MIM Owaisi: ఎస్సైను దుర్బాషలాడిన అక్బరుద్దీన్ ఒవైసీ, పోలీస్ కేసు నమోదు
23 November 2023, 10:08 IST
- MIM Owaisi: గడువు ముగిసిన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని కోరిన పోలీస్ అధికారిని ఎంఐఎం పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ దుర్భాషలాడటం రాజకీయ దుమారం రేపింది.
అక్బరుద్దీన్ ఓవైసీపై పోలీస్ కేసు నమోదు
MIM Owaisi: ఎన్నికల సంఘం అనుమతించిన సమయం దాటిన తర్వాత బహిరంగ సభలో వేదికపై ప్రసంగిస్తున్న ఎంఐఎం పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీని అడ్డుకున్న పోలీస్ అధికారినివ దుర్భాషలాడటం చర్చనీయాంశంగా మారింది. విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు రావడంతో ఒవైసీపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పోలీసు అధికారిని అక్బరుద్దీన్ బెదిరించిన ఆరోపణలపై అక్బరుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో శాంతిభద్రతలను నిర్వహించలేకపోతున్నారని బిజెపి నాయకుడు సయ్యద్ జాఫర్ ఇస్లాం ఆరోపించారు.
‘పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోతుంటే సవాల్ చేయడం మొదలు పెట్టాడని ఆరోపించారు. కేసీఆర్ పరిపాలనలో తెలంగాణలో, శాంతిభద్రతలను అదుపు చేయలేకపోతున్నారని, రానున్న కాలంలో బిజెపి ప్రభుత్వం వస్తేనే శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయన్నారు.
మరోవైపు సంతోష్ నగర్ ఎస్‌హెచ్‌ఓ ఫిర్యాదు మేరకు అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేసినట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ రోహిత్ రాజు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ అధికారిని అడ్డుకున్నందుకు "ఐపిసి సెక్షన్ 353 (అధికారిక విధులకు ఆటంకం కలిగించడం) మరియు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మరోవైపు ఎఫ్‌ఐఆర్‌పై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. “డీసీపీ, పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని. .పోలీసు అధికారి స్టేజ్‌పైకి వచ్చిన వీడియో ఫుటేజీ తన దగ్గర ఉందన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రసంగిస్తే పోలీసులు బుక్ చేసుకోవచ్చని, చట్ట ప్రకారం.. కానీ బహిరంగ సభను అడ్డుకోవడం, సమయం అయిపోయిందని చెప్పడం తప్పని, పోలీసులు ఇలా చేయకూడదన్నారు. పోలీసులపై ఫిర్యాదు చేశానని, ఈ విషయంపై విచారణ జరపాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
పోలీస్ అధికారులను దుర్భాసలాడిన అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భారత ఎన్నికల సంఘాన్ని కోరారు.
అస్సాంలో ఇలా జరిగి ఉంటే 5 నిమిషాల్లోనే చర్యలు ఉండేవన్నారు. తెలంగాణలో బుజ్జగింపు రాజకీయాల వల్ల బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు పోలీసులను బహిరంగంగా బెదిరిస్తే మాట్లాడటం లేదన్నారు. ప్రజలు బెదిరింపులకు గురవుతున్నారని, ఒవైసీ అభ్యర్థిత్వాన్ని ఎన్నికల సంఘం రద్దు చేయాలన్నారు.
ఎన్నికల ప్రచారంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పాటించాలని కోరిన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను అక్బరుద్దీన్ ఒవైసీ మంగళవారం బెదిరించారు. ప్రసంగాన్ని ఆపాలని కోరడంతో అక్బరుద్దీన్ పోలీసులను దుర్భాషలాడారు. ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.
హైదరాబాద్ లలితాబాగ్‌లో ప్రచారంలో ప్రసంగిస్తున్న సమయంలో అడ్డుకోవడంతో తన మద్దతుదారులకు "సిగ్నల్" ఇస్తే, ఇన్‌స్పెక్టర్ ఆ స్థలం నుండి "పరిగెత్తాల్సి వస్తుందని" హెచ్చరించి వేదిక నుండి "వెళ్లిపోవాలని" బెదిరించారు.
"కత్తులు, బుల్లెట్లను ఎదుర్కొన్న తర్వాత, బలహీనపడ్డాను అని మీరు అనుకుంటున్నారా, ఇప్పటికీ చాలా ధైర్యం ఉందని, ఐదు నిమిషాలు మిగిలి ఉన్నాయని, ఐదు నిమిషాలు ప్రసంగిస్తానని, తనను ఎవరూ ఆపలేరు. సిగ్నల్ ఇస్తే మీరు పరిగెత్తాల్సి వస్తుందని బెదిరించారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యల విషయంలోMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా తన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను సమర్థించారు. ప్రచార సమయం ముగియడానికి "ఐదు నిమిషాలు" మిగిలి ఉన్నందున అధికారి జోక్యం చేసుకోకూడదని అన్నారు. అభ్యర్థుల ప్రచారానికి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉందని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి అక్బరుద్దీన్ బరిలో ఉన్నారు. 2014 మరియు 2018లో పార్టీ విజయం సాధించడంతో ఈ సీటు AIMIMకి బలమైన కోటగా ఉంది. తెలంగాణలో నవంబర్ 30న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
బిజెపి వస్తే జైల్లోనే ఉంటారు…
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్బరుద్దీన్ వంటి వాళ్లు జైల్లోనే ఉంటారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని, జైలులోనే ఉంటారని హెచ్చరించారు.