తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Adi Purush: ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్

Prabhas Adi purush: ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్

HT Telugu Desk HT Telugu

08 September 2022, 14:33 IST

  • Prabhas Adi purush: ప్ర‌భాస్ హీరోగా పౌరాణిక క‌థాంశంతో రూపొందుతున్న ఆదిపురుష్ సినిమా సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ కాబోతున్న‌ది. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 23న స్పెష‌ల్ అప్‌డేట్‌తో చిత్ర యూనిట్ అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతున్న‌ది. ఆ అప్‌డేట్ ఏదంటే...

ప్ర‌భాస్
ప్ర‌భాస్ (Twitter)

ప్ర‌భాస్

Prabhas Adi purush: ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న పాన్ ఇండియ‌న్ సినిమా ఆదిపురుష్ షూటింగ్ మొద‌లై రెండేళ్లు గ‌డుస్తోంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా నుంచి ప్ర‌భాస్ తో పాటు ఇత‌ర న‌టీన‌టుల ఫ‌స్ట్‌లుక్‌ పోస్టర్స్, టీజర్స్ రిలీజ్ చేయ‌లేదు. ముఖ్యంగా ప్ర‌భాస్ ఫ‌స్ట్‌లుక్ కోసం కొన్ని నెల‌లుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు . వారి నిరీక్ష‌ణ‌కు ప్ర‌భాస్ బ‌ర్త్‌డేతో తెర‌ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Nani: నాని సినిమాపై సందిగ్ధత.. ఆ ప్రాజెక్ట్ ఉంటుందా?

Payal Rajput Rakshana Release Date: పాయల్ రాజ్‌పుత్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే నెలలోనే..

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆది పురుష్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. స్పెష‌ల్ వీడియో గ్లింప్స్ కూడా విడుదలయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానుల‌కు భారీ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు ఓంరౌత్ చెప్పాడు. ఎవ‌రు ఎక్స్‌పెక్ట్ చేయ‌ని విధంగా ఈ స‌ర్‌ప్రైజ్ ఉండ‌బోతున్న‌ట్లు పేర్కొన్నాడు. ఫస్ట్ లుక్ ను ఉద్దేశించే ఓంరౌత్ ఈ కామెంట్స్ చేసినట్లు అభిమానులు పేర్కొంటున్నారు. ప్ర‌భాస్ బ‌ర్త్‌డే రోజున స్పెష‌ల్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది.

రామాయ‌ణ గాథ ఆధారంగా దాదాపు ఐదు వంద‌ల కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ విధానంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌బోతుండ‌గా సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టిస్తోంది. విల‌న్‌గా సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌బోతున్నారు. తెలుగు, హిందీతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం,క‌న్న‌డ భాష‌ల్లో సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆది పురుష్ రిలీజ్ కానుంది. ఐమాక్స్ వెర్ష‌న్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను ప్ర‌స్తుతం విదేశాల్లో పూర్తి చేసే ప‌నిలో చిత్ర యూనిట్ ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం