తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Devarakonda | వార్ బ్యాక్ డ్రాప్ లో విజ‌య్‌-పూరి జ‌గ‌న్నాథ్ నెక్ట్స్ సినిమా... ప్రీ లుక్ రిలీజ్

vijay devarakonda | వార్ బ్యాక్ డ్రాప్ లో విజ‌య్‌-పూరి జ‌గ‌న్నాథ్ నెక్ట్స్ సినిమా... ప్రీ లుక్ రిలీజ్

Nelki Naresh HT Telugu

28 March 2022, 12:40 IST

  • ‘లైగ‌ర్’ త‌ర్వాత హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న‌ది. ఈ కొత్త చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల‌చేశారు

విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మి
విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మి (twitter)

విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మి

విజ‌య్ దేవ‌ర‌కొండ,ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ క‌ల‌యిక‌లో ప్ర‌స్తుతం ‘లైగ‌ర్’ సినిమా రూపొందుతోంది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ లో ప్రేక్ష‌కుల ముందుకురానున్న‌ది. ‘లైగర్’ రిలీజ్ కాక‌ముందే విజ‌య్‌,పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను సోమ‌వారం ప్ర‌క‌టించారు.

ట్రెండింగ్ వార్తలు

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. కానీ, అదొక్కటే నిరాశ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Anushka: అరుంధ‌తిలో అనుష్క ఫ‌స్ట్ ఛాయిస్ కాదు - ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని మిస్‌ చేసుకున్న మ‌ల‌యాళం హీరోయిన్ ఎవ‌రంటే?

ప్రీ లుక్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఎయిర్‌ఫోర్స్ విమానంతో పాటు యుద్ద ట్యాంక‌ర్స్ క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎయిర్‌ఫోర్స్ పైలెట్ గా క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాల్ని మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. నెక్ట్స్ మిష‌న్ లాంఛ్ అంటూ అత‌డు షేర్ చేసిన పోస్ట‌ర్ పై ఉన్న క్యాప్ష‌న్ ఆసక్తిని పంచుతోంది.

ఈ సినిమాకు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు త‌న స్వీయ నిర్మాణ సంస్థ పూరి క‌నెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌,ఛార్మి నిర్మించనున్నట్లు సమాచారం.

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం