తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Loksabha Results 2024 : తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ - ఇద్దరి మధ్యే హోరాహోరీ!

Telangana Loksabha Results 2024 : తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ - ఇద్దరి మధ్యే హోరాహోరీ!

04 June 2024, 9:47 IST

google News
    • Telangana Loksabha Election Results 2024 : తెలంగాణలోని పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా లీడ్ లో లేకుండా పోయింది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024

Telangana Loksabha Election Results 2024 Updates : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పలు స్థానాల్లో బీజేపీ లీడ్ ను కనబరుస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా పలు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా… బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా లీడ్ లో లేదు. ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ముందంజలో ఉంది.

తెలంగాణలోని 17 పార్లమెంట్ సెగ్మెంట్లలోని చూస్తే 6 - 7 స్థానాల్లో బీజేపీలో లీడ్ లో ఉండగా…మరో 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కనబరుస్తోంది. ఇక ఎంఐఎం ఒక్క స్థానంలో లీడ్ లో ఉంది. బీఆర్ఎస్ కు ఎక్కడా కూడా ఆధిక్యం కనబడటం లేదు.

ఖమ్మం, భువనగిరి, వరంగల్ తో పాటు మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, మెదక్, మహబూబ్ నగర్ తో పాటు పలు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. చివరి ఫలితం వరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉండేలా కనిపిస్తోంది.

2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నాలుగు స్థానాలను గెలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు పార్లమెంట్ స్థానాలను గెలవగా… బీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం ఒక్క స్థానాన్ని ఖాతాలో వేసుకుంది.

 

తదుపరి వ్యాసం