తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Sajjala On Candidates: అదంతా ప్రతిపక్షాల దుష్ప్రచారం… వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదన్న సజ్జల..

Sajjala On Candidates: అదంతా ప్రతిపక్షాల దుష్ప్రచారం… వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదన్న సజ్జల..

Sarath chandra.B HT Telugu

11 April 2024, 13:12 IST

    • Sajjala on Candidates: వైసీపీలో అభ్యర్థుల మార్పులపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి (Facebook)

సజ్జల రామకృష్ణారెడ్డి

ట్రెండింగ్ వార్తలు

Transfers in AP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ - పల్నాడు కలెక్టర్ బదిలీ, పలువురు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు

Khammam Bettings: ఏపీలో ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో లెక్కలు.. జోరుగా బెట్టింగులు!

YS Jagan With IPac: ఐపాక్‌ బృందంతో జగన్ భేటీ.. మళ్లీ అధికారంలోకి వస్తున్నామని ధీమా..

Lok Sabha Elections Phase 5: ఐదో దశలో లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులు వీరే..

Sajjala on Candidates: వైసీపీ YCP ఎమ్మెల్యే mla, ఎంపీ MP అభ‌్యర్థుల మార్పుపై సోషల్ మీడియా Social mediaలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి కొట్టిపారేశారు. శాస్త్రీయంగా అభ్యర్థుల ఎంపిక చేశాం, అందర్నీ ఒప్పించి ఎన్నికలకు పోతున్నామని చెప్పారు. టిక్కెట్లు దక్కని వారితో కూడా ఇప్పటికే సిఎం జగన్ మాట్లాడారని అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నట్టు చెప్పారు.

ఏపీలో శాస్త్రీయ సర్వేలు చేసి అభ్యర్థుల్ని ఎంపిక చేశామని సజ్జల చెప్పారు. పార్టీలోకి కొత్తగా నలుగురు వచ్చినంత మాత్రాన వారికి టిక్కెట్లు కేటాయిస్తున్నట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ మీద దుష్ప్రచారం చేసే పార్టీలకు మొన్నటి వరకు పొత్తు ఎవరితోనో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. టీడీపికి పవన్ కళ్యాణ్‌, బీజేపీలతో పొత్తు గందరగోళం నడిచిందని సీట్ల సర్దుబాటు, ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై సర్దుబాటుకు కిందమీద పడ్డారని విమర్శించారు.

వాటిని కవర్ చేయడానికి ఇప్పటికీ కిందా మీద పడుతున్నారని ఆరోపించారు.వైసీపీలో ఇతర పార్టీల నాయకుల చేరికను చూసి కంగారు పడుతున్నారని ఆరోపించారు. వైసీపీలో ఎన్నికల నిర్వహణ ఓ పద్ధతి ప్రకారం ఆర్డర్‌లో జరుగుతోందన్నారు. పార్టీలో చేరగానే వారికి టిక్కెట్లు ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారన్నారు.వైసీపీ జట్టు పక్కాగా ఉంది. ఇతర పార్టీల్లో నాయకులు చేరగానే అప్పటి వరకు ఉన్న అభ్యర్థుల్ని మార్చినట్టు మా పార్టీలో అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టత ఇచ్చారు.

తదుపరి వ్యాసం