తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  2018 Telugu Ott Release Date: బ‌న్నీవాస్‌కు షాక్‌- ప‌ది రోజుల్లోనే ఓటీటీలోకి 2018 తెలుగు వెర్ష‌న్‌

2018 Telugu OTT Release Date: బ‌న్నీవాస్‌కు షాక్‌- ప‌ది రోజుల్లోనే ఓటీటీలోకి 2018 తెలుగు వెర్ష‌న్‌

HT Telugu Desk HT Telugu

01 June 2023, 18:00 IST

google News
  • 2018 Telugu OTT Release Date: 2018 తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో విడుద‌లైన ప‌ది రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే...

2018 మూవీ
2018 మూవీ

2018 మూవీ

2018 Telugu OTT Release Date: మ‌ల‌యాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన 2018 మూవీ ఇటీవ‌లే అదే పేరుతో తెలుగులో థియేట‌ర్ల‌లో రిలీజైన సంగ‌తి తెలిసిందే. రెండు కోట్ల క‌లెక్ష‌న్స్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఐదు రోజుల్లోనే ఆరున్న‌ర కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు డ‌బుల్ ప్రాఫిట్స్‌ను మిగిల్చింది. గ‌త నెల 26న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ విడుద‌లై వారం దాటినా క‌లెక్ష‌న్స్ (Collections) మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

ఇప్ప‌టికీ ప్ర‌తిరోజు కోటికిపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌డుతూ ట్రేడ్ వ‌ర్గాలను విస్మ‌య‌ప‌రుస్తోంది. కాగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన ప‌ది రోజుల్లోనే 2018 తెలుగు వెర్ష‌న్ ఓటీటీలో రిలీజ్ కానుంది.

జూన్ 7న 2018 మ‌ల‌యాళం వెర్ష‌న్ మాత్ర‌మే ఓటీటీలో రిలీజ్ చేస్తోన్న‌ట్లు సోనిలివ్ (Sonyliv) ప్ర‌క‌టించింది. తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో ఆడుతుండ‌టంతో ఆల‌స్యంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ నిర్మాత‌ల‌కు షాకిస్తూ మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అదే రోజు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు సోనిలివ్ ప్ర‌క‌టించింది.

గురువారం జ‌రిగిన 2018 స‌క్సెస్‌మీట్‌లో ఈ సినిమా తెలుగు ఓటీటీ రిలీజ్ డేట్‌పై అల్లు అర‌వింద్‌తో పాటు బ‌న్సీవాస్ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. మినిమం రెండు వారాల గ్యాప్ ఉంటే బాగుండేద‌ని పేర్కొన్నారు. 2018లో వ‌చ్చిన కేర‌ళ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

2018 మూవీలో టోవినో థామ‌స్‌, వినీత్ శ్రీనివాస‌న్‌, కుంచ‌కో బోబ‌న్‌, లాల్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. గ‌త నెల‌లో మ‌ల‌యాళంలో రిలీజైన మూవీ 160 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం