తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Priyanka Gandhi : నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాలే- ప్రియాంక గాంధీ

Priyanka Gandhi : నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాలే- ప్రియాంక గాంధీ

HT Telugu Desk HT Telugu

19 November 2023, 16:01 IST

google News
    • Priyanka Gandhi : తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడాలని ప్రియాంక గాంధీ అన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్.... తన ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు.
ప్రియాంక గాంధీ
ప్రియాంక గాంధీ

ప్రియాంక గాంధీ

Priyanka Gandhi : తెలంగాణలో విద్యార్థులకు సకాలంలో ఉద్యోగాలు రావాలి అంటే ఇక్కడి సీఎం కేసీఆర్ ఉద్యోగం పోవాలని ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ లో ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన సభల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నో బలిదానాలు చూసి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రజలను మోసం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. అయన ఇంట్లోనే 4గురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. మరోవైపు మోదీ కార్పొరేట్ రంగాలకు ఊతం కల్పిస్తూ ప్రజలను నట్టేట ముంచుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు ఒకటేనని వారిలో ఎవరికి ఓటేసినా కూడా ప్రజలు మరోసారి మోసపోవడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమానికి ఇందిరాగాంధీ విశేషంగా కృషి చేసిందని, పాత సంక్షేమాలకు కొత్త పేర్లు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఆదివాసీలు అంటే ఇందిరా గాంధీకి ఎంతో ఇష్టం ఉండేదని, అందులో భాగంగానే ఐటీడీఏలు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు, గిరిజన అభివృద్ధి పథకాలు, పోడు వ్యవసాయానికి పట్టాలు, పక్కా ఇండ్లు , ఎన్నో నిర్మించారని అందుకే ఇందిరమ్మ పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

పార్టీ శ్రేణుల ఆనందోత్సాహం

ఉమ్మడి ఆదిలాబాద్ లో ఇందిరాగాంధీ మనవరాలు ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ రెండు నియోజవర్గ కేంద్రాల్లో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఆనంద ఉత్సవాలు నింపాయి. కార్యకర్తల్లో ఉత్సవాన్ని రేకెత్తించాయి. కచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ లో ఐదు స్థానాలు గెలుపునకు దగ్గరగా ఉండడంతో ప్రియాంక గాంధీ పర్యటన కాంగ్రెస్ శ్రేణులు మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఆదిలాబాద్ లో ఆదివాసీలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ప్రియాంక గాంధీ పర్యటించారు. కాంగ్రెస్ హామీలపై ఆదివాసులు నమ్మకంతో ఉన్నారని ఆ పార్టీ శ్రేణలు అంటున్నాయి. ఖానాపూర్ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఆదివాసీలు మారుమూల ప్రాంతాల నుంచి ఇందిరమ్మ మనమరాలు ప్రియాంక చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్

తదుపరి వ్యాసం