Women fighting for saree : వైరల్​ వీడియో- వామ్మో.. చీర కోసం ఇలా కొట్టుకున్నారేంటి!-viral video shows women fighting pulling hair at saree sale event in bengaluru ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Women Fighting For Saree : వైరల్​ వీడియో- వామ్మో.. చీర కోసం ఇలా కొట్టుకున్నారేంటి!

Women fighting for saree : వైరల్​ వీడియో- వామ్మో.. చీర కోసం ఇలా కొట్టుకున్నారేంటి!

Sharath Chitturi HT Telugu
Apr 25, 2023 06:31 AM IST

Women fighting for saree : బెంగళూరులో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్​గా మారింది. ఇద్దరు మహిళలు చీరల కోసం గట్టిగా కొట్టున్నారు! అసలేం జరిగిందంటే..

వైరల్​ వీడియో- వామ్మో.. చీర కోసం ఇలా కొట్టుకున్నారేంటి!
వైరల్​ వీడియో- వామ్మో.. చీర కోసం ఇలా కొట్టుకున్నారేంటి!

Women fighting for saree : చీరలు, డ్రెస్​లు, షాపింగ్​పై ఆడవారికి ఉండే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 'డిస్కౌంట్​, సేల్​' వంటి పదాలు వినపడితే.. వారు ఎంత దూరమైన వెళుతుంటారు! ఒక్కోసారి ఈ ప్రేమ.. ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఓ ఘటన ఇందుకు ఉదాహరణ. బట్టల దుకాణంలో సేల్​ జరుగుతుండా.. ఓ చీర కోసం ఇద్దరు మహిళలు కొట్టుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వారిద్దరు జట్లు పట్టుకుని, చెంపలు చెళ్లుమనిపించుకున్నారు!

ఇదీ జరిగింది..

బెంగళూరు మల్లేస్వరం దుకాణంలో మైసూర్​ సిల్క్​ శారీ ఇయర్​ సేల్​ జరిగింది. చాలా మంది మహిళలు సేల్​ కోసం ఎగబడ్డారు. ఫలితంగా అక్కడి ప్రాంతం చీరలు, మహిళలతో కిటకిటలాడిపోయింది. ఇంతలో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది. ఓ చీర కోసం వారిద్దరు వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికే ఆ గొడవ ముదిరింది. ఇద్దరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. చెంపలు చెళ్లుమనిపించుకున్నారు. అక్కడి నుంచి పరిగెత్తుతూ కొట్టున్నారు. ఒక మహిళ.. మరో మహిళ జట్టుపట్టుకుని లాగేసింది. సెక్యూరిటీ గార్డు, షాపు సిబ్బంది.. వారిద్దరిని శాంతిపజేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Malleswaram saree sale viral video : ఈ వీడియోను ఆర్​ విద్య అనే ట్విట్టర్​ యూజర్​ షేర్​ చేసింది. మహిళలు గొడవపడుతుంటే.. ఇతరులు ఎవరి పనిలో వారు బిజీగా ఉన్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. మహిళలు షాపింగ్​లో బిజీ బిజీగా ఉన్నారు. కొట్టుకుంటున్న మహిళలను ఆపేందుకు ఎవరు పెద్దగా ఆసక్తి చూపించలేదు.

'శారీ అంటే ఎమోషన్​..'

ట్విట్టర్​లో ఈ వీడియోకు ఇప్పటికే 1లక్షకుపైగా వ్యూస్​ వచ్చాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Malleswaram saree sale : "అంత గొడవ జరుగుతున్నా.. ఇతర మహిళలు పట్టించుకోకుండా, ఎవరి షాపింగ్​ వారు చేసుకుంటున్నారు. చాలా గ్రేట్​," అని ఓ నెటిజన్​ రాసుకొచ్చారు.

"చీర అంటే బట్ట గుడ్డ కాదు.. అదొక ఎమోషన్​!" అని ఇంకో నెటిజన్​ కామెంట్​ పెట్టాడు.

Bengaluru viral video : "ఈ దేశంలో ప్రజలు భూమి కోసం, డబ్బు కోసం, చీరల కోసం కొట్టుకుంటారు," అని మరో వ్యక్తి రాసుకొచ్చారు.

"ఆ చీరలకు అంత డిమాండ్​ ఉందని తెలుస్తోంది. ఈ వీడియోను యాడ్​గా చూపించవచ్చు," అని మరో వ్యక్తి పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :

IPL_Entry_Point

సంబంధిత కథనం