తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bodhanpolitics: షకీల్ గెలిస్తే బోధన్ రోహింగ్యాలకు అడ్డా అవుతుందన్న అర్వింద్

BodhanPolitics: షకీల్ గెలిస్తే బోధన్ రోహింగ్యాలకు అడ్డా అవుతుందన్న అర్వింద్

HT Telugu Desk HT Telugu

22 November 2023, 5:45 IST

google News
    • BodhanPolitics: తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల్లో బోధన్ నుంచి షకీల్ గెలిస్తే బోధన్ నియోజక వర్గం రోహింగ్యాలకు అడ్డాగా మారుతుందని  ఎంపీ ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు. 
బోధన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ధర్మపురి అర్వింద్
బోధన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ధర్మపురి అర్వింద్

బోధన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ధర్మపురి అర్వింద్

BodhanPolitics: బోధన్ నియోజకవర్గంలో షకీల్ అమీర్ గెలిస్తే పట్టణం రోహింగ్యా లకు అడ్డా అవుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరు తోడుదొంగలని అన్నారు.

మంగళవారం బోధన్ పట్టణం లో నిర్వహించిన యువ విజయ సంకల్ప సభలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ కంటే భూముల అమ్ముకునే పెద్ద దోపిడిదారుడు రేవంత్ అని ఆరోపించారు. బీసీలని అగౌరవపరిచి అణగదొక్కిన పార్టీ కాంగ్రెస్ అని, దానిని భూస్థాపితం చేయాలని పేర్కొన్నారు.

బీసీలు ఇప్పటికైనా మేల్కొని బీజేపీకీ ఓటేయాలన్నారు. పసుపు బోర్డు సాధించినట్లే బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరిని తెరిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయితే మూడు ఫ్యాక్టరీలను తెరిపిస్తామన్నారు.

అలాగే 200 కోట్లతో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే బీడీ కార్మికులకు, మహిళ సంఘాలకు నామమాత్రపు వడ్డీతో రుణాలను ఇస్తామని అన్నారు. కేసీఆర్ ను గెలిపించడానికే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడని అన్నారు.

బోధన్ లో బిఆర్ఎస్, కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని అన్నారు.మాదిగ సమాజం చేస్తున్న 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటం న్యాయమైందని, త్వరలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేపడుతున్నామని తెలిపారు. బోధన్ లో షకీల్ గెలిస్తే రోహింగ్యాలకు అడ్డా అవుతుందని, అందుకే బీఆర్ఎస్ ను ఓడించాలన్నారు.

సభలో బీజేపీ అభ్యర్థి మోహన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి, నర్సింహరెడ్డి, అడ్లూరి శ్రీనివాస్, సుధాకర్ చారి, బాలరాజ్, కూరెళ్ల శ్రీధర్ వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

(రిపోర్టింగ్ మీసా భాస్కర్, నిజామాబాద్)

తదుపరి వ్యాసం