తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Alia Bhatt: పెళ్లి తర్వాత ఫస్ట్‌ నైట్‌ ఏంటి.. అలాంటిదేమీ ఉండదు: ఆలియా భట్‌

Alia Bhatt: పెళ్లి తర్వాత ఫస్ట్‌ నైట్‌ ఏంటి.. అలాంటిదేమీ ఉండదు: ఆలియా భట్‌

HT Telugu Desk HT Telugu

05 July 2022, 18:36 IST

google News
    • Alia Bhatt: బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ ఏం మాట్లాడినా సంచలనమే. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న ఆమె ఫస్ట్‌ నైట్‌ గురించి కాఫీ విత్‌ కరణ్‌ షోలో చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.
ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ జోడీ
ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ జోడీ (HT_PRINT)

ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ జోడీ

Koffee with Karan కొత్త సీజన్‌ త్వరలోనే రాబోతోంది. ఈ సీజన్‌ తొలి ఎపిసోడ్‌లోనే రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌లను ఇంటర్వ్యూ చేశాడు షో హోస్ట్‌ కరణ్‌ జోహార్‌. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. ఈ ప్రోమోలో కరణ్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఆలియా ఇచ్చిన ఆన్సర్‌ ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఆమె మరీ ఇంత బోల్డ్‌గా సమాధానమిచ్చిందేంటి అని ఫ్యాన్స్‌ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ షోలో ఆలియాను కరణ్ ఓ ప్రశ్న వేస్తూ.. "పెళ్లి తర్వాత జరుగుతుందని నువ్వు పెళ్లికి ముందు భావించినా.. అది జరగని అపోహ ఏంటో చెబుతావా" అని అడిగాడు. దీనికి ఆలియా సమాధానమిస్తూ.. పెళ్లి తర్వాత ఫస్ట్‌నైట్‌ అంటూ ఉండదు.. అప్పటికే మనం చాలా అలసిపోతాం అని అనడం విశేషం. ఈ సమాధానం వినగానే పక్కనే ఉన్న రణ్‌వీర్‌, కరణ్‌ పెద్దగా నవ్వడం ప్రోమోలో చూడొచ్చు.

ఈ కొత్త షో తొలి ఎపిసోడ్‌ ప్రోమో ఆసక్తి రేపుతోంది. ఈ జంట గురించి ఇంట్రడక్షన్‌ ఇస్తూ.. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.. కానీ ఒకరినొకరు కాదు అని కరణ్‌ చెబుతాడు. ఇక స్క్రీన్‌పై కెమెస్ట్రీ ఎవరితో బాగా పండింది.. రణ్‌వీర్‌తోనా లేక వరుణ్‌ధావన్‌తోనా అని కూడా ఆలియాను కరణ్‌ అడిగాడు. దీనికి ఆలియా ఏం ఆన్సర్‌ ఇచ్చిందో చూపెట్టలేదు కానీ.. రణ్‌వీర్‌ మాత్రం నిన్ను చంపేస్తా అంటూ ఆలియాను అనడం చూడొచ్చు.

గతంలో ఇదే కాఫీ విత్‌ కరణ్‌ షోలో ఆలియా భట్‌ తన ఫేవరెట్‌ సెక్స్‌ పొజిషన్‌ గురించి మాట్లాడి సంచలనం రేపింది. రణ్‌బీర్‌తో పెళ్లి సందర్బంగా ఆమెను నెటిజన్లు ఇదే ప్రశ్న వేసి ట్రోల్‌ చేశారు. రణ్‌బీర్‌కు నీ ఫేవరెట్‌ పొజిషన్‌ ఏంటో చెప్పావా అంటూ ఆలియాను ఆటపట్టించారు. ఈ మధ్యే రణ్‌బీర్‌ కపూర్‌ను పెళ్లి చేసుకున్న ఆలియా భట్‌.. తాను ప్రెగ్నెంట్‌ అని కూడా సోషల్‌ మీడియా ద్వారా అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే.

కాఫీ విత్ కరణ్‌ షో అంటేనే ఇలాంటి స్పైసీ టాక్‌ కామన్‌. తన షోకు ఏ హీరో లేదా హీరోయిన్‌ వచ్చినా వాళ్లను బోల్డ్‌గా ప్రశ్నలు అడుగుతాడు కరణ్‌ జోహార్‌. వాటికి వాళ్లు కూడా అలాగే సమాధానం చెబుతారు. ఈ లేటెస్ట్‌ సీజన్‌ ఈ నెల 7 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో టెలికాస్ట్‌ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం