తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sharath Babu : శరత్ బాబు కోలుకుంటున్నాడు, ఫేక్ న్యూస్ నమ్మెుద్దు

Sharath Babu : శరత్ బాబు కోలుకుంటున్నాడు, ఫేక్ న్యూస్ నమ్మెుద్దు

Anand Sai HT Telugu

04 May 2023, 7:29 IST

    • Sharath Babu Condition : కొన్ని రోజులుగా సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి మీద పుకార్లు వస్తున్నాయి. దీనిపై ఆయన కుటుంబం స్పందించింది. ఎలాంటి వార్తలు నమెుద్దని చెప్పింది.
శరత్ బాబు
శరత్ బాబు (twitter)

శరత్ బాబు

ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు(Sharath Babu) తుదిశ్వాస విడిచారని.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. తప్పుడు వార్తలను నమ్మెుద్దని ఆయన సోదరి ఓ ప్రకటన విడుదల చేశారు. అనారోగ్య సమస్యలతో శరత్ బాబు.. కొన్ని రోజులుగా హైదరాబాద్(Hyderabad)లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Payal Rajput: వారు వేదిస్తున్నారు: లీగల్ యాక్షన్‍కు రెడీ అయిన పాయల్ రాజ్‍పుత్

Guppedantha Manasu May 20th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రపై రాజీవ్ హత్యాయత్నం- ధరణి కాళ్లు పట్టుకున్న భర్త

krishna mukunda murari serial: అబార్షన్ చేయించుకున్న మీరా.. బిడ్డ కోసం గుండెలు పగిలేలా ఏడ్చిన కృష్ణ

Jr NTR Movies OTT: హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్: మ్యాన్ ఆఫ్ మాసెస్ సూపర్ హిట్ సినిమాలు ఈ ఓటీటీల్లో చూసేయండి

అయితే శరత్ బాబు.. ఆరోగ్య పరిస్థితి(Sharath Babu Health Condition) విషమంగా ఉందని కొందరు వార్తలు వైరల్ చేస్తుంటే.. మరికొందరేమో ఆయన మరణించారంటూ.. ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ వైబ్ సైట్లు సైతం.. శరత్ బాబు ఇకలేరని వార్తలు పబ్లిష్ చేశాయి. ఈ వార్తలపై ఆయన సోదరి స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. శరత్ బాబు ఆరోగ్యం(Sharath Babu Health) ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని తెలిపింది.

'శరత్ బాబు కొంచెం రికవరీ అయ్యారు. రూమ్ కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. తొందరలోనే శరత్ బాబు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారని ఆశిస్తున్నాం. ఆయన గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలను ఎవరూ నమ్మవద్దు.' అని ఆయన సోదరి ఓ ప్రకటన విడుదల చేసింది.

చాలా రోజులు శరత్ బాబు ఆరోగ్యం బాగాలేదు. గతంలో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ మధ్య అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ పై శరత్ బాబుకు చికిత్స అందించారు. కానీ ఆయన అవయవాలు బాగా దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు. అప్పటి నుంచి ఆరోగ్యంపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు సైతం.. శరత్ బాబు ఇక లేరు అంటూ సోషల్ మీడియా(Social Media) పోస్టులు పెట్టారు. ప్రముఖ నటి ఖుష్బు కూడా శరత్ బాబు మరణ వార్తను పంచుకున్నారు. టాలీవుడ్(Tollywood), కోలీవుడ్ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో సంతాప సందేశాలు పోస్ట్ చేశారు. అయితే ఆ వార్త అవాస్తవమని నిర్ధారణ కావడంతో ఆ పోస్టులను తొలగించారు.

1973లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన శరత్ బాబు తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. చాలా సినిమాల్లో కథానాయకుడిగా, ద్వితీయ నాయకుడిగా నటించారు. శరత్ బాబు తన 40 ఏళ్ల సినీ జీవితంలో 200కు పైగా పాత్రల్లో నటించారు. ఇటీవల చిత్ర పరిశ్రమకు కాస్త దూరంగా ఉన్న శరత్ బాబు చివరిసారిగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన వకీల్ సాబ్ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం