తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kcr Karimnagar: ఏప్రిల్ 5న కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన…రైతుల్ని పరామర్శించనున్న బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు

KCR Karimnagar: ఏప్రిల్ 5న కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన…రైతుల్ని పరామర్శించనున్న బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు

HT Telugu Desk HT Telugu

01 April 2024, 5:43 IST

google News
    • KCR Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పర్యటన ఖరారైంది. పొలం బాటలో భాగంగా ఏప్రిల్ 5న  జిల్లాలో పర్యటిస్తారు. 
కేసీఆర్ పర్యటన ఏఱ్పాట్లపై గంగుల, వినోద్ సమావేశం
కేసీఆర్ పర్యటన ఏఱ్పాట్లపై గంగుల, వినోద్ సమావేశం

కేసీఆర్ పర్యటన ఏఱ్పాట్లపై గంగుల, వినోద్ సమావేశం

KCR Karimnagar: కరీంగనర్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ KCR పర్యటన ఖరారైంది. కరీంనగర్ Karimnagar, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు.

కేసీఆర్ పర్యటన ఖరారు కావడంతో కరీంనగర్ ఎమ్మెల్యే మాజీమంత్రి గంగుల కమలాకర్ Gangula Kamalkar, బిఆర్ఎస్ BRS ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ Vinod Kumar, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బిఆర్ఎస్ జిల్లా అద్యక్షులు జి.వి రామకృష్ణారావు స్థానిక నాయకులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు.

రైతుకు అండగా కేసిఆర్ టూర్

భూగర్భ జలాలు అడుగంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో సాగునీరు కరువై పంట పొలాలు ఎండి రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో అన్నదాతకు అండగా నిలిచేందుకు కేసీఆర్ పొలం బాట పట్టారని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.

ఏప్రిల్ 5న April 5 ఉమ్మడి జిల్లాలో పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించి .. పొలాల వద్ద రైతులతో ముఖాముఖి మాట్లాడి రైతుల సమస్యలు తెలుసుకొనున్నారని చెప్పారు. అన్నదాతలకు ధైర్యాన్నిచ్చి భరోసా కల్పించనున్నారని వెల్లడించారు.‌

ఏప్రిల్ 5న ఉదయం కరీంనగర్ నియోజకవర్గంలోని మొగ్దుంపూర్ గ్రామంలో ఎండిపోయిన పొలాలను పరిశీలించి, రైతుల సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. అనంతరం చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించి.. సిరిసిల్లలో పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని వెల్లడించారు.

వేలాది ఎకరాల్లో ఎండిన పంటలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. మెట్ట ప్రాంతాలైన సిరిసిల్ల వేములవాడ హుస్నాబాద్ మానకొండూర్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు లక్షా ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది.

పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండిపోయి పెట్టుబడి మీదపడి అప్పులపాలైన రైతులను ప్రభుత్వం ఆధహదుకుంటేనే బతుకుదెరువు లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(రిపోర్టింగ్‌, కే.వీ.రెడ్డి, ఉమ్మడి కరీం నగర్ జిల్లా)

తదుపరి వ్యాసం