తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Exit Polls: ‘ఎన్డీయే’ కు హ్యాట్రిక్ విజయం; మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతోందిదే.. ఎగ్జిట్ పోల్స్ లైవ్ అప్ డేట్స్..
లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై హిందుస్తాన్ టైమ్స్ తెలుగు లైవ్ అప్ డేట్స్
లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై హిందుస్తాన్ టైమ్స్ తెలుగు లైవ్ అప్ డేట్స్

Exit polls: ‘ఎన్డీయే’ కు హ్యాట్రిక్ విజయం; మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతోందిదే.. ఎగ్జిట్ పోల్స్ లైవ్ అప్ డేట్స్..

01 June 2024, 22:22 IST

  • 7 విడతల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. తుది దశ పోలింగ్ ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే విజయాన్ని అంచనా వేస్తున్నాయి. మోదీ హ్యాట్రిక్ పీఎం అవుతారని స్పష్టం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయో లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూద్దాం

01 June 2024, 22:22 IST

యూపీలో బీజేపీకి 67 సీట్లు..

కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. యూపీలో 80 సీట్లకు గానూ బీజేపీ 64 నుంచి 67 స్థానాల్లో గెలుస్తుందని, ఎస్పీ 7 నుంచి 9 స్థానాల్లో, కాంగ్రెస్ 1 నుంచి 3 సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపింది.

01 June 2024, 22:17 IST

‘‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’’.. సాధ్యమే

2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం ఖాయమేనని ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది. ప్రధాని మోదీ ఆశించిన 400 సీట్లు కూడా సాధ్యమేనని వెల్లడించింది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు గానూ 361 నుంచి 401 సీట్లు ఎన్డీయే గెలుస్తుందని ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలిపింది. మరోవైపు, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 131 నుంచి 166 సీట్లు, ఇతరులు 8 నుంచి 20 సీట్లలో గెలవవచ్చని వెల్లడించింది.

01 June 2024, 22:09 IST

సిక్కింలో ఎస్ కేఎం ఘన విజయం

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. సిక్కింలోని మొత్తం 32 అసెంబ్లీ సీట్లలో 30 స్థానాల్లో ఎస్కేఎం విజయం సాధిస్తుందని తెలిపింది.

01 June 2024, 21:47 IST

‘టైమ్స్ నౌ - ఈటీజీ సర్వే’ ఎగ్జిట్ పోల్ సర్వే ఏం చెబుతోంది?

టైమ్స్ నౌ - ఈటీజీ సర్వే ఎగ్జిట్ పోల్ కూడా 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే 358 సీట్లలో , కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి 152 స్థానాల్లో, ఇతరులు 33 సీట్లలో విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ - ఈటీజీ సర్వే అంచనా వేసింది. అలాగే, ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ 69 సీట్లలో, ఇండియా కూటమి 11 సీట్లలో గెలుస్తుందని పేర్కొంది.

01 June 2024, 21:23 IST

ఒడిశాలోనూ బీజేపీకి అనుకూల పవనాలు

బిజూ జనతాదళ్, ఆ పార్టీ చీఫ్ నవీన్ పట్నాయక్ లకు కంచుకోట వంటి ఒడిశాలో 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గణనీయ స్థాయిలో సీట్లను గెలుచుకుంటుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లను బీజేపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ 9 నుంచి 12 సీట్లలో గెలుస్తుందని, బీజేడీ 7 నుంచి 9 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ సున్నా నుంచి ఒక సీటు గెలవొచ్చని రిపబ్లిక్ - మాట్రైజ్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. అలాగే, బీజేపీ 13 సీట్లలో, బీజేడీ 8 సీట్లలో విజయం సాధిస్తాయని ఇండియా న్యూస్ - డీ డైనమిక్స్ అంచనా వేసింది. మరోవైపు, బీజేపీ 15 నుంచి 17 సీట్లలో, బీజేడీ4 నుంచి 6 సీట్లలో గెలుస్తాయని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ స్థానాలున్నాయి.

01 June 2024, 20:45 IST

పంజాబ్ లో కాంగ్రెస్ కు ఊరట

ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం, వరుసగా కీలక రాష్ట్రాల్లో ఓటమి పాలవుతున్న కాంగ్రెస్ కు పంజాబ్ కాస్త ఊరట ఇచ్చింది. పంజాబ్ లోని మొత్తం 13 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు 7 నుంచి 9 సీట్లు వస్తాయని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఆప్ కు 1 నుంచి 2 సీట్లు, బీజేపీకి 2 నుంచి 4 సీట్లు, శిరోమణి అకాలీదళ్ కు 1 నుంచి 2 సీట్లు వస్తాయని పేర్కొంది.

01 June 2024, 20:29 IST

పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీకి షాక్

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కు బీజేపీ షాక్ ఇస్తుందని ఎన్డీటీవీ - జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఈ రాష్ట్రంలో 21 నుంచి 26 సీట్లలో బీజేపీ గెలుస్తుందని, 16 నుంచి 18 సీట్లలో టీఎంసీ విజయం సాధిస్తుందని ఎన్డీటీవీ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో 18 సీట్లలో బీజేపీ, 22 సీట్లలో టీఎంసీ విజయం సాధించాయి. పశ్చిమ బెంగాల్ లో మొత్తం 42 ఎంపీ సీట్లు ఉన్నాయి.

01 June 2024, 20:18 IST

‘ఓటేసిన ప్రజలకు థ్యాంక్స్ ’: ప్రధాని మోదీ

లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్న భారత ఓటర్లకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇండియా ఓటేసింది. ఎన్నికల ప్రక్రియలో వారు చురుగ్గా పాల్గొనడమే భారత ప్రజాస్వామ్యానికి కీలకం. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అందరికీ, ముఖ్యంగా మహిళలు, యువతకు నా ధన్యవాదాలు’’ అని శనివారం సాయంత్రం ఆయన ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు.

01 June 2024, 20:14 IST

8 రాష్ట్రాల్లోని 241 సీట్లలో 150 నుంచి 169 ఎన్డీయేవే..

ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ లో ఇప్పటివరకు కర్నాటక, కేరళ, తమిళనాడు, జార్ఖండ్, చత్తీస్ గఢ్, గుజరాత్, రాజస్తాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించారు. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 241 స్థానాల్లో 150 నుంచి 169 స్థానాలు ఎన్డీయే, 70 నుంచి 89 స్థానాలు ఇండియా కూటమి, 1 నుంచి 5 స్థానాలు ఇతరులు గెల్చుకుంటారని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తేల్చింది.

01 June 2024, 19:58 IST

దైనిక్ భాస్కర్, న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి..?

దైనిక్ భాస్కర్, న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీయే కు ఫేవర్ గానే తమ అంచనాలను వెలువరించాయి. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే 281 నుంచి 350 స్థానాల్లో, ఇండియా కూటమి 145 నుంచి 201 సీట్లలో, ఇతరులు 33 నుంచి 49 స్థానాల్లో విజయం సాధిస్తాయి. న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం.. ఎన్డీయే 342 నుంచి 378 స్థానాల్లో, ఇండియా కూటమి 153 నుంచి 169 సీట్లలో, ఇతరులు 21 నుంచి 23 స్థానాల్లో విజయం సాధిస్తాయి.

01 June 2024, 19:50 IST

గుజరాత్ లో అందరూ ఊహించినట్లే..

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ల సొంత రాష్ట్రం గుజరాత్ లో అందరూ ఊహించినట్లే బీజేపీ క్లీన్ స్వీప్ తప్పదని ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తేల్చింది. గుజరాత్ లోని మొత్తం 26 సీట్లలో బీజేపీ 25 నుంచి 26 సీట్లు గెల్చుకుంటుందని స్పష్టం చేసింది.

01 June 2024, 19:41 IST

రిపబ్లిక్ టీవీ -మాట్రైజ్ ఎగ్జిట్ పోల్ ఏం చెబుతోందంటే..

రిపబ్లిక్ టీవీ - మాట్రైజ్ ఎగ్జిట్ పోల్ కూడా ఎన్డీయే విజయాన్నే అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ - మాట్రైజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 353 నుంచి 368 సీట్లు, విపక్ష ఇండియా కూటమికి 118 నుంచి 133 సీట్లు, ఇతరులకు 43 నుంచి 48 సీట్లు వస్తాయి.

01 June 2024, 19:37 IST

రాజస్తాన్ కూడా బీజేపీదే..

రాజస్తాన్ లో ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తేల్చింది. రాజస్తాన్ లోని 25 నియోజకవర్గాల్లో 16 నుంచి 19 సీట్లలో బీజేపీ, 5 నుంచి 7 సీట్లలో కాంగ్రెస్, 1 నుంచి 2 సీట్లలో ఇతరులు విజయం సాధిస్తారని అంచనా వేస్తోంది. రాజస్తాన్ లో బీజేపీ 51%, కాంగ్రెస్ 37% ఓట్లు సాధిస్తారని తెలిపింది.

01 June 2024, 19:32 IST

మేం కూడా ఎన్డీయేనే అంటున్న ‘జన్ కీ బాత్’ ఎగ్జిట్ పోల్

తమ ఎగ్జిట్ పోల్ లో కూడా ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని తేలిందని ‘జన్ కీ బాత్’ వెల్లడించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు 362 నుంచి 392 సీట్లు, ఇండియా కూటమికి 141 నుంచి 161 సీట్లు, ఇతరులకు 10 నుంచి 20 సీట్లు వస్తాయని ‘జన్ కీ బాత్’ అంచనా వేసింది.

01 June 2024, 19:30 IST

మధ్య ప్రదేశ్ లో బీజేపీ క్లీన్ స్వీప్

మధ్య ప్రదేశ్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తేల్చింది. మధ్య ప్రదేశ్ లోని 29 సీట్లకు గానూ, బీజేపీకి 28 నుంచి 29 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 1 స్థానం లో గెలిచే అవకాశం ఉందని తేల్చింది.

01 June 2024, 19:10 IST

బిహార్ లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ

బిహార్ లో విపక్ష ఇండియా కూటమి ఆశించిన సీట్లను సాధించలేకపోవచ్చని ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఈ ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం.. బిహార్ లో ఈ ఎన్నికల్లో బీజేపీకి 13 నుంచి 15 సీట్లు, బీజేపీ మిత్ర పక్షం జేడీయూకి 9 నుంచి 11, ఆర్జేడీకి 6 నుంచి 7, కాంగ్రెస్ కు 2 నుంచి 3 స్థానాలు రావచ్చు. బిహార్ లో మొత్తం 40 ఎంపీ సీట్లు ఉన్నాయి.

01 June 2024, 19:05 IST

ఎన్డీటీవీ ఇండియా ఎగ్జిట్ పోల్ ది కూడా అదే మాట..

ఎన్డీటీవీ ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా ఎన్డీయే విజయాన్నే అంచనా వేసింది. ఎన్డీటీవీ ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఈ ఎన్నికల్లో ఎన్డీయే 365 సీట్లలో, ఇండియా కూటమి 142 స్థానాల్లో, ఇతరులు 36 సీట్లలో విజయం సాధిస్తాయి.

01 June 2024, 21:25 IST

కేరళలోయూడీఎఫ్ ఘన విజయం

కేరళలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధిస్తుందని ఇండియాటుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే తేల్చింది. కేరళలో యూడీఎఫ్ కు మొత్తం 20 స్థానాలకు గానూ 17 నుంచి 18 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎన్డీయే 1 నుంచి 2 సీట్లలో, ఎల్డీఎఫ్ 1 నుంచి 2 సీట్లలో గెలుస్తుందని పేర్కొంది.

01 June 2024, 18:58 IST

ఎన్డీయే విజయం ఖాయమన్న ఇండియా న్యూస్ - డీ డైనమిక్స్ ఎగ్జిట్ పోల్స్

2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయాన్ని మరో ఎగ్జిట్ పోల్ నిర్ధారించింది. ఇండియా న్యూస్ - డీ డైనమిక్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఎన్డీయేకు ఈ ఎన్నికల్లో 371 స్థానాలు, ఇండియా కూటమికి 125 సీట్లు వస్తాయి. ఇతరులు 35 నుంచి 45 సీట్లు గెల్చుకుంటారు.

01 June 2024, 18:55 IST

కర్నాటకలో బీజేపీ హవా

కర్నాటకలో ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హవా కనిపిస్తోందని ఇండియా టుడే - మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. కర్నాటకలో బీజేపీ 23 నుంచి 25 సీట్లు, కాంగ్రెస్ 3 నుంచి 5 సీట్లు గెల్చుకుంటుందని ఇండియా టుడే సర్వే తేల్చింది.

01 June 2024, 18:50 IST

రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. ఎన్డీయే దే విజయం

రిపబ్లిక్ టీవీ- పీ మార్క్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం.. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధిస్తుంది. ఎన్డీయే కు 359 సీట్లు, ఇండియా కూటమికి 154 సీట్లు, ఇతరులకు 30 సీట్లు వస్తాయి.

01 June 2024, 18:45 IST

తమిళనాడులో ఇండియా కూటమిదే ఘన విజయం

2024 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో ప్రతిపక్ష ఇండియా కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే తేల్చింది. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తమిళనాడులో ఇండియా కూటమికి 26 నుంచి 30 సీట్లు వస్తాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 1 నుంచి 3 సీట్లు రావచ్చు. ఇతరులు 5 నుంచి 6 సీట్లలో గెలుపొందవచ్చు.

01 June 2024, 18:24 IST

ఇండియా కూటమికి, ఎన్డీయేకు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేసిన కేజ్రీవాల్

ఎగ్జిట్ పోల్స్ కు ముందు విపక్ష ఇండియా కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయో, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు ఎన్ని స్థానాలు వస్తాయో ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. తమ కూటమికి కనీసం 295 స్థానాలు వస్తాయన్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే 235 సీట్లలో గెలుపొందుతుంది అన్నారు. ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరో జూన్ 4 న నిర్ణయిస్తామన్నారు.

01 June 2024, 18:00 IST

ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొంటాం: ఇండియా కూటమి

శనివారం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడడానికి కొన్ని గంటల ముందు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఎగ్జిట్ పోల్ టెలివిజన్ డిబేట్లను ఇండియా కూటమి బహిష్కరించకూడదని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎగ్జిట్ పోల్ టెలివిజన్ డిబేట్లలో తాము పాల్గొనబోమని కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ మార్చుకుంది. తమ నేతలు న్యూస్ చానళ్లలో ఎగ్జిట్ పోల్ చర్చల్లో పాల్గొంటారని స్పష్టం చేసింది.

01 June 2024, 17:20 IST

ఈ రోజు సాయంత్రం 6. 30 నుంచి ఎగ్జిట్ పోల్స్

ఈ రోజు, జూన్ 1 సాయంత్రంతో లోక్ సభ ఎన్నికల సమరం ముగుస్తుంది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలను ఈసీ విజయవంతంగా నిర్వహించింది. పోలింగ్ సమయం ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించడానికి ఈసీ అనుమతించింది. అంటే, ఈ రోజు సాయంత్రం 6.30 నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతాయి.

    ఆర్టికల్ షేర్ చేయండి