TG Lok Sabha Exit Poll: తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో ఎవరు ముందంజలో ఉన్నారు?
01 June 2024, 19:57 IST
- TG Lok Sabha Exit Poll: తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో ఎవరు ముందంజలో ఉన్నారు? ఏ ఎగ్జిట్ పోల్ లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి? ఇక్కడ తెలుసుకోండి.
తెలంగాణలో బీజేపీ అధిక సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్ సంస్థల అంచనా
కాంగ్రెస్ 7 నుంచి 8 స్థానాలు గెలుచుకుంటుందని, బీజేపీ 8 నుంచి 9 స్థానాలు గెలుచుకుంటుందని, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటుందని ప్రముఖ సర్వే సంస్థ ఆరా మస్తాన్ సర్వే సంస్థ వెల్లడించింది.
బీజేపీ గెలుచుకునే స్థానాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ స్థానాలు గెలుచుకోనుంది. మహబూబ్ నగర్‌లో గట్టిపోటీ ఉన్నా, స్వల్ప ఆధిక్యత కనబరుస్తోంది.
హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం గెలుచుకుంటుందని, మిగిలిన స్థానాలను అంటే ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆరా సంస్థ ప్రతినిధి మస్తాన్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితి ఉందని, కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా కోల్పోనుందని తెలిపింది.
ఇక ఏబీపీ - సీ ఓటర్ సర్వే సంస్థ తెలంగాణలో బీజేపీ 7 నుంచి 9, కాంగ్రెస్ 7 నుంచి 9 సీట్లు గెలుచుకుంటాయని, ఒక స్థానం ఎంఐఎం గెలుచుకుంటుందని అంచనాలను వెల్లడించింది. ఈ సంస్థ కూడా బీఆర్ఎస్ ఒక్క స్థానమూ గెలుచుకోవడం లేదని అంచనా వేసింది.
ఇక పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 7 నుంచి 9 సీట్లు, బీజేపీ 6 నుంచి 8 సీట్లు, బీఆర్ఎస్ నుంచి 0-1 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటాయి.
టాపిక్