తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  గాడ్ ఫాదర్: చిరంజీవితో కలిసి నటించడం అద్భుతమైన అనుభవం - సల్మాన్ ఖాన్

గాడ్ ఫాదర్: చిరంజీవితో కలిసి నటించడం అద్భుతమైన అనుభవం - సల్మాన్ ఖాన్

HT Telugu Desk HT Telugu

29 March 2022, 15:05 IST

    • గాడ్‌ఫాదర్‌ చిత్రంలో చిరంజీవి పాత్ర ఉందని బాలీవుడ్ దబాంగ్ స్టార్ సల్మాన్ ఖాన్ అన్నారు. రాంచరణ్‌పై సల్మాన్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు.
సల్మాన్ కాన్
సల్మాన్ కాన్ (ani)

సల్మాన్ కాన్

ముంబై: గాడ్‌ఫాదర్ చిత్రంలో చిరంజీవితో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం అని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అన్నారు. చిరంజీవి తదుపరి చిత్రం 'గాడ్‌ఫాదర్‌'లో తాను ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు సల్మాన్‌ఖాన్‌ తెలిపారు. 

ట్రెండింగ్ వార్తలు

Manjummel Boys OTT Response: ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే!

The Family Man Season 3: ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై గుడ్ న్యూస్ చెప్పిన ప్రైమ్ వీడియో

Baak OTT: ఓటీటీలోకి తమన్నా రాశీ ఖన్నా తమిళ హారర్ మూవీ బాక్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Thalaimai Seyalagam OTT: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు రానున్న శ్రీయారెడ్డి పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. డేట్ ఇదే

‘చిరంజీవితో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. చిరు నాకు చాలా కాలంగా తెలుసు. అతను నాకు స్నేహితుడయ్యారు. అదే సమయంలో అతని కుమారుడు (రామ్ చరణ్) కూడా స్నేహితుడే. అతను ఆర్ఆర్ఆర్‌లో అద్భుతంగా నటించాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా, సినిమా విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశాను. నేను వారి గురించి చాలా గర్వపడుతున్నాను. అతను చాలా గొప్పగా చేస్తున్నాడు. అది చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ సౌత్ ఇండియాలో మన సినిమాలు పెద్దగా ఆడకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని సల్మాన్ అన్నారు.

సౌత్ ఇండియన్ సినిమాలు చూడటం కూడా తనకు చాలా ఇష్టమని సల్మాన్ ఖాన్ తెలిపారు. ‘సినిమా నిర్మాతలు నా దగ్గరకు వస్తే తమిళం, తెలుగు సినిమాలు తీసుకురారు. హిందీ సినిమాల కోసం నా దగ్గరకు వస్తారు..’ అని సల్మాన్ ఖాన్ అన్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.