తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bandi Sanjay Vs Gangula : మంత్రి గంగుల ఏం చేశాడు..? ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చాడా..? - బండి సంజయ్

Bandi Sanjay vs Gangula : మంత్రి గంగుల ఏం చేశాడు..? ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చాడా..? - బండి సంజయ్

HT Telugu Desk HT Telugu

25 November 2023, 9:41 IST

google News
    • Telangana Assembly Elections 2023: తెలంగాణలో కాషాయజెండా ఎగరటం తథ్యమన్నారు బండి సంజయ్. కరీంనగర్ లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన… బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల టార్గెట్ గా ప్రశ్నల వర్షం కురిపించారు. 
ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్
ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్

ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్

Bandi Sanjay :కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను 9 వేల కోట్లు తీసుకువచ్చానన్నారు ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్. మీరు గెలిపించి ఆశీర్వదించడంతో రాష్ట్రమంతా తిరిగి ప్రజల కోసం పోరాడినానని... మరి ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన కమలాకర్ ఏం సాధించాడని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోని అశోక్ నగర్, గోపాల్ పూర్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం అశోక్ నగర్, సాయంత్రం గోపాల్ పూర్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని 60 లక్షల మంది యువకులకు ఉద్యోగాలివ్వకుండా రోడ్డున పడేసిన యువకులంతా ఏకమై బీఆర్ఎస్ ను ఓడించేందుకు తిరుగుతున్నారని. రేషన్ మంత్రిగా ఉంటూ ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, బీసీ మంత్రిగా ఉంటూ బీసీ బంధు ఇవ్వని దద్దమ్మకు ఓట్లేలా వేస్తారని ప్రశ్నించారు.

రైతులకు ఎరువుల పేరుతో నరేంద్రమోదీ ప్రభుత్వం ఒక్క ఎకరానికి రూ.18 వేల సబ్సిడీ ఇస్తోందని. కిసాన్ సమ్మాన్ నిధి కింద మరో 6 వేల సాయం చేస్తోందని చెప్పారు బండి సంజయ్. వెరసి కేంద్రం నుండి ఎకరానికి 24 వేల సాయం అందుతోందన్నారు.బీజేపీ అధికారంలోకి వస్తే వరి కనీస మద్దతు క్వింటాలుకు రూ. 3100 చెల్లిస్తామని..అన్ని సబ్సిడీలు బంద్ పెట్టి రైతు బంధు పేరుతో కేవలం 10 వేలు మాత్రమే చెల్లిస్తోందని. ఒకచెత్తో రైతు బంధు ఇచ్చి మరో చేత్తో తాలు కటింగ్ పేరుతో క్వింటాలుకు 10 కిలోల చొప్పున కట్ చేస్తూ ఎకరాకు 6 వేల రూపాయల నష్టం చేకూరుస్తున్నారన్నారు.రైతులకు న్యాయం చేస్తోందెవరో.. మోసం చేస్తుందెవరో ప్రజలు ఆలోచించాలన్నారు. హైదరాబాద్ తరువాత అంతటి అభివ్రుద్ధి కరీంనగర్ లో జరుగుతోందని గంగుల కమలాకర్ అంటున్నడు…కేసీఆర్ దుర్మార్గపు పాలనలో హైదరాబాద్ లో అభివ్రుద్ధి కుంటుపడిందని… వానొస్తే హైదరాబాద్ మునిగిపోతోందన్నారు.ఐటీ టవర్ ను పెట్టి ఒక్క కొత్త కంపెనీ తీసుకురాలేదని.. అక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ అదికారంలోకి రాదని. బీఆర్ఎస్ బాక్స్ బద్దలు కాబోతోందని. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడం తథ్యమన్నారు

రిపోర్టర్: గోపికృష్ణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా

తదుపరి వ్యాసం