తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amazon Prime : మూవీ రెంటల్ సర్వీసెస్ ప్రారంభించిన అమెజాన్ ప్రైమ్ వీడియో

Amazon Prime : మూవీ రెంటల్ సర్వీసెస్ ప్రారంభించిన అమెజాన్ ప్రైమ్ వీడియో

HT Telugu Desk HT Telugu

28 April 2022, 16:02 IST

google News
  • ముంబయి: అమెజాన్ ప్రైమ్ వీడియో గురువారం భారతదేశంలో మూవీ రెంటల్ సేవను ప్రారంభించింది. రాబోయే రెండేళ్లలో నలభైకి పైగా ఒరిజినల్ సిరీస్‌లు, చలనచిత్రాలను కీలక మార్కెట్‌లో విడుదల చేస్తామని హామీ ఇచ్చింది.

మూవీ రెంటల్ సర్వీసెస్ ప్రారంభించిన అమెజాన్ ప్రైమ్ వీడియో
మూవీ రెంటల్ సర్వీసెస్ ప్రారంభించిన అమెజాన్ ప్రైమ్ వీడియో (REUTERS)

మూవీ రెంటల్ సర్వీసెస్ ప్రారంభించిన అమెజాన్ ప్రైమ్ వీడియో

దాదాపు 1.4 బిలియన్ల జనాభాతో ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన మన దేశం.. అమెజాన్, దాని ప్రత్యర్థులు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌లకు విలువైన మార్కెట్‌గా ఉంది.

‘లాంచ్ గురించి చాలా సంతోషిస్తున్నాం..’ అని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ గౌరవ్ గాంధీ ఒక కార్యక్రమంలో చెప్పారు. ఈ రెంటల్ సేవ కస్టమర్ల పరిధిని , ఎంపికను విస్తృతం చేస్తుందని అన్నారు. నెలవారీ రుసుము బదులుగా ఒక్కో సినిమాకు రెంట్ చెల్లించడానికి ఈ సర్వీసు అనుమతిస్తుంది.

అమెరికా టెక్ దిగ్గజం భారతదేశంలో తన స్ట్రీమింగ్ సేవను ప్రారంభించిన ఐదు సంవత్సరాల తర్వాత ఈ చొరవ తీసుకుంది. రాబోయే ఐదేళ్లలో ప్రైమ్ వీడియోలో దాని పెట్టుబడిని రెండింతలు కంటే ఎక్కువ పెంచాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిపింది. కానీ గణాంకాలను ఇవ్వలేదు.

కంపెనీ మూడు భారతీయ భాషల్లో 41 ఒరిజినల్ సిరీస్‌ల కోసం ప్లాన్‌లను ఆవిష్కరించింది. కొన్నింటిని కరణ్ జోహార్, జోయా అక్తర్ వంటి ప్రముఖ బాలీవుడ్ దర్శకులు నిర్మించనున్నారు.

అమెజాన్ భారతదేశంలో స్థానిక కంటెంట్‌ను పొందేందుకు, సృష్టించేందుకు భారీగా పెట్టుబడి పెట్టింది. ఇక్కడ 2020లో ప్రైమ్ వీడియో ప్రపంచంలో మరెక్కడా లేనంత మెరుగ్గా ఉందని వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ చెప్పారు. అమెజాన్ దేశం వారీగా వినియోగదారుల గణాంకాలను విడదీయదు.

అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి ప్రత్యేకమైన డిజిటల్ ప్రసార హక్కుల కోసం జరిగే పోరులో అమెజాన్ ప్రైమ్ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్, సోనీ గ్రూప్ కార్ప్, డిస్నీ వంటి హెవీవెయిట్‌లతో పోటీపడవచ్చని భావిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం