తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Assembly Elections : “రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ. 15వేలు”- సీఎం ప్రకటన!

Assembly elections : “రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ. 15వేలు”- సీఎం ప్రకటన!

Sharath Chitturi HT Telugu

12 November 2023, 17:20 IST

google News
  • Assembly elections : తాము మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి రూ. 15వేలు ఇస్తామని ప్రకటించారు ఛత్తీస్​గఢ్​ సీఎం. ఆ వివరాలు..

“రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ. 15వేలు”- సీఎం ప్రకటన!
“రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ. 15వేలు”- సీఎం ప్రకటన!

“రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ. 15వేలు”- సీఎం ప్రకటన!

Chhattisgarh Assembly elections : అటు దీపావళి, ఇటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ భగేల్​ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్​ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఏడాదికి రూ. 15వేలు ఇస్తామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్​ డేట్​ సమీపిస్తున్న తరుణంలో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

"దీపావళి సందర్భంగా.. ఛత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​ మళ్లీ ప్రభుత్వంలోకి వస్తే.. 'ఛత్తీస్​గఢ్​ గృహలక్ష్మీ యోజన'ను ప్రవేశపెడతాము. రాష్ట్రంలోని తల్లులు, సోదరీమణులకు ఏడాదికి రూ. 15వేలు ఇస్తాము," అని భూపేశ్​ భగేల్​ అన్నారు.

ఛత్తీస్​గఢ్​లో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిల్లోని 20 సీట్లకు ఈ నెల 7న తేదీనే పోలింగ్​ ముగిసింది. ఇక మిగిలిన 70 సీట్లకు.. ఈ నెల 17న పోలింగ్​ జరగనుంది.

Assembly elections 2023 : కాగా.. దీపావళి నేపథ్యంలో భారీ ప్రకటన చేయనున్నట్టు.. ఆదివారం ఉదయమే ట్వీట్​ చేశారు భూపేశ్​ భగేల్​. ఆయన ఏం చెబుతారు? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరికి.. మహిళలకు నిధుల విషయాన్ని ప్రకటించారు.

ఛత్తీస్​గఢ్​లో తిరిగి అధికారాన్ని చేపట్టేందుకు కాంగ్రెస్​ పార్టీ పక్కా ప్లానే వేసింది. భారీ హామీలతో కూడిన మేనిఫెస్టోనే లాంచ్​ చేసింది. కుల గణన, రైతు రుణ మాఫీ, మహిళలకు సబ్సీడీలో సిలిండర్​ వంటివి హామీనిచ్చింది.

Chhattisgarh elections latest news : అదే సమయంలో విపక్ష బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్​ భగేల్​. కాంగ్రెస్​ ప్రభుత్వ అన్ని వర్గాల వారికి రేషన్​ కార్డు ఇచ్చిందని, బీజేపీ ఆ పనే చేయలేదని ఆరోపించారు.

కాగా.. తాము అధికారంలోకి వస్తే.. వివాహితకు ఏడాదికి రూ. 12వేలు ఇస్తామని బీజేపీ హామీనివ్వడం గమనార్హం.

తదుపరి వ్యాసం