Telangana Election Results 2023 : దూసుకెళ్తున్న 'కాంగ్రెస్' - సంబరాల్లో హస్తం శ్రేణులు!
03 December 2023, 9:54 IST
- Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలోని మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు, శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్
Telangana Election Results 2023 : తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించింది. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపట్టగా….ఉత్తర, తెలంగాణ జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇక హైదరాబాద్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.
ఇప్పటి వరకు వస్తున్న(ఉదయం 09:53 సమయం) ఫలితాల ప్రకారం… 64 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా… బీఆర్ఎస్ 38 స్థానాల్లో లీడ్ లో ఉంది. మరోవైపు బీజేపీ పార్టీ 9 సీట్లలో లీడ్ ఉండగా… ఎంఐఎం 3 స్థానాల్లో ఆదిక్యతను ప్రద్శిస్తోంది.
ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచి… ఈవీఎం ఓట్ల లెక్కింపు వరకు కూడా ఆదిక్యంలోనే కొనసాగుతోంది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి, గజ్వేల్ లో కేసీఆర్, మధిరలో భట్టి, ఖమ్మంలో తుమ్మల, నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అప్పుడే సంబరాలను షురూ చేసింది.