Telangana Elections 2023 : ఆసక్తికరంగా 'అలంపూర్' రాజకీయం - కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం
24 November 2023, 13:48 IST
- Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం. టికెట్ దక్కకపోవటంతో అసంతృప్తితో ఉన్న ఆయన… రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. దాదాపు సిట్టింగ్ లకే సీట్లు ఇచ్చిన అధికార బీఆర్ఎస్…. కొందరికి మాత్రమే హ్యాండ్ ఇచ్చింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విషయానికొస్తే… సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు కూడా అదే పరిస్థితి వచ్చింది. నిజానికి కేసీఆర్ ప్రకటించిన జాబితాలో ఆయన పేరు ఉన్నప్పటికీ…. చివరి వరకు బీఫామ్ ఇవ్వలేదు. అనూహ్యంగా విజేయుడు అనే అభ్యర్థికి బీఫామ్ ఇవ్వటంతో… అబ్రహంకు షాక్ తగిలినట్లు అయింది. చివరి నిమిషంలో కేసీఆర్ షాక్ ఇవ్వటంతో…. సైలెన్స్ అయిపోయారు అబ్రహం. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారనే చర్చ వినిపించినప్పటికీ… చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ పార్టీని వీడిని అబ్రహం… శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున సంపత్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా అలంపూర్ గడ్డపై హస్తం జెండా ఎగరవేయాలని చూస్తున్న సంపత్ కుమార్… వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తులను తనవైపు తిప్పుకుంటున్నారు.
ఇక బీఆర్ఎస్ పార్టీ తరపున చివర్లో బీఫామ్ దక్కించుకున్న విజేయుడు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆశీస్సులతో విస్తృతంగా ప్రచారం చేస్తుండగా… మరోసారి గులాబీ జెండా ఎగురుతుందనే ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియకు ఐదు రోజులే గడువు ఉన్న వేళ… సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం హస్తం గూటికి చేరటం ఆసక్తికరంగా మారింది.