తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Boycott Laal Singh Chaddha: బాయ్‌కాట్‌ లాల్‌సింగ్‌ చడ్డా ట్విటర్‌ ట్రెండ్‌పై ఆమిర్‌ రియాక్షన్‌ ఇదీ

Boycott Laal Singh Chaddha: బాయ్‌కాట్‌ లాల్‌సింగ్‌ చడ్డా ట్విటర్‌ ట్రెండ్‌పై ఆమిర్‌ రియాక్షన్‌ ఇదీ

Hari Prasad S HT Telugu

01 August 2022, 14:32 IST

    • Boycott Laal Singh Chaddha: ఇప్పుడు ట్విటర్‌లో బాయ్‌కాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా ట్రెండ్‌ అవుతోంది. దీనిపై ఈ మూవీ హీరో, బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ఖాన్‌ స్పందించాడు.
ఆమిర్ ఖాన్
ఆమిర్ ఖాన్ (PTI)

ఆమిర్ ఖాన్

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ నాలుగేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతని లేటెస్ట్‌ మూవీ లాల్‌ సింగ్‌ చడ్డా ఆగస్ట్‌ 11న రిలీజ్‌ కాబోతోంది. అద్వైత్‌ చందన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ ఎప్పుడో 1994లో హాలీవుడ్‌లో వచ్చిన ఫారెస్ట్‌ గంప్‌ మూవీకి రీమేక్‌. ఈ సినిమాపై ఆమిర్‌ భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు అతన్ని ఓ విషయం కలవరపెడుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

ప్రస్తుతం ట్విటర్‌లో బాయ్‌కాట్‌ లాల్‌సింగ్ చడ్డా ట్రెండ్‌ అవుతోంది. నిజానికి ఆమిర్‌ఖాన్‌ ఈ మధ్య నటించిన మూవీ ఎప్పుడు రిలీజైనా ఇలా ఏదో ఒక నెగటివ్‌ ప్రచారం జరుగుతూనే ఉంది. దీనిపై స్పందించాల్సిందిగా ఈ మధ్య మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమిర్‌ఖాన్‌ను కొందరు అడిగారు. ఇది తనకు చాలా బాధ కలిగించే విషయమని, కొందరు తనకు ఇండియా అంటే నచ్చదన్న తప్పుడు ఉద్దేశంతో ఉన్నారని ఆమిర్‌ చెప్పాడు.

"అవును, ఇది నాకు బాధ కలిగిస్తోంది. ఈ ప్రచారం చేస్తున్నవాళ్లలో కొంత మంది నాకు ఇండియా అంటే ఇష్టం లేదన్న ఉద్దేశంతో ఉన్నారు. వాళ్లు దీనినే బలంగా నమ్ముతున్నారు. కానీ అది నిజం కాదు. కొందరు అలా అనుకోవడం దురదృష్టకరం. దయచేసి నా సినిమాను బాయ్‌కాట్‌ చేయకండి. అందరూ సినిమా చూడండి" అని ఆమిర్ వేడుకున్నాడు.

హాలీవుడ్‌లో టామ్‌ హ్యాంక్స్‌ నటించిన ఫారెస్ట్‌ గంప్‌ మూవీ అకాడమీ అవార్డు విన్నర్‌. ఈ సూపర్‌ హిట్‌ మూవీలో ఓ దివ్యాంగుడి పాత్రలో హీరో కనిపిస్తాడు. టామ్‌ హ్యాంక్స్‌ రోల్‌నే ఈ లాల్‌ సింగ్ చడ్డాలో ఆమిర్‌ పోషించాడు. ఇందులో కరీనాకపూర్‌, మోనా సింగ్‌ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఇక ఇదే మూవీతో టాలీవుడ్‌ స్టార్‌ నాగచైతన్య కూడా తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.