: పదేళ్ల తర్వాత గీతాంజలికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది.. క్లైమాక్స్ హైలెట్ అన్న అంజలి

Sanjiv Kumar HT Telugu

07 January 2024, 6:17 IST

google News
  • Anjali About Geethanjali Malli Vachindi: హీరోయిన్ అంజలి నటించిన లేడి కామెడీ అండ్ హారర్ మూవీ గీతాంజలి. సెన్సేషనల్ హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది గీతాంజలి మళ్లీ వచ్చింది. గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీలో క్లైమాక్స్ ఒక రేంజ్‌లో ఉంటుందని అంజలి తెలిపింది.

పదేళ్ల తర్వాత గీతాంజలికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది.. క్లైమాక్స్ హైలెట్ అన్న అంజలి
పదేళ్ల తర్వాత గీతాంజలికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది.. క్లైమాక్స్ హైలెట్ అన్న అంజలి

పదేళ్ల తర్వాత గీతాంజలికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది.. క్లైమాక్స్ హైలెట్ అన్న అంజలి

Geethanjali Malli Vachindi: హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్‌లో ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్.

ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలకు సిద్ధమవుతోన్న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్నారు. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేసే ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ స్పీచ్ ఇచ్చింది. ఇందులో భాగంగానే హీరోయిన్ అంజలి తన అనుభవాలు, అభిప్రాయాలను పంచుకుంది.

"‘గీతాంజలి’ నా కెరీర్‌లో తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. చాలా పెద్ద హిట్ అయ్యింది. అదే కాన్ఫిడెన్స్‌తోనే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా చేశాం. సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం. సినిమా చూశాను. చాలా బావుంది. సినిమా అంతా ఒక ఎత్తైతే .. క్లైమాక్స్ మరో రేంజ్‌లో ఉంటుంది. విజువల్, గ్రాండ్ నెస్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంటాయి. సీక్వెల్‌లో పార్ట్ 2 వెయిట్‌ను మోయటానికి స్టార్ క్యాస్ట్ పెరిగింది. అలీ, సునీల్, సత్య ఇలా అందరూ నవ్విస్తారు" అని అంజలి తెలిపింది.

"డైరెక్టర్ శివ తుర్లపాటిగారికి ఈ సినిమా చాలా పెద్ద బ్రేక్ అవుతుంది. సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్ విజువల్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, రాజేష్ నా కోస్టార్స్‌గా పార్ట్ 1లో నటించారు. సీక్వెల్‌లోనూ నవ్విస్తారు. మూవీకోసం గ్రేట్ సెట్ వేసి శ్రీనుగారు, అద్భుతమైన సంగీతాన్ని అందించిన ప్రవీణ్ లక్కరాజుగారు, ఎడిటర్ చోటాగారు అద్భుతంగా చేశారు. గీతాంజలి ముద్దుగా కనిపించినా తను చేసే పనులు భయపెడతాయి. వాటిని థియేటర్స్‌లో చూడాల్సిందే" అని అంజలి చెప్పుకొచ్చింది.

"కోన వెంకట్ గారు గీతాంజలి చిత్రాన్ని ఫ్రాంచైజీగా రూపొందిస్తూ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చేశారు. కోనగారి కామెడీ ట్రాక్, సినిమాను ఆయన డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంది" అని హీరోయిన్ అంజలి సినిమాపై కామెంట్స్ చేసింది. "సాధారణంగా మనకు సముద్రంలో ముత్యాలు దొరుకుతుంటాయి. అలా నాకు అమెరికాలో దొరికిన ఆణిముత్యాలు ప్రవీణ్ లక్కరాజు, శివ తుర్లపాటి, మా లిరిసిస్ట్ శ్రీజో వంటి వారు దొరికారు. నేను షార్ట్ ఫిలిమ్ చేసినప్పుడు నాకు శివ తుర్లపాటి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి తనతో జర్నీ చేస్తున్నాను" రైటర్ కోన వెంకట్ తెలిపారు.

"గీతాంజలి సినిమా చేసే సమయానికి నేను 45 సినిమాలకు వర్క్ చేసి ఉన్నాను. కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనిపించి చేసిన సినిమాయే గీతాంజలి. శ్రీనివాస్ రెడ్డి నా దగ్గరకు రాజ్ కిరణ్‌ని తీసుకొచ్చాడు. హారర్ మూవీగా ఉన్న ఆ కథను కామెడీ హారర్‌గా మార్చాను. ఆ సమయంలో బలుపు సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకు నేను వర్క్ చేశాను. ఆ మూవీలో కీలక పాత్ర చేసిన అంజలి పెర్ఫామెన్స్ నచ్చటంతో గీతాంజలి సినిమా కోసం అప్రోచ్ అయ్యాం. అలా సినిమా టేకాఫ్ అయ్యింది" అని కోన వెంకట్ పేర్కొన్నారు.

"గీతాంజలి మూవీ ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. గీతాంజలి మూవీ చేయటానికి మరో కారణం ఎంవీవీ సత్యనారాయణగారు. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ అందరూ ఎంతో ఇష్టంగా చేసిన సినిమా గీతాంజలి. సీక్వెల్ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ విషయానికి వస్తే సుజాత సిద్ధార్థ్ ఎంతో అడ్వాంటేజ్ అయ్యారు. అలాగే ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఎసెట్ అయ్యింది. ఈ సీక్వెల్ రావటానికి పదేళ్లు పట్టింది. గీతాంజలి 2ను అమెరికాలో చేద్దామని అనుకున్నాను. కానీ, టెక్నికల్, ప్రాక్టికల్ అంశాల కారణంగా సినిమాను ఊటీకి మార్చి చేశాం" అని కోన చెప్పుకొచ్చారు.

"సత్య, సునీల్, రవిక్రిష్ట, రాహుల్ మాధవ్, అలీ సినిమాకు అడిషన్స్ అయ్యారు. సినిమాను ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే ఆడియెన్స్ చూడటానికి వస్తారో దాన్ని మించి ఎంజాయ్ చేస్తారు. భాను కిరణ్, నందు రైటింగ్ పరంగా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. సినిమాను అందరూ ఎంజాయ్ చేసి చేశారు. మా శివకు ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చాలా పెద్ద బ్రేక్ అవుతుంది. తను టాలీవుడ్‌లో ఫెంటాస్టిక్ డైరెక్టర్‌గా నిలుస్తారు. సంక్రాంతికి టీజర్‌ను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం" అని వెల్లడించారు కోన వెంకట్.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం