BJP Manifesto :ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం, పెట్రోల్, డీజిల్ వ్యాట్ తగ్గింపు - బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే!
18 November 2023, 20:32 IST
- TS BJP Manifesto : తెలంగాణ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఉజ్వల పథకం కింద ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.
బీజేపీ మేనిఫెస్టో
బీజేపీ మేనిఫెస్టో
TS BJP Manifesto : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. హైదరాబాద్ లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. 10 ప్రధాన అంశాలతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించారు. ‘మన మోదీ గ్యారంటీ- బీజేపీ భరోసా’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ....డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ప్రభుత్వ పథకాలు చక్కగా అమలవుతాయన్నారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని ప్రధాని మోదీ ప్రకటించారని గుర్తుచేశారు.
బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలు
- ఉజ్వల పథకం లబ్దిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం
- స్వయం సహాయక బృందాలకు 1 శాతం వడ్డీకే రుణాలు
- డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు
- నవజాతి బాలికపై ఎఫ్డీ(21 ఏళ్లకు రూ.2 లక్షలు)
- మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పొరేషన్
- మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు
- యూపీఎస్సీ తరహాలో ప్రతి 6 నెలలకు ఒకసారి టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లు
- అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ
- ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఏడాదికి రూ.10 లక్షల వరకూ ఉచిత ఆరోగ్య కవరేజీ
- ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఏడాది ఒకసారి ఉచిత వైద్య పరీక్షలు
- జిల్లా స్థాయిలో మల్లీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు
- ధరణి స్థానంలో మీ భూమి యాప్
- గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ
- కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ
- బీఆర్ఎస్ ప్రభుత్వ కుంభకోణాలపై విచారణకు కమిటీ ఏర్పాటు
- ఎస్సీ ఉపవర్గీకరణ
- బీసీ అభ్యర్థిని సీఎం చేస్తాం
- పెట్రోల్, డీజిల్ వ్యాట్ తగ్గింపు
- ఆసక్తిగల రైతులకు ఉచితంగా దేశీ ఆవులు.
- రాజ్యాంగ విరుద్ధమైన మత ఆధారిత రిజర్వేషన్ల తొలగింపు.
- కొత్త రేషన్ కార్డులు.
- ఎరువుల సబ్సిడీతో పాటు రూ.2500 ఇన్‌పుట్ సహాయం.
- వరికి రూ.3100 గరిష్ట మద్దతు దర
- నిజామాబాద్‌ను పసుపు నగరంగా అభివృద్ధి.
- ప్రతి మండలంలో నోడల్ పాఠశాలలు.
- ప్రైవేట్ స్కూల్ ఫీజు నియంత్రణ.
- రాష్ట్రంలోని గ్రామాలలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణి.
- ప్రతి ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే
- ఆగస్ట్ 27న రజాకార్లతో పోరాడిన అమరుల స్మృతి దినం
- తెలంగాణ ఉద్యమాన్ని డాక్యుమెంటనేషన్ చేసి మ్యూజియం, మెమోరియల్.
- ఓబీసీలకు రిజర్వేషన్లు పెంపు.
- ఎస్సీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్ల పెంపు.
- రామ్ మందిర్, కాశీ లకు ఉచిత యాత్ర.