Revanth Reddy On KCR : ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చు రేపిందే కేసీఆర్ - రేవంత్ రెడ్డి
08 November 2023, 15:48 IST
- Telangana Assembly Election 2023: బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఖానాపూర్ నియోజకవర్గంలో మాట్లాడిన ఆయన… ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చు రేపిందే కేసీఆర్ అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి
Telangana Assembly Election 2023: దొరల పాలనలో విభజించి పాలించడం ఎప్పటి నుంచో వస్తున్న అనవాయితీ.. ఆరోగ్యంగానే సీఎం కేసీఆర్ ఆదివాసి లంబాడీల మధ్య మనస్పర్ధలు తెచ్చి వారిని వేరు చేశారని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఖానాపూర్ సెగ్మెంట్లోని ఉట్నూర్ కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆదివాసీలు లంబాడీలను ఏకం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు వర్గాలు రెండు కళ్ళ లాంటి వారిని అన్నారు, వీరిద్దరి మధ్య నెలకొల్పిన విభేదాలను వెంటనే తొలగిస్తామని తెలిపారు.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ అని ఆరోజు తెలంగాణ సోనియా ప్రకటించకపోతే కెసిఆర్ కేటీఆర్ లు నాంపల్లి దర్గా వద్ద బిల్లా టెంపుల్ వద్ద బిచం అడుక్కునే వారని ఎద్దేవా చేశారు. సోనియా పెట్టిన భిక్షతోనే లక్షల కోట్లు సంపాదించుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి వచ్చి అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు, 2018 లో రైతుబంధు పతకం ప్రవేశ పెట్టి, 2020లో వచ్చిన ధరణి పోర్టల్ కు ముడిపెట్టి ధరణి రద్దు చేస్తే రైతుబంధులు పోతాయని ముఖ్యమంత్రి హోదాలో అబద్దాలాడుతున్నారన్నారు. ధరణి తెచ్చి పేదల భూములను, హైదరాబాద్ చుట్టు పదివేల ఎకరాలు కబ్జా చేశారు అన్నారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ బిజెపిలు కలిసి మరోసారి ప్రజలను మోసం చేసి ఓట్లు అడిగేందుకు వస్తున్నారని తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ ఆదివాసులకు ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టి ఐటీడీఏలు నెలకొల్పి అభివృద్ధికి కృషి చేసిందని తెలిపారు. టిఆర్ఎస్ ఓటిసి మళ్లీ దొరల తెలంగాణ తెచ్చుకోవద్దని ప్రజల తెలంగాణ కావాలంటే కాంగ్రెస్ ఓటేయాలని కోరారు. ఇంద్రవెల్లి సాక్షిగా అదిలాబాదులో ఆదివాసులను అన్ని రకాల ఆదుకొని అభివృద్ధి చేసేందుకు తనవంతుగా ఎనరేని కృషి చేస్తానని రేవంత్ అన్నారు. అబద్ధాల కేసీఆర్ కు బుద్ధి చెప్పి ప్రజలు ప్రభుత్వాన్ని మార్చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన విషయం పట్ల మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. కేసీఆర్ మోడీలు కలిసి కమీషన్లు పంచుకున్నారని అందుకే మాట్లాడలేదని తెలిపారు.
రేఖా నాయక్ ఫైర్….
ఈ సందర్భంగా సభ వేదికపై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, మంత్రి కేటీఆర్ ల పై నిప్పులు చేరిగారు. అరేయ్ అని సంబోధిస్తూ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ఖానాపూర్ అభివృద్ధి జరగలేదని నిర్మల్ సభలో కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని, తన స్నేహితుడి కోసమే ఏడాది ముందు నుండి ప్లాన్ వేసుకుని తన నియోజవర్గం నిధులు ఇవ్వలేదని తెలిపారు. జాన్సన్ నాయక్ ని ఓడగొట్టడమే తన లక్ష్యమని తెలిపారు.