AP Loksabha Election Results 2024 Live Updates : ఏపీ లోక్ సభ ఎన్నికల ఫలితాలు - వైసీపీకి షాక్, సత్తా చాటిన కూటమి
04 June 2024, 16:41 IST
- Andhrapradesh Loksabha Election Results 2024 Live Updates : ఏపీలోని లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఫలితాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
పవన్ కు చిరంజీవి అభినందలు
“డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని ,విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను” అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
వైసీపీ ఘోర వైఫల్యం
ఏపీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా చతికిలపడిపోయింది. కేవలం 3 - 4 స్థానాల్లో మాత్రమే పాగా వేసే అవకాశం ఉంది. మిగిలిన సీట్లన్నీ కూటమి ఖాతాలో వెళ్లాయి.
శ్రీభరత్ విజయం
టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ విజయం సాధించారు. 2.84 లక్షల ఓట్ల మెజార్టీతో శ్రీభరత్ విక్టరీ కొట్టారు.
ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థులు
రాజమహేంద్రవరం స్థానం నుంచి బరిలోకి దిగిన దగ్గుబాటి పురందేశ్వరి 2,19,688 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. నర్సాపురంలో భూపతిరాజు శ్రీనివాస వర్మ 2,12,681 ఓట్లతో ముందంజలో ఉన్నారు. అనకాపల్లిలో సీఎం రమేశ్ 1,09,140 ఓట్ల లీడ్‌తో కొనసాగుతున్నారు.
మచిలీపట్నంలో బాలశౌరి
మచిలీపట్నం లోక్ సభ పరిధిలో ఆరు రౌండ్లు ముగిసేసరికి జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి 85,537 మెజార్టీతో దూసుకుపోతున్నారు.
కూటమి అభ్యర్థులకు భారీ ఆధిక్యం….
గుంటూరు లోక్‌సభ టిడిపి అభ్యర్థి పెమ్మసాని 1.58 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అమలాపురం లోక్‌సభ టిడిపి అభ్యర్థి హరీష్ 1.54లక్షల ఓట్ల ఆధిక్యంలోఉండగా… విశాఖ లోక్‌సభ టిడిపి అభ్యర్థి శ్రీభరత్‌కు 1.69లక్షల ఓట్ల ఆధిక్యం దక్కింది. శ్రీకాకుళం లోక్‌సభ టిడిపి అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు 1.70 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
4 చోట్ల మాత్రమే వైసీపీ
అరకు, తిరుపతి, రాజంపేట, కడప పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే వైసీపీ లీడ్ లో ఉంది.
భారీ మెజార్టీ దిశగా పురందేశ్వరి
రాజమండ్రి నుంచి పోటీ చేసిన పురందేశ్వరి విజయం సాధించే దిశగా వెళ్తున్నారు. ఇప్పటికే 2 లక్షలకుపైగా మెజార్టీ సాధించారు.
సీఎంగా చంద్రబాబు
ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 4వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మిథున్‌రెడ్డికి ఆధిక్యం
రాజంపేటలో వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కిరణ్‌కుమార్ రెడ్డిపై 3 వేల ఓట ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
విజయనగరంలో టీడీపీ లీడ్
విజయనగరం పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్ధి కలిశెట్టి అప్పలనాయుడు 9000 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
20 స్థానాలకు పైగా కూటమి ఖాతాలోకే…
ఏపీలో ఉన్న 25 పార్లమెంట్ స్థానాల్లో 20పైగా లోక్‌సభ స్థానాల్లో కూటమిదే పైచేయి ఉంది.
వేమిరెడ్డికి ఆధిక్యత
నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో 32 వేల 817 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
కూటమి అభ్యర్థుల జోరు
ఏపీలో 16 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ లీడ్ లో ఉంది. 3 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతను కనబరుస్తోంది. 2 స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది.
దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు
ఏపీలో కూటమి ఎంపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 25 స్థానాలకు గానూ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది.
టీడీపీ లీడ్ లో ఉన్న స్థానాలు
శ్రీకాకుళం, విజయనగరం, అమలాపురం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, కర్నూలు, అనంతపురం, హిందూపూర్, నెల్లూరు, చిత్తూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ లీడ్ లో ఉంది.
కూటమి లీడ్ లో ఉన్న పార్లమెంట్ స్థానాలు
విజయవాడ, రాజమండ్రి, నరసరావుపేట, తిరుపతి, హిందూపురం, అనకాపల్లి, గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఆధిక్యంలో ఉన్నారు.
పెమ్మసానికి 3 వేల ఆధిక్యం
గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని 3 వేల పైచిలుకు ఆధిక్యం లో ఉన్నారు. కేశినేని శివనాథ్ 5 వేల పైచిలుకు ఆధిక్యం దక్కింది.
6 స్థానాల్లో టీడీపీ
తెలుగుదేశం పార్టీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ రెండు స్థాానాల్లో, వైసీపీ 2 స్థానాల్లో లీడ్ లో ఉంది.
గురుమూర్తికి ఆధిక్యం
తిరుపతి పార్లమెంట్ స్థానం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏం.గురుమూర్తి ఆధిక్యం లభించింది.
కేశినేని చిన్నికి లీడ్
విజయవాడ పార్లమెంట్ : తొలి రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్నికి 1200 ఓట్ల ఆధిక్యం దక్కింది.
వేమిరెడ్డికి ఆధిక్యం
నెల్లూరు లోక్‌సభలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
కడపలో అవినాశ్ రెడ్డికి లీడ్
మొదటి రౌండ్ లో వైయస్ అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్ నుంచి 2,274 లీడ్ లో కొనసాగుతున్నారు
నంద్యాల పరిధిలో టీడీపీకి లీడ్
నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ లో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి స్వల్ప ఆధిక్యం దక్కింది.
509 ఓట్ల ఆధిక్యం
నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో లావు కృష్ణదేవరాయలు 509 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
నరసరావుపేటలో కూటమి అభ్యర్థి ఆదిక్యం
నరసరావుపేటలో చూస్తే కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు… ఆధిక్యంలో ఉన్నారు.
ఆధిక్యంలో పురందేశ్వరి
రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం 617 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
నంద్యాల పార్లమెంట్ పరిధిలో టీడీపీకి లీడ్…..
నంద్యాల పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ లీడ్ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
బుచ్చయ్య చౌదరి లీడింగ్
రాజమండ్రి రూరల్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి లీడింగ్ లో ఉన్నారు. 910 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
5 లక్షల పోస్టల్ ఓట్లు…!
ఏపీలో 4 లక్షలకుపైగా పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. వీటిని ప్రస్తుతం లెక్కిస్తున్నారు. సర్వీస్ ఓటర్లతో కలిపి ఈ సంఖ్య 5 లక్షలు దాటింది.
అభ్యర్థుల సమక్షంలోనే….
అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ల ను అధికారులు తెరుస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరికొన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ షురూ అయింది.
ప్రారంభమైన కౌంటింగ్
ఏపీలో లోక్ సభ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు.
కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం….
కాసేపట్లో ఏపీలోని లోక్ సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంఓభం కానుంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. దీని ప్రకారం.. ట్రెండ్స్ షురూ కానున్నాయి.
ఉదయం 5 గంటలకే చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
ఉదయం 5 గంటలకే కూటమి నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో బీజేపీ నేత పురందేశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో పాటు మూడు పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం అయిన చంద్రబాబు పలు సూచనలు చేశారు.
2019 ఫలితాలు ఇలా….
2019 ఎన్నికల్లో వైసీపీ 22 పార్లమెంట్ స్థానాలను గెలవగా… తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాలతోనే సరిపెట్టుకుంది.
8 గంటలకు కౌంటింగ్ షురూ….
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించనున్నారు.
ఊరేగింపులకు అవకాశం లేదు - సీఈవో
కౌంటింగ్ రోజు ఫలితాలు వచ్చినా ఊరేగింపులు చేసుకునేందుకు అవకాశం లేదని ఏపీ సీఈవో తెలిపారు.సరైన కారణాల ఉంటే మాత్రమే రీకౌంటింగ్ కు ఆదేశాలు ఇస్తామన్నారు
కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేశారు. ఇక్కడ వైసీపీ తరపున అవినాశ్ రెడ్డి ఉన్నారు.
6 స్థానాల్లో బీజేపీ, 17 స్థానాల్లో టీడీపీ
ఏపీలో లోక్ సభ ఎన్నికల్లో కూటమి తరపు వివరాలు చూస్తే… బీజేపీ 6 పార్లమెంట్, టీడీపీ - 17, జనసేన 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. ఇక వైసీపీ 25 స్థానాల్లోనూ ఒంటరిగానే బరిలో నిలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది.
45వేల మంది పోలీసులు
కౌంటింగ్ వేళ ఏపీలో 67 కంపెనీల సాయుధ భద్రతా సిబ్బంది, 45 వేల మంది పోలీసులను పూర్తి స్థాయిలో మొహరిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది ఎలాంటి చిన్న ఘటన కూడా జరక్కుండా చూడటమే ఈసీ బాధ్యత సీఈవో ప్రకటించారు.
12 వేల మంది బైండోవర్
185 ప్రాంతాలను హింస జరిగే అవకాశం ఉందని గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 12 వేల మందిని గుర్తించి బైండోవర్ చేశారు.
భారీ భద్రత
ఎన్నికల రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు దృష్ట్యా 67 కంపెనీల సాయుధ భద్రత బలగాలు ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాలు, శాంతి భద్రతల కోసం వినియోగిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. పోలింగ్ రోజు జరిగిన హింస మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు.
మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు
అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మీడియా కౌంటింగ్ ప్రక్రియను చిత్రీకరణ చేసుకోవచ్చన్నారు. కౌంటింగ్ కేంద్రల్లో మొబైల్ ఫోన్ లు అనుమతిలేదని స్పష్టం చేశారు. మీడియాకు మాత్రం నిర్దేశించిన మీడియా సెంటర్ వరకూ మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లవచ్చన్నారు.
33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్
పార్లమెంటు నియోజక వర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశాjg. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది అబ్జర్వ్ లు నియమించారు.
ఎంత మంది ఓటు వేశారంటే…?
ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు కలిపి మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ అధికారులు వెల్లడించారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నట్లు ప్రకటించారు.
80.66 శాతం పోలింగ్
మే 13న 25 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 80.66 శాతం పోలింగ్ నమోదైంది.
తొలి ఫలితం ఇక్కడే…
పార్లమెంటు ఫలితాలకు సంబంధించి 13 రౌండ్లు ఉన్న రాజమండ్రి, నరసాపురం ఫలితాలు తొలుత వెల్లడి కానున్నాయి. 27 రౌండ్ల లెక్కింపు ఉన్న అమలాపురం ఫలితం ఆలస్యంగా రానుంది.
ఒంటరిగా వైసీపీ
వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఇక బీజేపీ, జనసేనలతో కలిసి కూటమిగా బరిలోకి తెలుగుదేశం పార్టీ బరిలో నిలిచింది.
బరిలో 454 మంది అభ్యర్థులు….
ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో ఎవరు గెలుస్తారనేది ఇవాళ తేలనుంది.
24,43 ఈవీఎం టేబుళ్ల
ఏపీలోని లోక్ సభ ఓట్ల లెక్కింపునకు 2443 ఈవీఎం టేబుళ్లను సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. 08. 30 గంటలకు సాధారణ ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అవుతుంది.
నేడే కౌంటింగ్
ఏపీలోని లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.