తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lb Nagar Bjp : ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థికి కొత్త చిక్కులు

LB Nagar BJP : ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థికి కొత్త చిక్కులు

HT Telugu Desk HT Telugu

19 November 2023, 8:21 IST

google News
    • Telangana Assembly Elections 2023: ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సొంత పార్టీలోనే సీనియర్ నేతలు… స్వతంత్రంగా బరిలోకి దిగారు. ఫలితంగా పార్టీపై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థి
ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థి

ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థి

LB Nagar Assembly Constituency: సామ రంగారెడ్డికి సొంత పార్టీ సీనియర్ నేతల నుంచే కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీకి దూరమయ్యారు.బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా వారంతా ఆయనకు పోటీగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.

స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో…

కాగా సామ రంగారెడ్డి 2019 లో టిడిపి సైకిల్ దిగి కమలం గూటికి చేరారు.ఆయనతో పాటు టీడీపీ నాయకులు,కార్యకర్తలు బీజేపీ లో చేరారు.అయితే 30 ఏళ్లుగా బీజేపీ పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా ఇటీవలే పార్టీలు ఫిరాయించిన వారికి టికెట్ల ఇస్తున్నారని కొందరు సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ల ఇచ్చి ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కృషి చేసిన వారిని పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎల్ బి నగర్ 11 డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.కొందరు సీనియర్ నాయకులు పార్టీ వీడి సామ రంగారెడ్డి కి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు.రంగారెడ్డి ఒంటెద్దు పోకడ వల్లే తాము పార్టీకి దూరం అయ్యారని ప్రచారం సాగిస్తున్నారు.

సీనియర్ల ప్రభావం తప్పదా..?

ఎల్ బి నగర్ బీజేపీకి భారీ డ్యామేజ్ జరుగుతుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.జిహెచ్ఎంసి ఎన్నికలో 11 కార్పొరేటర్ల ను బీజేపీ కైవసం చేసుకోగా ప్రస్తుత పరిణామాల వల్ల వారిలో చీలికలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది.ప్రతీ డివిజన్ లో 4 వేల నుంచి 5 వేల మంది ఓటర్లు ఉన్నారు. దీని వల్ల బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి కి ఎఫెక్ట్ తప్పదని,అయన మూడో స్థానానికి పరిమితం అవుతరనే ప్రచారం జరుగుతుంది.ఇప్పటికైనా పార్టీలో ఉన్న కొందరి సీనియర్లను సామ రంగారెడ్డి ఎలా బుజ్జగిస్తారనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.….!

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం