తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kangana Ranaut : లోక్​సభ ఎన్నికల్లో కంగనా రనౌత్​కు బీజేపీ​ టికెట్​!

Kangana Ranaut : లోక్​సభ ఎన్నికల్లో కంగనా రనౌత్​కు బీజేపీ​ టికెట్​!

Sharath Chitturi HT Telugu

24 March 2024, 13:40 IST

    • Kangana Ranaut Lok Sabha elections : 2024 లోక్​సభ ఎన్నికల్లో కంగనా రనౌత్​ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఆమెకు బీజేపీ టికెట్​ ఇస్తుందని తెలుస్తోంది.
లోక్​సభ ఎన్నికల్లో కంగనా రనౌత్​ పోటీ..!
లోక్​సభ ఎన్నికల్లో కంగనా రనౌత్​ పోటీ..! (PTI)

లోక్​సభ ఎన్నికల్లో కంగనా రనౌత్​ పోటీ..!

2024 Lok Sabha elections : ప్రముఖ నటి కంగనా రనౌత్​.. 2024 లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హార్డ్​ కోర్​ ఫ్యాన్​గా పేరొందిన కంగనా రనౌత్​ను ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ భావిస్తోందట!

ట్రెండింగ్ వార్తలు

Transfers in AP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ - పల్నాడు కలెక్టర్ బదిలీ, పలువురు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు

Khammam Bettings: ఏపీలో ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో లెక్కలు.. జోరుగా బెట్టింగులు!

YS Jagan With IPac: ఐపాక్‌ బృందంతో జగన్ భేటీ.. మళ్లీ అధికారంలోకి వస్తున్నామని ధీమా..

Lok Sabha Elections Phase 5: ఐదో దశలో లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులు వీరే..

కంగనా రనౌత్​కు బీజేపీ టికెట్​..!

పలు మీడియా నివేదికల ప్రకారం.. బీజేపీ పార్టీ తరఫును కంగనా రనౌత్​ లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. హిమాచల్​ ప్రదేశ్​ మండీ లోక్​సభ సీటు నుంచి ఆమెను బరిలో దింపాలని కమల దళం భావిస్తోంది.

గతేడాది.. తన రాజకీయ అరంగేట్రం, ఎన్నికల్లో పోటీ విషయంపై స్పందించారు కంగనా రనౌత్​.

"శ్రీ కృష్ణుడి ఆశిస్సులు ఉంటే.. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తాను," అని ఆమె అన్నారు.

మోదీపై తనకి ఉన్న అభిమానాన్ని అనేకమార్లు బహిరంగంగానే చెప్పారు 37ఏళ్ల రనౌత్​.

Kangana Ranaut BJP : "ఒక యంగ్​ ఉమెన్​గా.. మనందరికి సరైన రోల్​ మోడల్స్​ ఉండాలని నేను విశ్వసిస్తాను. ఒక చాయ్​వాలా లాంటి వ్యక్తి ప్రధాని పదవిలో ఉంటే.. అది ఆయన విజయం కాదు, ప్రజాస్వామ్య విజయం అని నేను నమ్ముతాను. రోల్​ మోడల్​ అయ్యే అన్ని అర్హతలు మోదీకి ఉన్నాయని నేను అనుకుంటున్నాను," అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు కంగనా రనౌత్​.

జనవరి 22న, అట్టహాసంగా జరిగిన రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో కంగనా కూడా పాల్గొన్నారు. "రాముడు వచ్చాడు" అంటూ ట్విట్టర్​లో ఫొటోలను షేర్​ చేశారు.

సినీ తారలను ఎన్నికల బరిలో దింపడం రాజకీయ పార్టీలకు అలవాటే! గతంలో ప్రముఖ నటుడు సన్నీ డియోల్​, టీమిండియా మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​లను లోక్​సభ ఎన్నికల బరిలో దింపింది బీజేపీ. మరో మాజీ క్రికెటర్​ యూసఫ్​ పఠాన్​ని 2024 లోక్​సభ ఎన్నికల బరిలో దింపుతోంది తృణమూల్​ కాంగ్రెస్​.

Kangana Ranaut Lok Sabha elections : కంగనా రనౌత్​ నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. కన్నప్ప సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు. అంతేకాకుండా.. తను వెడ్స్​ మనూ పార్ట్​-3 కి ఆమె షూటింగ్​ ప్రారంభించారు. కంగనా నటించిన 'థలైవీ' సినిమాను తెరకెక్కించిన డైరక్టర్​ విజయ్​.. ఈ సినిమా రూపొందిస్తున్నారు. వీటితో పాటు క్వీన్​ 2 కూడా సిద్ధమవుతోందని సమాచారం.

మరి.. కంగనా రనౌత్​కు బీజేపీ టికెట్​ దక్కుతుందో లేదో.. ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఆమె గెలుస్తారా? లేదా? అనేది జూన్​లో వెలువడే ఎన్నికల ఫలితాలతో తెలిసిపోతుంది.

తదుపరి వ్యాసం