Jagtial News : జగిత్యాలలో విషాదం, చిన్నారి ప్రాణం తీసిన స్కూల్ బస్సు
Jagtial News : జగిత్యాల జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. అప్పటి వరకూ ఎంతో ఆనందంగా ఆడుకున్న చిన్నారి...తల్లిదండ్రుల కళ్ల ముందే విగత జీవిగా మారింది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి మృతి చెందింది.
Jagtial News : జగిత్యాల జిల్లా(Jagtial)లో స్కూల్ బస్సు చిన్నారి ప్రాణం(School Bus Accident) తీసింది. అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లిన 18 నెలల చిన్నారి అరెబా...డ్రైవర్ అజాగ్రత్తతో టైర్ కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన మల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో జరిగింది.
మల్యాల మండలంలోని శ్రీ సరస్వతి విద్యానికేతన్ స్కూల్ బస్సు పిల్లలను తీసుకెళ్లేందుకు మద్దుట్లకు రాగ, ఎండీ రజాక్ హసీనా కుమారుడు సాగిల్ బస్సులో స్కూల్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కొడుకును బస్సు ఎక్కించేందుకు తల్లి హసినా వెళ్లగా వెంట ఏడాదిన్నర చిన్నారి సైతం వచ్చింది. కొడుకును బస్సు ఎక్కించే హడావిడిలో కూతురును గమనించలేదు తల్లి. పాప సైతం బస్సు ఎక్కేందుకు ముందుకు వెళ్లింది. బస్సు ముందు ఉన్న చిన్నారిని డ్రైవర్ చూడకుండా బస్సును ముందుకు తీసుకెళ్లడంతో టైర్ కింద పడి చిన్నారి (Toddler Comes Under Wheel)తలపగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
కళ్ల ముందే బిడ్డ ప్రాణం పోవడంతో తల్లడిల్లిన తల్లి
బస్సు కింద పడి ఏడాదిన్నర పాప ప్రాణాలు(School Bus Accident) కోల్పోవడంతో కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లి వెంట వచ్చిన పాపను గమనించకపోవడంతోనే దారుణం జరిగిందని భావిస్తున్నారు. టైర్ కింద పడి పాప ప్రాణాలకు కోల్పోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. స్కూల్ బస్సు పాప ప్రాణాలు తీయడంతో డ్రైవర్ పారిపోయాడు. స్థానికులు డ్రైవర్ తీరుపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి
హైదరాబాద్(Hyderabad) నగరంలో మరోసారి వీధి కుక్కలు(Stray dogs) రెచ్చిపోయాయి. గతేడాది వేసవిలోనూ చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు దాడులకు దిగాయి. ఇందులో కొందరు చిన్నారులు చనిపోగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా వేసవి వస్తే ఈ బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కూడా ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. రెండున్నరేళ్ల పాపపై వీధి కుక్కలు దాడి చేయటంతో…ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే….ఛత్తీస్ ఘడ్ నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబం జీడిమెట్లలోని గాయత్రి నగరంలో నివాసం ఉంటుంది. తల్లిదండ్రులు రోజువారీ కూలీ పనులు(బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ ) చేస్తారు. వీరి పిల్లలు వీధి బయట ఆడుకుంటుండగా… రెండు వీధి కుక్కలు దాడికి దిగాయి. పెద్ద పాప వాటి బారి నుంచి తప్పించుకోగా… చిన్నపాప అయిన దీపాలి(రెండున్నరేళ్లు) మాత్రం… కుక్కలకు చిక్కిపోయింది. దాడి చేసి చిన్నారిని తీవ్రంగా గాయపరిచాయి.చిన్నారిని దీపాలీని ఆసుపత్రికి తరలించగా.. శనివారం రాత్రి ప్రాణాలు(Streed dogs attack Child died ) విడిచింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
HT Correspondent K.V.REDDY, Karimnagar
సంబంధిత కథనం