తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bandi Sanjay: క్షమాపణలు చెప్పిన తర్వాతే కేసీఆర్ కరీంనగర్‌ రావాలన్న బండి సంజయ్

Bandi Sanjay: క్షమాపణలు చెప్పిన తర్వాతే కేసీఆర్ కరీంనగర్‌ రావాలన్న బండి సంజయ్

HT Telugu Desk HT Telugu

03 April 2024, 6:25 IST

google News
    • Bandi Sanjay: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌజ్ నుండి రాజకీయాలు చేస్తే… కాంగ్రెస్ నేతలు హామీల పేరుతో రాజకీయం చేస్తున్నారని  బిజేపి జాతీయ ప్రధానకార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.‌
కరీంనగర్‌లో దీక్ష చేపట్టిన బండి సంజయ్
కరీంనగర్‌లో దీక్ష చేపట్టిన బండి సంజయ్

కరీంనగర్‌లో దీక్ష చేపట్టిన బండి సంజయ్

Bandi Sanjay: పొలంబాట పట్టిన కేసిఆర్, రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఉమ్మడి కరీంనగర్ Karimnaar జిల్లాలో పర్యటించాలని బండి సంజయ్ Bandi Sanjay డిమాండ్ చేశారు. భూగర్భజలాలు అడుగంటి, సాగునీరు రాక ఎండిపోయిన పంటలకు, ఇటీవల వడగళ్ళ వానతో దెబ్బ తిన్నపంటలకు ఎకరాన 25 వేల చొప్పున పరిహారం చెల్లించి, రెండు లక్షల రుణమాఫీ తక్షణం అమలు చేయాలని, రైతు భరోసా క్రింద ఎకరాన 15 వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో బండి సంజయ్ రైతు దీక్ష BJP Protest చేపట్టారు.

కలెక్టరేట్ Collectorate ముందు దీక్ష కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఎంపీ కార్యాలయంలోనే సంజయ్ నాలుగు గంటలపాటు దీక్ష చేసి కాంగ్రెస్ Conngress తీరు, కేసిఆర్ KCR వైఖరిపై మండిపడ్డారు. వరి వేస్తే ఉరే గతి అన్న మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు.

పంట నష్టపోతే Crop loss ఎకరాకు 10 వేలు ఇస్తానని నయాపైసా ఇవ్వని మాట తప్పిన నేత కేసీఆర్ అని ఆరోపించారు. కేసిఆర్ 10 ఏళ్ల పాలనలో వేలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలిపారు. వడ్ల కుప్పలపై రైతు గుండె పగిలి చచ్చిపోయినా చలించని మూర్ఖుడు కేసీఆర్ అని సంజయ్ దుయ్యబట్టారు. రైతులను నట్టేట ముంచిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని కరీంనగర్ వస్తున్నారని ప్రశ్నించారు.

6 గ్యారంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ లో మిగిలేది ఆరుగురే…

కేసీఆర్ మోసాలను ప్రజలు గ్రహించి కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు బండి సంజయ్. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి కొన్ని మాత్రమే అమలు చేసి అన్ని చేశామని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఆరు గ్యారంటీలను అమలు చేయకపోయినా 600 కోట్లతో అమలు చేసినట్లుగా మీడియాలో యాడ్స్ ఇస్తూ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు.‌ 6 గ్యారంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ లో మిగిలేది 6 గురు నేతలేనని స్పష్టం చేశారు. హామీలు అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తుంటే కాంగ్రెస్ వక్రభాష్యం చెబుతుందని విమర్శించారు.

ఎంపీగా ఏం చేశారని ప్రశ్నిస్తున్న మంత్రి పొన్నంతో పాటు కాంగ్రెస్ పాలకులు హామీలను అమలు చేయడం చేతకాదని ఒప్పుకుంటే కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. కేంద్రమే అన్నీ ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ సర్కార్ ఉండెందుకని ప్రశ్నిస్తూ పాలన చేయడం చేతకాకుంటే తప్పుకోవాలని సూచించారు.

ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన బీజేపీకి లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ 2బిహెచ్ కే పరిస్థితి కాంగ్రెస్ కు పడుతుందన్నారు. సిరిసిల్ల నేత కార్మికులకు రావాల్సిన బకాయిలు వేంటనే చెల్లించాలని, లేకుంటే ఆందోళన చేపట్టకతప్పదని బండి సంజయ్ హెచ్చరించారు.

రెండు పార్టీలు రైతులను మోసం చేశాయి

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు రైతులను మోసం చేశాయని బండి సంజయ్ ఆరోపించారు. రైతులకు అండగా ఉంటూ పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతుల కష్టాలను చూసి, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు దీక్ష చేపట్టానని తెలిపారు.

సకాలంలో సర్కార్ సాగు నీరు వదలకపోవడంవల్ల రైతుల పంటలు ఎండి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో చాలాచోట్ల పంట నష్టం జరిగినా నేటికీ పైసా పరిహారమివ్వలేదని ఆరోపించారు.

లాభాల కోసం కాకుండా అప్పులు తీర్చడానికే పంటలు సాగు చేసే దుస్థితి రైతాంగానిదని తెలిపారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వడ్లు కొనుగోళ్ళు ప్రారంభమైన నేపథ్యంలో తక్షణమే వడ్లతో సహా అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కోరారు. పండించిన ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయిలని ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ విధివిధానాలేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

రైతులు రోడ్లెక్కి ఆందోళన చేసే పరిస్థితి తీసుకురావొద్దని సూచించారు. రుణమాఫీ చేస్తామని మాట తప్పడంతో రైతులు డిఫాల్టర్లుగా మారి అప్పులు పుట్టని స్థితికి దిగజార్చారని ఆరోపించారు. రైతులు ఇంకెన్ని రోజులు అవమానికి గురై తలదించుకోవాలని, రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.

పంటల బీమాను అమలు చేయాలని కోరారు. పార్టీలోని గేట్లు ఎత్తడం కాదు… సాగునీటి ప్రాజెక్టులు ఎత్తి సాగునీరు ఇచ్చి ఎండుతున్న పంటలను కాపాడాలని, పట్టణాల్లో మంచి నీటి కొరత తీర్చాలని కోరారు.

(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రతినిధి)

తదుపరి వ్యాసం