Raja Singh Comments : చంపడానికైనా వెనుకాడను.. సొంత పార్టీ కార్యకర్తలకు రాజాసింగ్ వార్నింగ్
17 November 2023, 11:11 IST
- Raja Singh Seansational Comments: సొంత పార్టీ వాళ్లను ఉద్దేశిస్తూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతోనే ఉంటూ కీలక విషయాలను ప్రత్యర్థులకు చెరవేస్తున్నారని ఆరోపించారు. వారి సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.
రాజాసింగ్
Raja Singh Seansational Comments: వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజ సింగ్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు.అయితే ప్రతిసారీ అయన ఎంఐఎం , కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాజాసింగ్ ఈసారి సొంత బీజేపీ కార్యకర్తల పైనే చేశారు. తాను చావుకు భయపడే వ్యక్తి కాదని చావు వరకు వస్థే తాను చావడానికి అయిన చంపడానికి అయన వెనుక అడనని తమ పార్టీ కార్యకర్తలకు అయన వార్నింగ్ ఇచ్చారు.
సొంత పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే రాజ సింగ్ వార్నింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తూ ఓ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనతో ఉంటూనే కొందరు తన గోప్యత విషయాలన్నీ ప్రత్యర్థులకు సమాచారం అందిస్తున్నారని అయన ఆరోపించారు. అలా ఎవరెవరు చేస్తున్నారో తనకు తెలుసనీ వాటికి సంబంధించిన ఆధారాలు అన్నీ తన వద్ద ఉన్నాయని అయన వెల్లడించారు.
రాజ సింగ్ గురించి ప్రత్యర్థులకు సమాచారం అందిస్తే అక్కడ నుంచి రాజ సింగ్ కు కూడా సమాచారం వస్తుందన్న విషయం కొందరు మర్చిపోవద్దని హెచ్చరించారు.ఎవరు గోప్యంగా ఫోన్లు మాట్లాడుతున్నారో,ఎవరు ప్రత్యర్థుల ఇండ్లకు సీక్రెట్ గా వెళుతున్నారో తనకు పూర్తిగా తెలుసన్నారు.శత్రువులనే వదిలి పెట్టని తాను మోసం చేసిన సొంత వారిని ఎలా వదులుతా అనుకున్నారు అంటూ అయన కార్యకర్తలకు దమ్కీ ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రతీ ఒక్కడి సంగతి చూస్తానని రాజ సింగ్ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు.
రాజాసింగ్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
ఎన్నికల ప్రచారంలో భాగంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజ సింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ముస్లిం యువతులను సామాజిక మాధ్యమాల ద్వారా ట్రాప్ చేయాలని హిందువులను రాజ సింగ్ రెచ్చగొడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ఎమ్మెల్యే రాజ సింగ్ విద్వేషపూరిత ప్రసంగాలు ఎన్నికల ప్రచారంలో చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందించారు.ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.