Lok Sabha Elections Phase 2 : ముగిసిన లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్; లైవ్ అప్డేట్స్..
26 April 2024, 21:35 IST
- Lok Sabha Elections 2024 phase 2 live updates : ప్రధాని మోడీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నెలకొన్న తరుణంలో 2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌పై ఫోకస్ పెరిగింది. రెండో దశ పోలింగ్ లైవ్ అప్డేట్స్ కోసం ఈ హెచ్‌టీ తెలుగు పేజ్ని ఫాలో అవ్వండి.
ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్; త్రిపురలో అత్యధికం; యూపీలో అత్యల్పం
2024 లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. రెండో దశలో త్రిపురలో అత్యధిక పోలింగ్, యూపీలో అత్యల్ప పోలింగ్ నమోదైంది. రెండో దశ పోలింగ్ చాలా బాగా జరిగిందని ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం ట్వీట్ చేశారు.
కేరళలో 69.04 శాతం పోలింగ్
లోక్ సభ రెండో దశ ఎన్నికల్లో కేరళలో 69.04 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకే ఇక్కడ 51.64 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. కేరళలోని 20 లోక్ సభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. కేరళలో మొత్తం 2.77 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు.
ఓటు వేయడానికి బెంగళూరు వాసుల బద్ధకం..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులో సగటున 52 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తాజా గణాంకాలు వెల్లడించాయి. బెంగళూరులో 2018 అసెంబ్లీ ఎన్నికలలో 57%, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 62% పోలింగ్ నమోదైంది. అంటే, 2013, 2018 కన్నా.. 2023 లో బెంగళూరులో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది.
కర్నాటకలో ‘అడవి’ థీమ్ తో పోలింగ్ బూత్
లోక్‌సభ ఎన్నికల 2024 రెండో దశలో ఓటర్లను ఆకర్షించేందుకు కర్నాటకలోని కనకపుర పోలింగ్ స్టేషన్ పరిధిలో ‘అడవి’ థీమ్‌తో ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఓటుహక్కును వినియోగించుకోవడంపై అవగాహన పెంచడంతో పాటు, అటవీ పరిరక్షణపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ‘అడవి’ థీమ్ తో పోలింగ్ బూత్ ను కనకపుర ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసింది. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకు ఇక్కడ మొక్కలను కూడా పంపిణీ చేశారు.
రెండో దశ పోలింగ్ సందర్భంగా కేరళలో నలుగురు మృతి
2024 లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైన తర్వాత కేరళలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు ఓటర్లు కాగా, ఒకరు పోలింగ్ ఏజెంట్ అని అధికారులు తెలిపారు. కేరళలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కేరళలో మధ్యాహ్నం 12.30 గంటల వరకు 34 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ ప్రక్రియ టైమింగ్స్..
శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన 2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రక్రియ.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏప్రిల్ 19న జరిగిన తొలి దశ పోలింగ్‌లో దాదాపు 65శాతం పోలింగ్ నమోదైంది.
బోటులో వెళ్లి ఓటు వేశారు..
త్రిపురలోని రైమా వ్యాలీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్లు.. బోట్ల సాయంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం 11 వరకు పోలింగ్ శాతం..
అసోం 27.43%
బిహార్ 21.68%
ఛత్తీస్‌గఢ్ 35.47%
జమ్ముకశ్మీర్ 26.61%
కర్ణాటక 22.34%
కేరళ 25.61%
మధ్యప్రదేశ్ 28.15%
మహారాష్ట్ర 18.83%
మణిపూర్ 33.22%
రాజస్థాన్ 26.84%
త్రిపుర 36.42%
పశ్చిమ్ బెంగాల్ 31.25%
మధ్యప్రదేశ్‌లో..
ఉదయం 11 గంటల వరకు మధ్యప్రదేశ్‌లో 28.15శాతం పోలింగ్ నమోదైంది.
ఎన్నికల పొత్తులు..
పొత్తుల విషయంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఎన్నికల తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ నేత ఆకాశ్ ఆనంద్ చెప్పారు. యూపీలో ఓటు వేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
15.88 కోట్ల మంది ఓటర్లు..
రెండో దఫా పోలింగ్‌లో మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 8.08 కోట్ల మంది. మహిళలు 7.8 కోట్ల మంది. థర్డ్ జెండర్ 5,929 మంది ఉన్నారు. 34.8 లక్షల మంది ఫస్ట్ టైమ్ ఓటర్లు ఉన్నారు.
వీవీప్యాట్ కేసులో సుప్రీం కీలక తీర్పు..
ఓవైపు 2024 లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా.. మరోవైపు ఈవీఎం-వీవీ ప్యాట్ కేసులో కీలక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో.. 100శాతం వీవీప్యాట్ల స్లిప్స్‌ని సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అదే సమయంలో.. ఈవీఎం వ్యవస్థను తొలగించి, మళ్లీ పేపర్ బ్యాలెట్ ప్రక్రియను అమలు చేయాలన్న పిటిషన్లను సైతం తోసిపుచ్చింది జస్టిస్ ఖన్నా, జస్టిస్ దత్తతో కూడిన ధర్మాసనం.
కర్ణాటక సీఎం ఓటు..
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఓటు వేశారు. చమరాజ నగర్ హుండి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటేసిన శశి థరూర్..
కేరళ తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆసుపత్రి నుంచి వచ్చి..
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. బెంగళూరులో తన ఓటును వినియోగించుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. వైద్యుల నుంచి అనుమతి పొంది మరీ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేశారు.
మణిపూర్‌లో పటిష్ట బందోబస్తు..
పటిష్ట బందోబస్తు మధ్య మణిపూర్‌లోని 13 లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఓటేసిన నిర్మలా సీతారామన్..
బెంగళూరులో పోలింగ్ కేంద్రాల్లో ప్రముఖుల సందడి కనిపిస్తోంది. తాజాగా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వం కోసం చూస్తున్నారని, మోదీ మళ్లీ గెలవాలని అందరు అనుకుంటున్నారని.. ఆమె పేర్కొన్నారు.
ఓటేసిన రాహుల్ ద్రవిడ్..
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువత ముందుకొచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
వసుంధరా రాజే ఓటు..
రాజస్థాన్ బీజేపీ నేత వసుంధరా రాజే.. జలావర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటేసిన సుధా మూర్తి..
ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి.. బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
పోలింగ్ షురూ..
2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమమైంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మణిపూర్‌లో ఓ 94ఏళ్ల వృద్ధురాలు.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
7 దశల్లో పోలింగ్..
2024 లోక్‌సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరగనుంది. మూడో దశ పోలింగ్ మే 7న జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.
1,210 మంది అభ్యర్థులు..
రెండో దశ పోలింగ్‌లో మొత్తం 1,210 మంది అభ్యర్థులు బరిలో దిగారు. వీరిలో 74 మంది బీఎస్పీ, 69 మంది బీజేపీ, 68 మంది కాంగ్రెస్ టికెట్‌తో పోటీ చేస్తున్నారు.
మాక్ డ్రిల్స్..
2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో.. అన్ని పోలింగ్ స్టేషన్స్‌లో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి.
89 స్థానాల్లో..
వాస్తవానికి ఈ దఫా పోలింగ్‌లో 89 సీట్లకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్ బేటుల్ నియోజకవర్గం పోలింగ్ని మే 7కు వాయిదా వేశారు. బీఎస్పీ అభ్యర్థి మరణం ఇందుకు కారణం.
బరిలో ప్రముఖులు..
2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో చాలా మంది ప్రముఖులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా.. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళ వయనాడ్‌లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ నేత శశిథరూర్, బజేపీ హేమ మాలిని కూడా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మొత్తం 88 సీట్లు..
మొత్తం 20 రాష్ట్రాల్లో శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో 14 సీట్లు కర్ణాటకలో, 13 సీట్లు రాజస్థాన్‌లో, 8 సీట్లు ఉత్తర్ ప్రదేశ్‌లో, 8 సీట్లు మహారాష్ట్రలో, 7 సీట్లు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి.
రెండో దశ పోలింగ్‌కు వేళాయే..
భారత్‌లో మరో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం.. 2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు సమయం ఆసన్నమైంది. ఈ దఫా పోలింగ్‌లో మొత్తం 88 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసిన విషయం తెలిసిందే.