తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cm Kcr Nomination : రేపు గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్లు

CM KCR Nomination : రేపు గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్లు

08 November 2023, 21:41 IST

google News
    • CM KCR Nomination : సీఎం కేసీఆర్ రేపు(గురువారం) గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు అనంతరం సీఎం కేసీఆర్ కామారెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు.
సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

CM KCR Nomination : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం(నవంబర్ 9) నామినేషన్ వేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల సీఎం కేసీఆర్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం 10:45 ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాఫ్టర్ లో గజ్వేల్ టౌన్ కు చేరుకుంటారు. 10:55 కు గజ్వేల్ టౌన్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ పై ల్యాండింగ్, ఉదయం 11 గంంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య గజ్వేల్ లో రెండు సెట్ల నామినేషన్ పత్రాలు వేయనున్నారు. నామినేషన్ దాఖలు తర్వాత ఎర్రవెల్లికి తిరిగి వెళ్తారు. ఆ తరవాత మధ్యాహ్నం 1:40 గంటలకు కామారెడ్డికి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య కామారెడ్డిలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు సీఎం కేసీఆర్. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య కామారెడ్డి బహిరంగ సభలో పాల్గొన్ని సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.

రేపు కామారెడ్డికి సీఎం కేసీఆర్ నామినేషన్

కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ రేపు నామినేషన్ వేయనున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గురువారం సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. సభా స్థలాన్ని హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కామారెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఎంజీ వేణుగోపాల్ గౌడ్ తో కలిసి పరిశీలించారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం కామారెడ్డి ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. అత్యధిక మెజార్టీతో కేసీఆర్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఉందని బొంతు రామ్మోహన్ అన్నారు.

తదుపరి వ్యాసం