Allu Arjun: స్టైలిష్‌ లుక్‌లో అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌తో షూట్‌.. ఫొటో వైరల్-allu arjuns stylish look for an ad shoot going viral in social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun: స్టైలిష్‌ లుక్‌లో అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌తో షూట్‌.. ఫొటో వైరల్

Allu Arjun: స్టైలిష్‌ లుక్‌లో అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌తో షూట్‌.. ఫొటో వైరల్

HT Telugu Desk HT Telugu
Jul 26, 2022 04:55 PM IST

Allu Arjun: అల్లు అర్జున్‌ను స్టైలిష్‌ స్టార్‌ అని పిలుస్తారు. స్టైల్‌కు ఐకాన్‌గా నిలిచే అతడు.. సినిమాల్లో అయినా, బయట అయినా స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తాడు. తాజాగా అలాంటిదే ఓ ఫొటో వైరల్‌ అవుతోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Twitter)

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎంతో స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్న అల్లువారబ్బాయి ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం వెళ్తున్నప్పటి ఫొటోస్‌ అవి. ఫ్లోరల్‌ షర్ట్‌, జాగర్స్‌, తలపై హ్యాట్‌తో అర్జున్‌ ఎంతో కూల్‌ లుక్‌లో కనిపించాడు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో రాగానే ఎంతో మంది లైక్స్‌, కామెంట్స్‌, షేర్లతో హోరెత్తించారు.

ఈ యాడ్‌ షూట్‌ను త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్ట్‌ చేస్తుండటం విశేషం. అర్జున్‌ కారు దిగి వచ్చినప్పటి నుంచి త్రివిక్రమ్‌తో కలిసే వరకూ ఉన్న ఫొటోలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక షూటింగ్‌ కోసం ఆ వెంటనే వైట్‌ టీషర్ట్‌, రెడ్‌ జాకెట్‌, డెనిమ్‌లో కనిపించాడు. ఈ లుక్‌లో కూడా అర్జున్‌ ఎంతో స్టైలిష్‌గా కనిపించడం విశేషం. త్రివిక్రమ్‌తో జులాయి, అల వైకుంఠపురంలోలాంటి హిట్‌ మూవీస్‌ను అల్లు అర్జున్‌ తీసిన విషయం తెలిసిందే.

ఇప్పుడీ యాడ్‌ షూట్‌లో మరోసారి అతడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో నటించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఈ స్టైలిష్‌ స్టార్‌ పుష్ప 2 షూటింగ్‌ ప్రారంభించనున్నాడు. పుష్ప సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్‌ చివర్లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point

టాపిక్