తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ai Shiva Trap Trance: ఇండియన్ సినిమాలో తొలి 𝐀𝐈 జెనరేటడ్ సాంగ్.. పవర్‌ఫుల్‌గా శివ ట్రాప్ ట్రాన్స్

AI Shiva Trap Trance: ఇండియన్ సినిమాలో తొలి 𝐀𝐈 జెనరేటడ్ సాంగ్.. పవర్‌ఫుల్‌గా శివ ట్రాప్ ట్రాన్స్

Sanjiv Kumar HT Telugu

19 February 2024, 8:54 IST

  • Bhoothaddam Bhaskar Narayana AI Song: భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలోని శివ ట్రాప్ సాంగ్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ శివ ట్రాప్ ట్రాన్స్ లిరికల్ వీడియో సాంగ్‌ను ఏఐ చాట్ జీపీటీనీ ఉపయోగించి జెనరేట్ రూపొందించారు. ఇలా చేయడం భారతదేశంలోనే తొలిసారి.

AI Shiva Trap Trance: 𝐀𝐈 రూపొందించిన పాట.. పవర్‌ఫుల్‌గా శివ ట్రాప్ ట్రాన్స్.. ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైమ్
AI Shiva Trap Trance: 𝐀𝐈 రూపొందించిన పాట.. పవర్‌ఫుల్‌గా శివ ట్రాప్ ట్రాన్స్.. ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైమ్

AI Shiva Trap Trance: 𝐀𝐈 రూపొందించిన పాట.. పవర్‌ఫుల్‌గా శివ ట్రాప్ ట్రాన్స్.. ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైమ్

AI Song Shiva Trap Trance: శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ. సినిమా మొదటి నుంచి అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది.

ట్రెండింగ్ వార్తలు

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

బోల్డ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్ట‌ర్ - ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్‌

Kiara Advani: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!

Karthika Deepam Chandu: కార్తీక దీపం చందు ఆత్మ‌హ‌త్య - ప‌విత్ర జ‌యరాం చ‌నిపోయిన ఐదు రోజుల‌కే బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న భూతద్ధం భాస్కర్ నారాయణ టైటిల్ సాంగ్ వైరల్ అయ్యింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో భూతద్ధం భాస్కర్ నారాయణ నుంచి 'శివ ట్రాప్ ట్రాన్స్' పాటని రిలీజ్ చేశారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణీ ఈ పాటని లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ పాట గూస్ బంప్స్ తెప్పించింది. చైతన్య ప్రసాద్ అందించిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. సింగర్ కాలభైరవ హై ఎనర్జీతో పాడిన ఈ పాట నిజంగానే ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళుతుంది.

భూతద్ధం భాస్కర్ నారాయణలోని శివ ట్రాప్ ట్రాన్స్ సాంగ్ లిరికల్ విజువల్స్ AI చాట్ జీపీటీని ఉపయోగించి రూపొందించారు. ఇండియన్ సినిమాలో మొదటి 𝐀𝐈 జెనరేటడ్ లిరికల్ వీడియో ఇదే కావడం విశేషం. హీరో సుహాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. దర్శకుడు విజయ్ కనకమేడల, హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్నారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఒక్కొక్కరు స్పీచ్ ఇచ్చారు.

"నిర్మాతలు స్నేహాల్, శశిధర్, కార్తీక్ గారికి, దర్శకుడు పురుషోత్తం రాజ్కు అభినందనలు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కలర్ ఫోటోకి ముందు 'మను చరిత్ర' సినిమాలో శివ స్నేహితుడిగా చేశాను. రాజ్ కందుకూరి నిజంగా తన బిడ్డలానే చూసుకునే వారు. నేను హీరో కాకముందే హీరోలా చూశారు. శివ చాలా మంచోడు. వెరీ జెన్యూన్ పర్సన్. రాశి చాలా మంచి నటి. రాబోయే నా 'ప్రసన్నవదనం' సినిమాలో తనతో నటించాను" అని హీరో సుహాస్ తెలిపాడు.

"చైతన్య ప్రసాద్ లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. శ్రీచరణ్ అద్భతమైన మ్యూజిక్ ఇచ్చారు. భూతద్ధం భాస్కర్ నారాయణ మార్చి 1న థియేటర్స్‌లోకి వస్తుంది. తప్పకుండా అందరూ చూడాలి'' అని హీరో సుహాస్ కోరాడు. శివ తన బెస్ట్ ఫ్రెండ్‌లో ఒకరని, ఈ సినిమా కంటెంట్ తనకు చాలా నచ్చిందని, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పింది హీరోయిన్ వర్ష బొల్లమ్మ.

"'శివ ట్రాప్ ట్రాన్స్' పాట ఓ రేంజ్ లో ఉంది. చైతన్య ప్రసాద్ అద్భుతంగా రాశారు. నేపథ్య సంగీతంలో ఇలాంటి పాటలు వచ్చి సినిమాని నిలబెడుతున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో చుస్తున్నాం. ఈ పాట కూడా అంత పవర్ ఫుల్‌గా ఉంది. శ్రీచరణ్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. భూతద్ధం భాస్కర్ నారాయణ టైటిల్ లానే ఈ కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. శివ చాలా పాజిటివ్ పర్సన్. తనకి మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' అని దర్శకుడు విజయ్ కనకమేడల తెలిపారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం