తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bjp Mp Arvind : ఆగస్టు దాకా ఎందుకు..రేపో మాపో రేవంత్ కూడా బీజేపీలోకి వస్తాడు..! ఎంపీ అర్వింద్ కామెంట్స్

BJP MP Arvind : ఆగస్టు దాకా ఎందుకు..రేపో మాపో రేవంత్ కూడా బీజేపీలోకి వస్తాడు..! ఎంపీ అర్వింద్ కామెంట్స్

HT Telugu Desk HT Telugu

21 April 2024, 15:20 IST

    • BJP Dharmapuri Arvind On Congress Govt : నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు బిజేపి లో చేరుతున్నారని..త్వరలోనే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడుతారని అన్నారు.
నిజామాబాద్ ఎంపీ అర్వింద్
నిజామాబాద్ ఎంపీ అర్వింద్

నిజామాబాద్ ఎంపీ అర్వింద్

Nizamabad BJP MP Dharmapuri Arvind: కాంగ్రెస్ అంటేనే కరెప్షన్.. కమీషన్ పార్టీ అని ఎద్దేవా చేశారు నిజామాబాద్ ఎంపీ బిజేపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind). కాంగ్రెస్ ఖాళీ అవుతుందని..రేపో మాపో రేవంత్ రెడ్డి సైతం బిజేపి లోకి వస్తారని తెలిపారు. ఆగస్టు లో రాజకీయ సంక్షోభం వస్తుందట కదా అని నేతల వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... ఆగస్టు దాకా ఎందుకు కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు బిజేపి లో చేరుతున్నారని..త్వరలోనే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడుతారని చెప్పారు.‌ రేవంత్ రెడ్డి(CM Revanth reddy) బ్యాక్ గ్రౌండ్ ఏబీవీపీ, లోపల హిందుత్వం ఉందని.. అందుకే రేవంత్ ఏమి చేయలేక కాంగ్రెస్ లో గోస పడుతున్నాడని తెలిపారు. ఒక హిందూవుకు మేలు చేయలేని ముఖ్యమంత్రి మనకు ఉన్నారని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha elections : 'అబ్​ కీ బార్​ 400 పార్​'- బిహార్​ డిసైడ్​ చేస్తుంది..!

TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Kejriwal dares PM Modi: ‘రేపు మీ పార్టీ హెడ్ ఆఫీస్ కు వస్తాం.. ధైర్యముంటే అరెస్ట్ చేయండి’: మోదీకి కేజ్రీవాల్ సవాల్

ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల కు వచ్చిన అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ… ఓటు బ్యాంక్ రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని చిన్నాభిన్నం చేసిందని, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ తోపాటు, త్రిపుల్ తలాక్ మళ్లీ తీసుకువస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారని మండిపడ్డారు. అసలు ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఎజెండానేలేదని, గందరగోళంలో ఉన్న పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి బీజేపీపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్ ఆశయం యూనిఫాం సివిల్ కోడ్ అని, 60 ఏళ్లుపాలించిన కాంగ్రెస్ ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల పథకం ఏమైందని, మహిళలు, రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లు వేయరని చెప్పారు. యువత అంతా మోదీ వెంటే ఉన్నారని తెలిపారు.

కాళేశ్వరం దోషులకు శిక్ష పడాలి…

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) డ్యామేజీకి బాధ్యులైన వారిని జైలుకు పంపాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై చర్యలు తీసుకోవాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే సిబిఐ ఎంట్రీకి ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సిబిఐ విచారణతో పాత్రధారులు, సూత్రధారులను గుర్తించి జైలుకు పంపుతామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు దేశ దశదిశను మార్చే ఎన్నికలని, ఈ ఎన్నికల్లో ప్రజలు మోదీ వైపు నిలబడతారన్నారు.

రిపోర్టింగ్ - HT తెలుగు Correspondent K.V.REDDY, Karimnagar

తదుపరి వ్యాసం