తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Govt Live News Updates: సీఎం రేవంత్ కు ప్రధాని అభినందనలు - మంత్రుల శాఖల కేటాయింపుపై ట్విస్ట్!
తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణం
తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణం (DD News Twitter)

Telangana Govt Live News Updates: సీఎం రేవంత్ కు ప్రధాని అభినందనలు - మంత్రుల శాఖల కేటాయింపుపై ట్విస్ట్!

07 December 2023, 21:37 IST

  • Telangana CM Swearing In Live News Updates: తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రెండు ఫైళ్లపై సంతకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీతో పాటు పలువురు అభినందనలు తెలిపారు. మంత్రులకు ఎలాంటి శాఖలు కేటాయించలేదని అధికారులు ట్విస్ట్ ఇచ్చారు.

07 December 2023, 21:39 IST

సీఎం రేవంత్ సమీక్ష…

విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం సీరియస్

విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డ సీఎం

రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని ఆదేశం

రేపు ఉదయం విద్యుత్ పై సీఎం ప్రత్యేక సమీక్ష

విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎంకు చెప్పిన అధికారులు

సిఎండి ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశం

రేపటి రివ్యూకు ప్రభాకర్ రావు ను రప్పించాలని అధికారులకు ఆదేశం

07 December 2023, 21:37 IST

శాఖల కేటాయింపుపై ట్విస్ట్

మంత్రులకు ఎలాంటి శాఖలు సీఎం రేవంత్ రెడ్డి కేటాయించలేదు. పోర్ట్ ఫోలియోల ప్రచారం అవాస్తవమని అధికారులు తెలిపారు. సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతే శాఖల కేటాయింపుపై స్పష్టత రానుంది.

07 December 2023, 21:17 IST

కేబినెట్ నిర్ణయాలు

సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీ నుంచే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు.

ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచటంపై కేబినెట్ నిర్ణయం.

ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో పాటు స్పీకర్ ఎంపిక ఉంటుంది.

డిసెంబర్ 8వ తేదీన పలు గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చిస్తారు.

24 గంటల కరెంటు ఇస్తాం.. ఇందుకోసం అధికారులను ఆదేశించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

గత ప్రభుత్వంలో ప్రణాళికలు లేకుండా విద్యుత్ కొనుగోలు జరిగింది.. రేపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నతాధికారులతో సీఎం రివ్యూ ఉంటుంది.

విద్యుత్ అంతరాయం జరుగకుండా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహ అవసరాలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

07 December 2023, 21:17 IST

పలు అంశాలపై చర్చ…

విద్యుత్ అంశంపై కేబినెట్ లో ప్రధానంగా చర్చించినట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. 24 గంటల కరెంట్ ఇస్తామని పేర్కొన్నారు.

07 December 2023, 21:02 IST

2 స్కీమ్ లపై ప్రకటన

మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు రవాణా సౌకర్యం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వరకు పెంపు నిర్ణయాలను సోనియాగాంధీ పుట్టిన రోజు నుంచి అమల్లోకి తీసుకువస్తామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.

07 December 2023, 21:01 IST

మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

6 గ్యారంటీలపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పాు. “రేపు 2 గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చిస్తారు. ముందుగా సోనియా గాంధీ పుట్టినరోజైన ఎల్లుండి 2 గ్యారంటీల అమలు ప్రారంభిస్తాం” అని వివరించారు.

07 December 2023, 20:30 IST

గవర్నర్ తమిళిసై ట్వీట్..

"శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారికి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా, మరికొందరి కి గౌరవ రాష్ట్ర మంత్రులు గా పదవీ ప్రమాణ స్వీకారం చేయించడం ఆనందం గా ఉంది. ప్రజా ప్రతినిధులు, అతిథులు, ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. మన దార్శనిక, గౌరవనీయులైన ప్రధాని మోదీ గారి మార్గం లో ముఖ్యమంత్రి గారు, మంత్రి వర్గం తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది కి చేసే కృషి విజయవంతం కావాలని ఆశిస్తున్నాను" అంటూ గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు.

07 December 2023, 20:29 IST

అభినందనల వెల్లువ

కాంగ్రెస్ ప్రభుత్వానికి పలువురు ప్రముఖలు శుభాకాంక్షలు, అభినందలు తెలుపుతున్నారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు వెల్లువెత్తున్నాయి.

07 December 2023, 20:14 IST

హామీల అమలుపైనే దృష్టి…

ఆరు హామీల అమలుపైనే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే విషయంపై లోతుగా ఆలచన చేస్తుంది.

07 December 2023, 19:59 IST

కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు :

4. ఇందిరమ్మ ఇళ్లు

ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం.

తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం.

5. యువ వికాసం

విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ. 5 లక్షల పరిమితితో విద్యా భరోసా కార్డు.

ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు.

6. చేయూత

పింఛనుదారులకు నెలకు రూ.4,000 పింఛను.

ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం.

07 December 2023, 19:53 IST

కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు :

1. మహాలక్ష్మి

ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం.

రూ.500లకే గ్యాస్ సిలిండర్.

రాష్ట్రవ్యాప్తంగా మహి‌‍ళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం.

2. రైతు భరోసా

ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం.

ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం.

వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటన.

3. గృహజ్యోతి

ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితం.

07 December 2023, 19:43 IST

గ్యారెంటీ కార్డు….

కర్ణాటకలో జెండా ఎగరవేసిన కాంగ్రెస్… ఆ తర్వాత తెలంగాణనే పెట్టుకుంది. అందుకు తగ్గటే వర్కౌట్ చేసింది. పక్కా వ్యూహాలతో ముందుకొచ్చింది. అనుకున్నట్లే… తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరవేసింది. ఏడాది కాలంగా… కీలకమైన డిక్లరేషన్లతో పాటు… హామీలతో ప్రజల్లోకి వెళ్లే పని పెట్టుకున్న కాంగ్రెస్…. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బకొట్టింది. తొలిసారిగా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అయితే… కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ కార్డే కీలకంగా మారిందనే చెప్పొచ్చు.

07 December 2023, 19:26 IST

ప్రజాదర్భార్

రేపు ఉదయం ప్రజాదర్భార్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునే అవకాశం ఉందియ

07 December 2023, 19:11 IST

కీలక చర్చ

తొలి కేబినెట్ భేటీలో ఆరు గ్యారెంటీల హామీలపై చర్చించారు. ప్రజా సమస్యలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

07 December 2023, 18:54 IST

ముగిసిన భేటీ

సచివాలయంలో తెలంగాణ కేబినెట్‌ భేటీ ముగిసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

07 December 2023, 18:42 IST

మాజీ ఉపరాష్ట్రపతి ట్వీట్

“తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. అన్ని పక్షాలను కలుపుకొని వెళ్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా శ్రేయస్సు, అభివృద్ధే లక్ష్యంగా పాలన కొనసాగించగలరని ఆకాంక్షిస్తున్నాను.” అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

07 December 2023, 18:26 IST

కొనసాగుతున్న కేబినెట్ భేటీ

సచివాలయంలోని 6వ అంతస్తులోని చాంబర్ లో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఆరు గ్యారెంటీల హామీల అమలుపై చర్చిస్తున్నారు.

07 December 2023, 18:15 IST

6 గ్యారెంటీల హామీపైనే…

ఆరు గ్యారెంటీల హామీపై తొలి సంతకం చేసిన రేవంత్ రెడ్డి… కేబినెట్ భేటీలో అమలు చేసే విషయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

07 December 2023, 18:07 IST

కేబినెట్ భేటీ….

కేబినెట్ భేటీలో ఆరు గ్యారెంటీల హామీపై తెలంగాణ కొత్త కేబినెట్ భేటీ చర్చిస్తోంది.

07 December 2023, 17:45 IST

మంత్రిబొత్స ట్వీట్

“తెలంగాణా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప మఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి నా శుభాకాంక్షలు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మిత్రులకు అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చక్కటి సంబంధ బాంధవ్యాలు నిరంతరం ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అని మంత్రి బొత్స ట్వీట్ చేశారు.

07 December 2023, 17:44 IST

చంద్రబాబు విషెస్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేస్తూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సక్సెస్‌ఫుల్ గా పాలన అందిస్తారని చంద్రబాబు ఆకాంక్షించారు.

07 December 2023, 17:15 IST

సచివాలయంలో రేవంత్

సచివాలయంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పండితులు వేద మంత్రాలను చదివారు.

07 December 2023, 17:03 IST

కేబినెట్ భేటీ ప్రారంభం

తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. సాయంత్రం 5 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రులు సమావేశం అయ్యారు.

07 December 2023, 17:02 IST

రేపు ఉదయం ప్రజాదర్బార్…

ఇక రేపు ఉదయం 10 గంటలకు జ్యోతి రావు పులే భవన్ ( ప్రగతి భవన్ ) లో ప్రజాదర్బార్ ఉంటుందని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.ప్రజాదర్బార్ కార్యక్రమానికి సమస్యలున్న ప్రజలంతా తరలి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.తాము పాలకులు కాదని తాము ప్రజల సేవకులని రేవంత్ రెడ్డి తెలిపారు.విద్యార్ది,నిరుద్యోగ,అమరవీరుల

కుటుంబాలకు న్యాయం చేస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

07 December 2023, 17:01 IST

ఇనుప కంచెలు తొలగింపు

గురువారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ ముందున్న బారికేడ్లను తొలగింపు పనులను ప్రారంభించారు అధికారులు.పై నుంచి ఆదేశాలు రావడంతో ప్రగతి భవన్ బయట,లోపల ఉన్న ఆంక్షలను అధికారులు ఎత్తివేశారు.ప్రగతి భవన్ ముందు రోడ్ పై నుంచి వెళ్లేందుకు వాహనదారులకు పోలీసులు అనుమతినిచ్చారు.

అన్ని బారికేడ్లను తొలగించాలని తమకు ఆదేశాలు వచ్చాయని ,క్రమంగా బారికేడ్లను తొలగిస్తున్నామని,త్వరలోనే అన్ని బారికేడ్లను తొలగిస్తామని అధికారులు వెల్లడించారు.

07 December 2023, 16:55 IST

పవన్ అభినందనలు

"తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన మంత్రి వర్గ సహచరులకు శుభాభినందనలు. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత.. ఏ ఆశయాల కోసం ఆత్మబలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నేరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్థకతను కల్పించాలి’’- జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

07 December 2023, 16:55 IST

మోదీ విషెస్

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సుకు కావాల్సిన పూర్తి తోడ్పాటు అందిస్తాం’’ - ప్రధాని మోదీ

07 December 2023, 16:54 IST

తొలి కేబినెట్ భేటీ

ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో మొదటి కేబినెట్‌ భేటీ ఇదే.

07 December 2023, 16:35 IST

సచివాలయానికి సీఎం రేవంత్

తెలంగాణ సచివాలయానికి చేరుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి రాగా.. ఆయనతో పాటు మంత్రులు కూడా వచ్చారు.

07 December 2023, 16:33 IST

సీఎం జగన్ అభినందనలు

“తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని పోస్టు చేశారు సీఎం జగన్.

07 December 2023, 16:25 IST

కీలక మార్పులు

07 December 2023, 16:25 IST

జ్యోతి రావు ఫూలే ప్రజాభావన్

ప్రగతి భవన్’ ఇకపై జ్యోతి రావు ఫూలే ప్రజాభావన్’ గా ఉంటుందని. రేపు ఉదయం 10 గంటలకు ప్రజా భవన్’లో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు

07 December 2023, 16:16 IST

శాఖల వివరాలు

పొన్నం ప్రభాకర్ – బీసీ వెల్ఫేర్కొండా సురేఖ – మహిళా శిశు సంక్షేమంఅనసూయ (సీతక్క) – గిరిజన సంక్షేమంతుమ్మల – రోడ్లు భవనాల శాఖజూపల్లి – సివిల్ సప్లై

07 December 2023, 16:15 IST

మంత్రుల శాఖలు

భట్టి విక్రమార్క – రెవెన్యూఉత్తమ్ కుమార్ రెడ్డి – హోంశాఖదామోదర రాజనర్సింహ – ఆరోగ్యశాఖకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – మున్సిపల్శ్రీధర్ బాబు – ఆర్థిక శాఖపొంగులేటి – నీటిపారుదల శాఖ

07 December 2023, 16:04 IST

ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బీ శివ‌ధ‌ర్ రెడ్డి

తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బీ శివ‌ధ‌ర్ రెడ్డి నియామ‌కం అయ్యారు. సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా శేషాద్రిని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

07 December 2023, 15:56 IST

వైఎస్ఆర్ సీపీతో రాజకీయ రంగ ప్రవేశం

బడా కాంట్రాక్టర్ గా వివిధ రాష్ట్రాల్లో పెద్ద పెద్ద పనులు నిర్వహించే పొంగులేటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో వైఎస్ఆర్ సీపీ పార్టీలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాల నేపద్యంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి)లో చేరారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమలరాజుకు మద్దతుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. దీంతో ఐదేళ్లపాటు ఎంతో సహనంగా టీఆర్ఎస్ లోనే కొనసాగారు. 2023లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం 2023 జూలై 2న రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మంలో జరిగిన 'తెలంగాణ జన గర్జన' బహిరంగ సభలో కాంగ్రెస్‌లో చేరారు.

07 December 2023, 15:51 IST

పొంగులేటి ప్రస్థానం

పదేళ్ల రాజకీయ నేపథ్యం ఆయన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది. 2013లో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2023లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం.ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో 1965 అక్టోబర్ 28వ తేదీన జన్మించిన పొంగులేటి అనతి కాలంలోనే జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరి నిరంతరం వార్తల్లో వ్యక్తిగా మారారు. టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల గెలుపు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఏ ఒక్క టీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపధం చేసి నెగ్గారు కూడా..

07 December 2023, 15:40 IST

కొత్త మంత్రులతో కేబినెట్ భేటీ

సచివాలయంలో కొత్త మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇందులో ఎలాంటి అంశాలపై చర్చించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

07 December 2023, 15:34 IST

తొలి భేటీ

ఇవాళ సాయంత్రం కేబినెట్ తొలి భేటీ కానుంది.

07 December 2023, 15:34 IST

నియామకాలు

సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్ ఐజీ గా శివధర్ రెడ్డిని నియమిస్తూ సీఎం ఉత్తర్వులు ఇచ్చారు..

07 December 2023, 15:15 IST

చిరు అభినందనలు

రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి అభినందలు తెలిపారు. ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

07 December 2023, 15:07 IST

మంత్రిగా జూపల్లి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు అయిదేళ్ల విరామం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు.సుధీర్ఘ రాజకీయ అనుభవం,రాజకీయ చితురుడు అయిన జూపల్లి కృష్ణారావు ప్రస్తుత వనపర్తి జిల్లా చిన్నంభవి మండలం పెద్ద దగడ గ్రామంలో ఆగస్ట్ 10,1955 లో శేషగిరిరావు,రత్నమ్మ దంపతులకు జన్మించారు.ఈ దంపతులకు మొత్తం ఏడుగురు సంతానం ఉండగా కృష్ణారావు ఆరో సంతానం.

07 December 2023, 15:03 IST

TUWJ శుభాకాంక్షలు

"తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గారికి,వారి మంత్రి మండలికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు నిచ్చిన తెలంగాణ ప్రజల ఆకాంక్షల కనుగుణంగా ఈ ప్రభుత్వ పాలన సాగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరగలదని విశ్వసిస్తూ.. ప్రధానంగా జర్నలిస్టుల సంక్షేమం దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించి ముందుకు సాగుతుందని మనస్ఫూర్తిగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన కొత్త టీంకు హృదయపూర్వక శుభాకాంక్షలు" అని TUWJ తెలిపింది.

07 December 2023, 15:02 IST

జై కాంగ్రెస్….

జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ - జై సోనియమ్మ , జై జై సోనియమ్మ ధన్యవాదాలు అంటూ రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

07 December 2023, 15:01 IST

మంత్రిగా సురేఖ - రాజకీయ ప్రస్థానం ఇదే

2009 లో మూడోసారి పరకాల ఎమ్మెల్యేగా గెలిచి, అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరిన కొండా సురేఖ 2014లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా 2018 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో మళ్లీ సొంత పార్టీ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 2018 లో పరకాల నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. ఇలా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, అందులో ఒకసారి మంత్రి గా పని చేసిన కొండా సురేఖ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గంలో కొండా సురేఖ చోటు దక్కించుకున్నారు. సురేఖకు రెండో సారి మంత్రి పదవి దక్కడంతో కొండా అభిమానులు, కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోకి కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.

07 December 2023, 14:51 IST

సురేఖ ప్రస్థానం

కొండా సురేఖ 1965 ఆగస్టు 19న జన్మించారు. పద్మశాలి కమ్యూనిటీకి చెందిన ఆమె వరంగల్ ఎల్బీ కాలేజీలో బీకామ్ చదువుతున్న క్రమంలో మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన కొండా మురళిధర్ రావును ప్రేమ వివాహం చేసుకున్నారు. కొండా దంపతులకు కూతురు సుస్మితాపటేల్, అల్లుడు అభిలాష్, మనవరాలు శ్రేష్ఠపటేల్, మనవడు శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్ ఉన్నారు. కాగా 1995 లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొండా సురేఖ అదే సంవత్సరం గీసుగొండ ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1996లో పీసీసీ మెంబర్ గా ఎంపికయ్యారు. 1999లో శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో ఏఐసీసీ మెంబర్ గా ఎంపిక అయ్యారు. ఆ తరువాత 2004లో శాయంపేట ఎమ్మెల్యేగా వరుసగా రెండో సారి గెలిచారు. 2005లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్స్ అఫిషియో మెంబర్ గా కూడా పని చేశారు.

07 December 2023, 14:50 IST

సీతక్క

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళా నేతలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటుదక్కింది. అందులో ఒకరు ఆదివాసీ కాగా.. మరొకరు బీసీ నేత కావడం గమనార్హం. ములుగు ఎమ్మెల్యే సీతక్క, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు మంత్రులుగా అవకాశం లభించింది. ఈ మేరకు హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ లో ఇద్దరూ సీనియర్ నేతలే కావడం, పార్టీకి ఎంతోకాలంగా విధేయులుగా ఉంటూ సేవలందిస్తుండటంతో రేవంత్ రెడ్డి ఆడబిడ్డ కానుకలుగా ఇద్దరికీ మంత్రి పదవులు కేటాయించారు. దీంతో ఆయా నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.

07 December 2023, 14:34 IST

లోకేశ్ విషెస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.

07 December 2023, 14:34 IST

హరీశ్ రావు ట్వీట్

“రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క గారికి, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను” అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.

07 December 2023, 14:24 IST

సీఎంకు అభినందనలు

సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు.

07 December 2023, 14:22 IST

జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజాదర్భార్

“పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేసింది. దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా... ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

07 December 2023, 14:19 IST

ప్రజాదర్బార్

ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తాం.. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చు.. కాంగ్రెస్ సమిధిగా మారి తెలంగాణ ఇచ్చింది.. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తాం.. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు- సీఎం రేవంత్ రెడ్డి

07 December 2023, 14:19 IST

సీఎం రేవంత్ తొలి స్పీచ్

"ప్రగతి భవన్ వద్ద ఉన్న ఇనుప కంచెలను బద్ధలు కొట్టించాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాటిస్తున్నాను. నా తెలంగాణ కుటుంబ ప్రజలు ఎప్పుడు రావాలనుకున్నా... ప్రగతి భవన్ లోకి రావొచ్చు. ప్రజలు వారి ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవచ్చు. జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో రేపే ప్రజాదర్భార్ నిర్వహిస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో సోనియామ్మ అండతో ప్రజలకు మేలైన సంక్షేమంతో పాటు అభివృద్ధిని చూసి చూపిస్తాం. పాలకులం కాదు సేవకులం అనే విధంగా పని చేస్తాను. కాంగ్రెస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటాను" అని రేవంత్ రెడ్డి చెప్పారు.

07 December 2023, 14:15 IST

మోదీ అభినందనలు

సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని మోదీ ట్వీట్ చేశారు.

07 December 2023, 13:55 IST

ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం

సిఎంగా ఆరు గ్యారెంటీలపై రేవంత్‌ రెడ్డి తొలి సంతకం చేయనున్నారు.

07 December 2023, 13:51 IST

బిఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చిన ముగ్గురికి మంత్రి పదవులు

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ముగ్గురు జూపల్లి, తుమ్మల, పొంగులేటిలకు మంత్రి పదవులు దక్కాయి.

07 December 2023, 13:54 IST

మంత్రులుగా కొండా సురేఖ, సీతక్క

తెలంగాణ మంత్రులుగా కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్కలు ప్రమాణం చేశారు. సీతక్క ప్రమాణం చేసే సమయంలో సభ హోరెత్తింది.

07 December 2023, 13:38 IST

పొంగులేటి, పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ మంత్రులుగా పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.

07 December 2023, 13:34 IST

మంత్రులుగా కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు ప్రమాణం

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ప్రమాణం చేశారు.

07 December 2023, 13:30 IST

1.20కు రేవంత్ రెడ్డి ప్రమాణం

తెలంగాణ ముఖ్యమంత్రిగా మధ్యాహ్నం 1.20కు ప్రమాణం చేశారు. గవర్నర్ తమిళ సై రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించారు. రేవంత్ తర్వాత మల్లుభట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ ప్రమాణ స్వీకారం చేశారు.

07 December 2023, 13:16 IST

దాటిపోయిన ముహుర్తం

ప్రమాణ స్వీకార ముహుర్తం దాటిపోయింది.గవర్నర్ సకాలంలో వేదికపైకి చేరుకోలేకపోయారు. కర్ణాటక సిఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు ప్రముఖులు స్టేడియం వరకు రాలేకపోయారు.

07 December 2023, 13:14 IST

వేదికపై కాంగ్రెస్ అగ్రనేతలు

ప్రమాణ స్వీకార వేదికపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మంత్రివర్గంలో చోటు దక్కిన వారు కొలువుదీరారు.

07 December 2023, 13:06 IST

ఓపెన్ టాప్‌ వాహనంలో స్టేడియంలోకి రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి ఓపెన టాప్ వాహనంలో స్టేడియంలోకి ప్రవేశించారు. అభిమానుల కోలాహలంతో స్టేడియం మార్మోగింది.

07 December 2023, 12:59 IST

అమరవీరులస్తూపం వద్ద చిక్కుకుపోయిన వాహనాలు

రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తరలి వస్తున్న వాహనాలు అమరవీరుల స్థూపం వద్ద చిక్కుకుపోయాయి. డికె.శివకుమార్, సిద్ధరామయ్యలు వాహనాలు విడిచి నడుచుకుంటూ స్టేడియం ప్రాంగణానికి చేరుకున్నారు.

07 December 2023, 12:55 IST

ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వివిఐపిలు

ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ట్రాఫిక్‌ జామ్‌లో పలువురు వివిఐపిలు చిక్కుకుపోయారు.

07 December 2023, 12:44 IST

ప్రమాణ స్వీకారానికి హిమాచల్‌ ప్రదేశ్ సిఎం

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ సిఎం సుఖ్వీందర్ సింగ్ కూడా హాజరు అవుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు మల్లు భట్టి విక్రమార్క కూడా బయల్దేరారు.

07 December 2023, 12:43 IST

ట్రాఫిక్‌లో చిక్కుకున్న కర్ణాటక సిఎం కాన్వాయ్

రవీంద్ర భారతి వద్ద కర్ణాటక సిఎం సిద్ధరామయ్య కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.

07 December 2023, 13:54 IST

తాజ్‌ హోటల్‌ నుంచి బయల్దేరిన రేవంత్ రెడ్డి

మధ్యాహ్నం 12.40కు తాజ్‌ కృష్ణ హోటల్‌ నుంచి ఒకే కారులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి బయల్దేరు.

07 December 2023, 12:24 IST

గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్పీకర్ పదవి

గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తెలంగాణ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 2008 ఉపఎన్నికల్లో తొలిసారి గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్‌ కిరణ్‌కుమార్‌ మంత్రి వర్గంలో పనిచేశారు. 2014, 2018లో ఓటమి పాలయ్యారు. వికారాబాద్‌ నుంచి తాజాగా ఎన్నికయ్యారు.

07 December 2023, 12:01 IST

ఎల్లా హోటల్‌ నుంచి బయల్దేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఎల్లా హోటల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస్సుల్లో బయలు దేరారు. హై సెక్యూరిటీ నడుమ బస్సులను తరలిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ ముందు వరుసలో ఉండి.. ఎమ్మెల్యేలు అంతా అభివాదం చేస్తూ బస్సుల్లో స్టార్ట్ అయ్యారు.

07 December 2023, 11:59 IST

కాంగ్రెస్ గెలుపుపై శ్రీధర్ బాబు హర్షం

కాంగ్రెస్ అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని, ఖచ్చితంగా ప్రజారంజక పాలన అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తన పోర్ట్ ఫోలియో ఏంటనేది ఇంకా క్లారిటీ లేదని, ప్రమాణస్వీకారం అనంతరం పాలన ఎలా నడపాలన్న దానిపై సమిష్టి నిర్ణయం ఉంటుందని చెప్పారు.

07 December 2023, 11:43 IST

నాలుగు జిల్లాలకు దక్కని ప్రాధాన్యం

మంత్రి వర్గ విస్తరణలో నాలుగు జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరిని మంత్రులుగా ఎంపిక చేయలేదు. దీంతో అయా జిల్లాల నుంచి ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

07 December 2023, 11:22 IST

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ప్రజల కష్టాలు తీరబోతున్నాయని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసి.. ప్రజల కష్టాలు దగ్గరగా చూశానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అందరం సమిష్టిగా.. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, గత పదేళ్లలో అధికార బీఆర్ఎస్ ప్రజలను నిర్లక్ష్యం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు.

07 December 2023, 11:10 IST

హైదరాబాద్‌ చేరుకున్న హిమాచల్ సిఎం

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ గారితో కలిసి ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

07 December 2023, 10:57 IST

పెద్దమ్మ తల్లిని దర్శించుకోనున్న రేవంత్

కాసేపట్లో జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. జూబ్లిహిల్స్‌ పెద్దమ్మ తల్లిని దర్శించుకోనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

07 December 2023, 10:37 IST

ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న కాంగ్రెస్ అగ్రనేతలు

ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ అగ్రనేతలతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీకి స్వయంగా రేవంత్‌ రెడ్డి స్వాగతం పలికారు. 10.30గంటలకు హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్వీందర్‌సింగ్‌, 10.45కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మధ్యాహ్నం 12 గంటలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రానున్నారు.

07 December 2023, 13:54 IST

హైదరాబాద్‌ చేరుకున్న సోనియా

తెలంగాణ సిఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హైదరాబాద్‌ చేరుకున్నారు. విమనాశ్రయంలో వారికి రేవంత్ స్వాగతం పలికారు.

07 December 2023, 9:38 IST

మంత్రి వర్గంలో 11మందికి చోటు

తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మరో 11మందికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ముఖ్యమంత్రితో పాటు 17మందికి క్యాబినెట్ పదవులు దక్కే అవకాశం ఉండగా మరికొన్ని పదవులకు మలి విడతలో విస్తరణ చేపట్టే అవకాశం ఉంది.

07 December 2023, 9:46 IST

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ

దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, కొండా సురేఖ వంటి వారికి మంత్రి పదవులు దక్కాయి.

07 December 2023, 13:54 IST

నల్గొండలో కోమటిరెడ్డికి మంత్రి పదవి

నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్యాబినెట్‌లో చోటు దక్కింది.

07 December 2023, 9:35 IST

వరంగల్‌లో ఇద్దరికి మంత్రి పదవులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొండా సురేఖ, సీతక్కలకు మంత్రి పదవులు దక్కనున్నాయి.

07 December 2023, 9:34 IST

ఖమ్మం నుంచి ఇద్దరికి అవకాశం

ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవులు దక్కనున్నాయి.

07 December 2023, 9:33 IST

మంత్రి వర్గ విస్తరణపై సస్పెన్స్

ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రులుగా ఎవరు ప్రమాణం చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. రేవంత్‌ రెడ్డితో పాటు మరో ఏడెనిమిది మంది సీనియర్లు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరుగుతోంది.

07 December 2023, 9:20 IST

కట్టుదిట్టంగా భద్రత.. ట్రాఫిక్‌ ఆంక్షలు

ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, తర్వాత సచివాలయానికి వెళ్లనుండటం నేపథ్యంలో పోలీసు శాఖ కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టింది. గురువారం ఉదయం నుంచే ఎల్‌బీ స్టేడియం, సచివాలయం పరిసరాల్లో సుమారు 2వేల మంది పోలీసులను మోహరించనున్నారు.

జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసం నుంచి ఎల్బీ స్టేడియం రూట్‌ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తుపై బలగాలు బుధవారం మధ్యాహ్నమే రిహార్సల్స్‌ పూర్తి చేశాయి. ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేయనున్నారు.

07 December 2023, 9:02 IST

8వ నంబర్ గేటు నుంచి సిఎం ఎంట్రీ

ఎల్ బి స్టేడియంలో 8వ నంబర్ గేట్ నుండి ముఖ్యమంత్రి ప్రవేశానికి ఏర్పాట్లు చేశారు. స్టేడియం సామర్థ్యం మొత్తం 80 వేల మందికి ప్రవేవానికి అనుమతించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. స్టేడియం చుట్టు పక్కల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, సిసిటీవీ కెమెరాలతో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన స్థలాల వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.

07 December 2023, 8:50 IST

ప్రమాణ స్వీకారానికి సిపిఐ నేతలు

రేవంత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీనియర్‌ నేతలు కె.నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు హాజరుకానున్నారు. కాంగ్రెస్‌ కూటమితో కలిసి సిపిఐ తరపున కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు.

07 December 2023, 13:54 IST

మధ్యాహ్నం సచివాలయానికి రేవంత్ రెడ్డి

ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక రేవంత్‌రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని.. తన చాంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలన పరిస్థితులు, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది.

07 December 2023, 13:54 IST

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

రేవంత్‌ ప్రమాణ స్వీకారానికి ఉదయం నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు హైదరాబాద్ కు భారీగా చేరుకుంటున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

07 December 2023, 13:54 IST

అమరుల కుటుంబాలకు ప్రత్యేక గ్యాలరీ

తెలంగాణ అమర వీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ చేశారు. ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేశారు. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

07 December 2023, 8:02 IST

సాంస్కృతిక కార్యక్రమాలు

రేవంత్ ప్రమాణానికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్, కళాకారులతో రేవంత్ రెడ్డికి స్వాగత ఏర్పాట్లు చేశారు.

07 December 2023, 8:01 IST

ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియం సిద్ధమైంది. సభలో మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రజా వేదికపై రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎడమ వైపు 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. కుడి వైపు వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక సిద్ధం చేశారు.

07 December 2023, 13:54 IST

విమానాశ్రయంలో రేవంత్‌కు స్వాగతం

సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో రేవంత్‌రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రేవంత్‌ వెంట పార్టీ సీనియర్‌ నేతలు శ్రీధర్‌బాబు, షబ్బీర్‌ అలీ, బలరామ్‌ నాయక్‌, సుదర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, సీపీ సందీప్‌ శాండిల్యా.. రేవంత్‌రెడ్డిని బేగంపేట విమానాశ్రయంలో కలిశారు.

07 December 2023, 7:53 IST

దివ్యాంగురాలికి ఆహ్వానం

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్‌ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన రజినికి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. రిటైర్డు ఉద్యోగి అయిన వెంకటస్వామి, మంగమ్మ దంపతులకు మొదటి సంతానమూన రజినికష్టపడి పీజీ వరకు చదివింది. ఉన్నత చదువు పూర్తి చేసినా ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. గతంలో గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డిని కలిసి.. ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆమెను ఆహ్వానించారు.

07 December 2023, 7:52 IST

పాక్షికంగానే క్యాబినెట్ విస్తరణ

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదిరులకు క్యాబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.

07 December 2023, 7:51 IST

ఆరు గ్యారెంటీల చట్టంపై తొలిసంతకం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగమైన ఆరుగ్యారెంటీల పథకానికి చట్టబద్దత కల్పించే దస్త్రాలపై రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు.

07 December 2023, 7:48 IST

ఎల్‌బి స్టేడియంలో ప్రమాణ స్వీకాారానికి ఏర్పాట్లు

సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి బుధవారం స్వయంగా పర్యవేక్షించారు. వేదిక, కుర్చీలు, ఎల్‌ఈడీ తెరలు, సౌండ్‌ సిస్టం తదితర ఏర్పాట్లపై సూచనలు చేశారు. అక్కడే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. సీఎస్‌తో పాటు ఏర్పాట్లు పరిశీలించిన వారిలో డీజీపీ రవిగుప్తా, అదనపు డీజీలు సీవీ ఆనంద్‌, శివధర్‌రెడ్డి తదితరులున్నారు.

07 December 2023, 7:46 IST

రేవంత్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు

సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక రానున్నారు.ఉదయం. 9:30కి హైదరాబాద్ చేరుకోనున్నారు. రేవంత్‌ ప్రమాణస్వీకారానికి ఏఐసీసీ అగ్రనేతలు హాజరుకానున్నారు.

    ఆర్టికల్ షేర్ చేయండి