తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Pushpa : అమెజాన్ ప్రైమ్‌లో పుష్ప రికార్డ్ - ఈ ఏడాది అత్య‌ధిక మంది వీక్షించిన ఇండియ‌న్ సినిమా ఇదే

Allu Arjun Pushpa : అమెజాన్ ప్రైమ్‌లో పుష్ప రికార్డ్ - ఈ ఏడాది అత్య‌ధిక మంది వీక్షించిన ఇండియ‌న్ సినిమా ఇదే

18 December 2022, 13:58 IST

google News
  • Allu Arjun Pushpa : అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప టాలీవుడ్ ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమా ఓటీటీలో కొత్త రికార్డ్ సృష్టించింది. ఆ రికార్డ్ ఏదంటే...

అల్లు అర్జున్
అల్లు అర్జున్

అల్లు అర్జున్

Allu Arjun Pushpa : అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప విడుద‌లై శ‌నివారం నాటికి స‌రిగ్గా ఏడాది పూర్త‌యింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చింది. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యానికి ఫ్యామిలీ డ్రామాను జోడించి ద‌ర్శ‌కుడు సుకుమార్ పుష్ప సినిమాను తెర‌కెక్కించారు.

ఇందులో పుష్ప‌రాజ్‌గా అల్లు అర్జున్ న‌ట‌న‌, క్యారెక్ట‌రైజేష‌న్‌తో పాటు మేన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. పాన్ ఇండియ‌న్ స్థాయిలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా దాదాపు 400 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బాలీవుడ్‌లో వంద కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది.

అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఓటీటీలో ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో అత్య‌ధిక మంది వీక్షించిన ఇండియ‌న్ సినిమాల జాబితాలో పుష్ప ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. పుష్ప త‌ర్వాత సెకండ్ ప్లేస్‌లో య‌శ్‌, ప్ర‌శాంత్ నీల్ సూప‌ర్ హిట్ మూవీ కేజీఎఫ్ -2 నిలిచింది. మూడోస్థానాన్ని కేజీఎఫ్ వ‌న్ ద‌క్కించుకోగా సీతారామం నాలుగో ప్లేస్‌లో నిలిచింది.

ఈ జాబితాలో మ‌ణిర‌త్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్ 1 ఐదో ప్లేస్‌ను సొంతం చేసుకున్న‌ది. టాప్ ఫైవ్‌లో మొత్తం ద‌క్షిణాది సినిమాలే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత స్థానాల్లో బ‌చ్చ‌న్ పాండే, జ‌గ్‌జ‌గ్ జియో, ర‌న్ అవే 34, జూరాసిక్ వ‌ర‌ల్డ్ డొమినియ‌న్ సినిమాలు నిలిచాయి.

ప్ర‌స్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కుతోంది. పుష్ప ది రూల్ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం