తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Amith Sha Campaign : కాంగ్రెస్ కు ఓట్లేసినా వాళ్లు బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారు.. మక్తల్ సభలో అమిత్ షా

Amith Sha Campaign : కాంగ్రెస్ కు ఓట్లేసినా వాళ్లు బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారు.. మక్తల్ సభలో అమిత్ షా

26 November 2023, 13:08 IST

google News
    • Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. ఆదివారం మక్తల్ సభలో మాట్లాడిన ఆయన… బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు బీ టీమ్ అని ఆరోపించారు.
అమిత్ షా
అమిత్ షా

అమిత్ షా

Amith Sha Campaign : తెలంగాణలో బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా. ఆదివారం నారాయణపేట జిల్లాలో పర్యటించిన ఆయన…మక్తల్ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ సర్కార్ అవినీతిలో మునిగిపోయిందని… కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను నమ్మవద్దన్నారు.

అమిత్ షా ప్రసంగం:

- మొట్టమొదటగా మక్తల్ లో ఉన్న కురుమూర్తి స్వామి వారికి నమస్కారాలు చేస్తున్నాను.

- ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నికలు.

- కేసీఆర్ ప్రభుత్వం గత పదేళ్లుగా అవినీతిలో కూరుకుపోయింది. ఇక్కడ స్థానిక ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే భూములను కబ్జా చేశాడు.

- మక్తల్ లో వంద పడకల ఆస్పత్రిని కడుతామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం హామీని నెరవేర్చిందా..? డిగ్రీ కాలేజీ పూర్తి అయిందా... అని ప్రశ్నిస్తున్నాను.

- నిరుద్యోగులకు భృతి ఇస్తానని చెప్పిన కేసీఆర్ అమలు చేసిండా...?

- ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా బీఆర్ఎస్ పనులు ఇసుక, మట్టి దందాలు చేస్తున్నారు.

- నారాయణపేట జిల్లాలో అత్యదికంగా చేనేత కార్మికులు ఉన్నారు. వారి శ్రేయస్సు కోసం ఇక్కడ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీనిస్తున్నాను.

- బీజేపీ ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఎంతో చేసింది.

- కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. పెండింగ్ లో ఉన్న బీమా ప్రాజెక్టును బీజేపీ అధికారంలోకి రాగానే పూర్తి చేస్తాం.

- ఎలాంటి పనులు చేయని కేసీఆర్ ను గద్దె దింపుదామా..? లేదా...?

-కాంగ్రెస్ కు ఓటేస్తే... గతంలో మాదిరిగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారు.

- బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు బీ టీమ్

- కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని చూస్తోంది.

- మనమంతా ఒక నినాదం తీసుకోవాలి. మరోసారి మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి.

-తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేయబోతుంది.

- ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకున్న పార్టీ కూడా భారతీయ జనతా పార్టీనే.

- పేద మహిళలకు ఏడాదిలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇస్తున్నాం.

- తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం.

- బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది. బీజేపీ అధికారంలోకి రాగానే... ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఓబీసీల రిజర్వేషన్లను పెంచుతాం.

- అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తి కాబోతుంది. జనవరి 22న మందిరం ప్రారంభం కాబోతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అయోధ్యలో ఉచితంగా రాముడి దర్శనం చేయిస్తాం.

- బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నాను.

తదుపరి వ్యాసం