EC's poll date announcement: ఒకే లోక్ సభ స్థానం.. రెండు దశల్లో పోలింగ్; ఎక్కడో, ఎందుకో తెలుసా..?-ecs poll date announcement shows 544 seats instead of 543 is it an error ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ec's Poll Date Announcement: ఒకే లోక్ సభ స్థానం.. రెండు దశల్లో పోలింగ్; ఎక్కడో, ఎందుకో తెలుసా..?

EC's poll date announcement: ఒకే లోక్ సభ స్థానం.. రెండు దశల్లో పోలింగ్; ఎక్కడో, ఎందుకో తెలుసా..?

HT Telugu Desk HT Telugu
Mar 16, 2024 09:02 PM IST

Lok Sabha elections dates: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే సమయంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మొత్తం లోక్ సభ స్థానాల సంఖ్య 544 గా చూపించారు. నిజానికి ఎన్నికలు జరిగే లోక్ సభ స్థానాల సంఖ్య 543 మాత్రమే. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ సీఈసీ దృష్టికి తీసుకువచ్చారు.

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్న సీఈసీ, ఇతర అధికారులు
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్న సీఈసీ, ఇతర అధికారులు (ANI)

Lok Sabha elections Schedule: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ (Lok Sabha elections Schedule) ను ప్రకటిస్తూ భారత ఎన్నికల సంఘం (ECI) మొత్తం నియోజకవర్గాల సంఖ్యను 543కు బదులుగా 544గా చూపించింది.ఈ విషయాన్ని ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ సీఈసీ దృష్టికి తీసుకురాగా, సీఈసీ రాజీవ్ కుమార్ దానిపై వివరణ ఇచ్చారు. అది పొరపాటున అలా రాలేదని, మణిపూర్ లోని ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితుల కారణంగా రెండుసార్లు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని సీఈసీ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) వివరించారు.

yearly horoscope entry point

ఏడు దశల్లో ఎన్నికలు..

మణిపూర్ (Manipur) లోని ఒక నియోజకవర్గంలో రెండుసార్లు ఎన్నికలు జరుగుతాయని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సీఈసీ రాజీవ్ కుమార్ సమాధానమిచ్చారు. లోక్ సభ లోని 543 స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha election Schedule) జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏప్రిల్ 19న మొదటి దశ, ఏప్రిల్ 26న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1న చివరి, ఏడో దశ ఎన్నికలు జరగనున్నాయి.

మణిపూర్ నియోజకవర్గాలు

అయితే, ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కుకీలు, మెయితీ వర్గాల మధ్య ఇటీవల జరిగిన జాతి హింసను (Manipur ethnic violence) పరిగణనలోకి తీసుకుని, మణిపూర్ లోని రెండు లోక్ సభ () నియోజకవర్గాల్లో ఒకటైన ఔటర్ మణిపూర్ లో రెండు వేర్వేరు రోజులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గంలో ఏప్రిల్ 19 (మొదటి దశ), ఔటర్ మణిపూర్ లో ఏప్రిల్ 19 (PHASE 1), ఏప్రిల్ 26 (PHASE 2) తేదీలలో పోలింగ్ జరగనుంది.

ఒకే లోక్ సభ స్థానం.. రెండు దశల్లో పోలింగ్

ఔటర్ మణిపూర్ నియోజకవర్గానికి రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఔటర్ మణిపూర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు హీరోక్, వాంగ్జింగ్ టెంటా, ఖంగాబోక్, వాబ్గై, కక్చింగ్, హియాంగ్లామ్, సుగ్నూ, చందేల్ (ఎస్టీ), సైకుల్ (ఎస్టీ), కాంగ్పోక్పి, సైతు (ఎస్టీ), హెంగ్లెప్ (ఎస్టీ), చురాచంద్పూర్ (ఎస్టీ), సాయికోట్ (ఎస్టీ), సింఘాట్ (ఎస్టీ)లకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఇదే నియోజకవర్గం పరిధిలోని మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లు జిరిబమ్, తెంగ్నూపాల్ (ఎస్టీ), ఫుంగ్యార్ (ఎస్టీ), ఉఖ్రుల్ (ఎస్టీ), చింగై (ఎస్టీ), కరోంగ్ (ఎస్టీ), మావో (ఎస్టీ), తదుబి (ఎస్టీ), తామేయి (ఎస్టీ), తమెంగ్లాంగ్ (ఎస్టీ), నుంగ్బా (ఎస్టీ), టిపాయిముఖ్ (ఎస్టీ), థన్లాన్ (ఎస్టీ)లకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాకుండా హింసాత్మక ఘర్షణల కారణంగా శిబిరాల్లో నివసిస్తున్న ఓటర్లు రాబోయే ఎన్నికల్లో తమ శిబిరాల నుంచి ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం వీలు కల్పించనుంది.

మణిపూర్ హింస

గత ఏడాది మేలో మణిపూర్ లో మెయితీ, గిరిజన కుకి వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో జాతి ఘర్షణలు చెలరేగాయి. ఆ హింసాత్మక ఘర్షణల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 25,000 మందిని భద్రతా దళాలు రక్షించాయి. సుమారు 50,000 మంది శిబిరాల్లో నివసిస్తున్నారు.

Whats_app_banner