తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arha Shakuntalam Movie: శాకుంత‌లం సినిమాకు అల్లు అర్హ సొంత డ‌బ్బింగ్ - ఫొటో షేర్ చేసిన అల్లు అర్జున్‌

Allu Arha Shakuntalam Movie: శాకుంత‌లం సినిమాకు అల్లు అర్హ సొంత డ‌బ్బింగ్ - ఫొటో షేర్ చేసిన అల్లు అర్జున్‌

19 January 2023, 7:51 IST

  • Allu Arha Shakuntalam Movie: అల్లు అర్జున్ ముద్దుల త‌న‌య అల్లు అర్హ‌ శాకుంత‌లంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం అల్లు అర్హ సొంతంగా డ‌బ్బింగ్ చెబుతోంది. అల్లు అర్హ త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెబుతోన్న ఫొటోను అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

అల్లు అర్హ
అల్లు అర్హ

అల్లు అర్హ

Allu Arha Shakuntalam Movie: అల్లు అర్జున్ త‌న‌య అల్లు అర్హ శాకుంత‌లం సినిమాతో బాల‌న‌టిగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై తొలి అడుగు వేయ‌బోతున్న‌ది. మైథ‌లాజిక‌ల్ ల‌వ్ స్టోరీతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్హ క‌నిపించ‌బోతున్న‌ది. ఇటీవ‌ల రిలీజైన ట్రైల‌ర్‌లో సింహాంపై స్వారీ చేస్తూ అల్లు అర్హ క‌నిపించింది. ఈ సీన్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

కాగా త‌న పాత్ర కోసం అల్లు అర్హ సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటూ తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా నిరూపించుకున్న‌ది. శాకుంత‌లం సినిమాకు అల్లు అర్హ డ‌బ్బింగ్ చెబుతోన్న ఫొటోను అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోకు హార్ట్ ఎమోజీని జోడించాడు. అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

శాకుంత‌లం సినిమాలో టైటిల్ పాత్ర‌లో స‌మంత క‌నిపిస్తోంది. మ‌హాభార‌తంలోని దుష్యంతుడు, శ‌కుంత‌ల ప్రేమ‌క‌థ ఆధారంగా ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. బుధ‌వారం శాకుంత‌లం ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. మ‌ల్లికా మ‌ల్లికా అంటూ సాగే ఈ పాట‌కు మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమాలో దుష్యంతుడిగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్‌మోహ‌న్ క‌నిపించ‌బోతున్నారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌తో పాటు హిందీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. శాకుంత‌లం సినిమాను గుణ‌శేఖ‌ర్ త‌న‌య నీలిమ గుణ‌తో క‌లిసి దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం