తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun Pushpa 2 To Begin Shooting On This Date

Allu Arjun Pushpa - 2: అల్లు స్టూడియోలో పుష్ప 2 షూటింగ్ - ముహూర్తం ఫిక్స్

25 September 2022, 9:39 IST

  • Allu Arjun Pushpa - 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పుష్ప‌-2 షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స‌యిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌లుకానుందంటే...

అల్లు అర్జున్
అల్లు అర్జున్ (twitter)

అల్లు అర్జున్

Allu Arjun Pushpa - 2: పుష్ప 2 షూటింగ్ ప్రారంభంపై చాలా రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాట‌న్నింటికి త్వ‌ర‌లోనే పుల్‌స్టాప్ పెట్టేందుకు అల్లు అర్జున్, సుకుమార్ రెడీ అవుతున్నారు. నెల రోజుల క్రితం పుష్ప 2 పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. సెప్టెంబ‌ర్ నెల‌లోనే షూటింగ్ మొద‌లుపెట్టే అవ‌కాశం ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కు షూటింగ్ మాత్రం మొద‌లుపెట్ట‌లేదు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తోనే చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ ప‌నుల‌న్నీ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు

Lineman OTT: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కామెడీ మూవీ.. అక్కడ స్ట్రీమింగ్.. కానీ, చిన్న ట్విస్ట్

Brahmamudi: అనామిక పేరెంట్స్‌ను బెదిరించిన కావ్య- న్యాయం చేయమంటూ నట్టింట్లో కూర్చున్న కనకం- ముకుందతోనే మురారికి బిడ్డ

Jathi Ratnalu 2: జాతి రత్నాలు 2 అప్పుడే! అప్డేట్ ఇచ్చిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్

Premikudu Re Release: ప్రభుదేవా బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమికుడు రీ రిలీజ్.. 30 ఏళ్లకు మళ్లీ.. 300కుపైగా థియేటర్లలో!

అక్టోబ‌ర్ 1 నుంచి పుష్ప 2 షూటింగ్‌ను మొద‌లుపెట్టాల‌ని బ‌న్నీ, సుకుమార్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అదే రోజు హైదరాబాద్ లో అల్లు స్టూడియోను ప్రారంభించబోతున్నట్లు స‌మాచారం. ఈ స్టూడియోలోనే పుష్ప-2 షూటింగ్ ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. రెండు ప‌నుల‌కు ఒకే రోజు ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్లు తెలిసింది. ముందుగా అనుకున్న ప్ర‌కారం సెప్టెంబ‌ర్ నెలాఖ‌రున షూటింగ్ మొద‌లుపెట్టాల్సి ఉండ‌గా...అల్లు స్టూడియో ఓపెనింగ్‌ను దృష్టిలో పెట్టుకొనే అక్టోబ‌ర్ 1కి పోస్ట్ పోన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప‌రాజ్ కుటుంబ నేప‌థ్యంతో పాటు భ‌న్వ‌ర్‌సింగ్ షేకావ‌త్‌తో అత‌డి పోరాటం నేప‌థ్యంలో రెండో భాగం రూపొంద‌నున్న‌ది. తొలి భాగం పాన్ ఇండియ‌న్ స్థాయిలో పెద్ద విజ‌యాన్ని సాధించ‌డంతో సీక్వెల్‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ర‌ష్మిక మంద‌న్న(Rashmika mandanna) హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫ‌హాద్ ఫాజిల్(Fahad Faasil) విల‌న్ గా క‌నిపించ‌బోతున్నాడు. సెకండ్ పార్ట్‌లో ప్రియ‌మ‌ణి నటించే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.