తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Dance: కొరియన్‌ గర్ల్స్‌తో అల్లు అర్జున్‌ వేసిన స్టెప్పులు చూశారా?

Allu Arjun Dance: కొరియన్‌ గర్ల్స్‌తో అల్లు అర్జున్‌ వేసిన స్టెప్పులు చూశారా?

HT Telugu Desk HT Telugu

23 August 2022, 7:44 IST

    • Allu Arjun Dance: కొరియన్‌ గర్ల్స్‌తో టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వేసిన స్టెప్పుల వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇంతకీ అతడు వాళ్లతో డ్యాన్స్‌ ఎందుకు చేశాడు? ఏంటీ వీడియో?
మేము ఆగము సాంగ్ కు స్టెప్పులేస్తున్న అల్లు అర్జున్
మేము ఆగము సాంగ్ కు స్టెప్పులేస్తున్న అల్లు అర్జున్

మేము ఆగము సాంగ్ కు స్టెప్పులేస్తున్న అల్లు అర్జున్

Allu Arjun Dance: టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ చేస్తే ఫ్లోర్‌ అదిరిపోవాల్సిందే. మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చిన ఈ స్టార్‌ హీరో మెగాస్టార్‌లాగే డ్యాన్స్‌లలో చెలరేగిపోతాడు. అలాంటి హీరో నుంచి ఇప్పుడు తొలిసారి ఓ మ్యూజిక్‌ కమ్‌ డ్యాన్స్‌ వీడియో వచ్చింది. ఇందులో అతడు కొరియన్‌ పాప్‌ గ్రూప్‌ అయిన TRI.BE గర్ల్స్‌తో కలిసి స్టెప్పులేయడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

ఈ సాంగ్‌ సోమవారమే లాంచ్‌ అయింది. మేము ఆగము.. అసలు ఆగము అంటూ బాలీవుడ్‌ సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ పాడిన పాటకు బన్నీ స్టెప్స్‌ అదుర్స్‌ అనిపించేలా ఉన్నాయి. కోక్‌ స్టూడియోతో తొలిసారి చేతులు కలిపిన అల్లు అర్జున్‌.. ఈ మ్యూజిక్‌ కమ్‌ డ్యాన్స్ వీడియో చేశాడు. బ్యాగీ ప్యాంట్స్‌, బ్లాక్‌ షర్ట్‌, రెడ్‌ జాకెట్‌లో బన్నీ అదిరిపోయే లుక్‌లో కనిపించాడు.

ఇక అతని డ్యాన్స్ మూవ్స్‌ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. కోక్‌ స్టూడియో ఇండియా ఈ మ్యూజిక్‌ వీడియోను ఆగస్ట్‌ 22 అంటే సోమవారం తన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేసింది. "రెండు మ్యూజిక్‌ ప్రపంచాలు ఒకచోట కలిస్తే అసలైన మ్యాజిక్‌ జరుగుతుంది. అల్లు అర్జున్‌, అర్మాన్‌ మాలిక్‌, TRI.BEతో కలిసి తీసుకొస్తున్న మేము ఆగము వీడియో" అంటూ కోక్‌ స్టూడియో ఇండియా దీనిని పోస్ట్‌ చేసింది.

ఈ సాంగ్‌ను లాస్ట్‌ స్టోరీస్‌ & ఎల్లీ కంపోజ్‌ చేశారు. కునాల్‌ వర్మ, ఎల్లీ, ఎస్‌.టైగర్‌ లిరిక్స్‌ అందించారు. ఈ సాంగ్‌ను డైరెక్ట్‌ చేసింది కొలిన్‌ డీ'కున్యా. ఈ మ్యూజిక్‌ వీడియోలో అల్లు అర్జున్‌, అర్మాన్‌ మాలిక్‌, కొరియన్‌ పాప్‌ గ్రూప్‌ ట్రైబ్‌ కనిపించారు. పుష్ప తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌ కమర్షియల్‌ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే త్రివిక్రమ్‌తోనూ అతడు ఓ యాడ్‌ షూట్‌ చేశాడు. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్‌ ప్రారంభం కావడంతో ఇక నుంచి ఆ పనిలో బిజీగా కానున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం