Manobala Favourite Hero : మనోబాలకు నచ్చిన తెలుగు హీరో ఎవరు? తీరని కోరిక ఇదే..!-tamil actor manobala likes allu arjun very much after pushpa movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manobala Favourite Hero : మనోబాలకు నచ్చిన తెలుగు హీరో ఎవరు? తీరని కోరిక ఇదే..!

Manobala Favourite Hero : మనోబాలకు నచ్చిన తెలుగు హీరో ఎవరు? తీరని కోరిక ఇదే..!

Anand Sai HT Telugu
May 03, 2023 04:10 PM IST

Manobala Telugu Favourite Hero : ప్రముఖ హాస్యనటుడు మనోబాల మృతితో సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన తెలుగు ప్రేక్షుకులు కూడా బాగా తెలుసు. తెలుగులో ఓ హీరో అంటే.. ఆయనకు చాలా ఇష్టం. అతడిని కలవాలని ఉందని కూడా ఓసారి చెప్పాడు మనోబాల. కానీ కలవలేదు.

మనోబాల
మనోబాల (twitter)

కమెడియన్ మనోబాల(Comedian Manobala) మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేశారయన. తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. సౌత్ ప్రేక్షకులకు ఆయన బాగా తెలుసు. అంతేకాదు.. నిర్మాతగా, దర్శకుడిగానూ ప్రతిభ చూపించారు. 69 ఏళ్ల వయసులో ఆరోగ్య పరిస్థితి సరిగా లేక మరణించారు. ఆయన మృతితో సినిమా పరిశ్రమలో విషాదం నెలకొంది.

2008 సంవత్సరంలో రజనీకాంత్(Rajanikanth) నటించిన కథానాయకుడు సినిమా ద్వారా తెలుగులోకి ప్రవేశించారు మనోబాల. ముమైత్ ఖాన్ నటించిన పున్నమినాగు, అనంతరం మనసు మాయ సేయకే, డేగ, రాజాధిరాజా, నాయకి, మహానటి(Mahanati), సీమ రాజా, రాజ్ దుత్, కాలేజ్ కుమార్, వాల్తేరు వీరయ్య(Waltair Veerayya)లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. చంద్రముఖి(chandramukhi) లాంటి డబ్బింగ్ చిత్రాల ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన చెప్పే డైలాగ్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

మనోబాల(Manobala)కు తెలుగులో ఓ హీరో అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగులో తనకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్(Allu Arjun) అని చెప్పారు. 'నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప సినిమా(Pushpa Cinema) సక్సెస్ తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. అర్జున్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయనను కలుసుకోవాలని ఉంది. కానీ కుదరడం లేదు. నన్ను ఎవరూ ఆయనను కల్పించడం లేదు.' అని మనోబాల వివరించారు. అల్లు అర్జున్ ను కలుసుకోవాలనే కోరిక ఆయనకు బాగా ఉండేదని ఆయన మాటలు చూస్తే అర్థమవుతోంది. కానీ ఆ కోరిక తీరకుండానే.. మృతి చెందారు.

సినిమాల్లో తనదైన ముద్రవేశారు మనోబాల. ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. వేస్ట్ పేపర్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నడిపించారు. కొన్ని ముఖ్యమైన చిత్రాలను కూడా నిర్మించారు. తమిళంలో 700కు పైగా చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్‌లో నటించారు. ఎక్కువగా హాస్య పాత్రలు చేస్తూ కనిపించారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు.

1970లో సినీ పరిశ్రమలో మనోబాల(Manobala) అడుగుపెట్టారు. 1979లో భారతీరాజ(bharathi raja) వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. 1982లో అగయ గంగయ్ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత 20కి పైగా చిత్రాలను దర్శకుడిగా తెరకెక్కించారు. మూడు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. దిగ్గజ నటులు సినిమాల్లో హాస్యనటుడిగా చేశారు. అంతేకాదు.. పలు సీరియళ్లలోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చివరగా 'కొండ్రాల్ పావమ్, గోస్టీ' సినిమాల్లో నటించారు మనోబాల.

IPL_Entry_Point