తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kcr Gajwel Nomination: గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన కేసీఆర్

KCR Gajwel Nomination: గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన కేసీఆర్

Sarath chandra.B HT Telugu

09 November 2023, 12:12 IST

google News
    • KCR Gajwel Nomination: తెలంగాణ సిఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక నాయకులతో కలిసి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందచేశారు. 
గజ్వేల్‌లో నామినేషన్ వేస్తున్న సిఎం కేసీఆర్
గజ్వేల్‌లో నామినేషన్ వేస్తున్న సిఎం కేసీఆర్

గజ్వేల్‌లో నామినేషన్ వేస్తున్న సిఎం కేసీఆర్

KCR Gajwel Nomination: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ముగుస్తుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పిస్తున్నారు. తెలంగాణ సిఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో నామినేషన్ వేశారు. సమీకృతప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో సిఎం కేసీఆర్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు.

హెలిపాడ్ నుంచి ఊరేగింపుగా కార్యాలయానికి వెళ్ళారు. కేసీఆర్‌తో పాటు పలువురు స్థానిక నేతలు ఉన్నారు. గజ్వేల్‌లో నామినేషన్‌ వేసిన తర్వాత కామారెడ్డిలో నామినేషన్‌ వేయడానికి బయల్దేరి వెళ్లారు.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు మరో రోజు మాత్రమే గడువు మిగిలి ఉంది. గురువారం మంచి రోజు కావడం, శుక్రవారం చివరి రోజు కావడం అభ్యర్థులు దాదాపు గురువారం నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. నామినేషన్ల దాఖలు, ప్రచారంలో బిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ముందున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో 11 స్థానాల్లో బీజేపీ, 4 స్థానాల్లో కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ 119 స్థానాల్లో అభ్యర్థులను ముందే ప్రకటించాారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేనాటికే ఒకటి రెండుసార్లు నియోజకవర్గం మొత్తం చుట్టేశారు.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వెంటనే మెజార్టీ అభ్యర్థులందరికీ సీఎం కేసీఆర్‌ స్వయంగా బీ ఫారాలు అందించారు. నామినేషన్ల ఘట్టం మొదలుకాగానే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. గురువారం సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు తదితరులు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

తదుపరి వ్యాసం