తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Election Results 2023 : పోస్టల్‌ బ్యాలెట్లలో కాంగ్రెస్‌ కు ఆధిక్యం - తొలి రౌండ్ లోనూ ముందంజ

Telangana Election Results 2023 : పోస్టల్‌ బ్యాలెట్లలో కాంగ్రెస్‌ కు ఆధిక్యం - తొలి రౌండ్ లోనూ ముందంజ

03 December 2023, 9:24 IST

google News
    • Telangana Election Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదట పోస్టల్ ఓట్లు లెక్కించగా… మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ ఆదిక్యతను ప్రదర్శించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (HT )

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

Telangana Election Results 2023 : తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా…. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు పోస్టల్‌ బ్యాలెట్లలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ ఆదిక్యతను ప్రదర్శించింది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది.

ఈవీఎం ఓట్ల లెక్కింపు - రేసులో కాంగ్రెస్

మరోవైపు ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. మొదటి రౌండ్ల ఫలితాల్లో కాంగ్రెస్ కు పలు చోట్ల ఆదిక్యం లభించింది. మధిరలో మొదటి రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టి విక్రమార్కకు 2,098 ఓట్ల ఆధిక్యం దక్కింది. ఇక భద్రాచలం నియోజకవర్గం మొదటి రౌండ్‌లో 126 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి వీరయ్య ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గం మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ 6924 ఓట్ల ఆదిక్యంలో ఉంది. ఇక గజ్వేల్ లో కేసీఆర్ లీడ్ లో ఉన్నారు.

హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ ఆధిక్యం కనిపించగా… మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. దాదాపు 46 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉండగా… 11 చోట్ల మాత్రం బీఆర్ఎస్ ఆదిక్యం ప్రదర్శిస్తోంది.

తదుపరి వ్యాసం