తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Election Schedule: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ

Election schedule: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ

HT Telugu Desk HT Telugu

16 March 2024, 16:20 IST

google News
    • States Election schedule: లోక్ సభ తో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు లోక్ సభ ఎన్నికలతో పాటే ఎలక్షన్స్ జరగనున్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్తగా ఎంపికైన ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూ
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్తగా ఎంపికైన ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూ (PTI)

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్తగా ఎంపికైన ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూ

4 States Election schedule: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే, ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ ను వెల్లడించింది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్తగా ఎంపికైన ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూ పాల్గొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

నోటిఫికేషన్ విడుదల : ఏప్రిల్ 18

ఎన్నికల తేదీ: మే 13

కౌంటింగ్, ఫలితాలు: జూన్ 4

----

ఒడిశా

ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నాలుగు దశల్లో జరగనున్నాయి. ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

మొదటి దశ:

నోటిఫికేషన్: ఏప్రిల్ 18

ఎన్నికల తేదీ: మే 13

రెండో దశ

నోటిఫికేషన్: ఏప్రిల్ 26

ఎన్నికల తేదీ: మే 20

మూడో దశ

నోటిఫికేషన్: ఏప్రిల్ 29

ఎన్నికల తేదీ: మే 25

నాలుగో దశ

నోటిఫికేషన్: మే 7

ఎన్నికల తేదీ: జూన్ 1

కౌంటింగ్, ఫలితాలు: జూన్ 4

----

అరుణాచల్ ప్రదేశ్

ఒకే దశలో రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

నోటిఫికేషన్ : మార్చి 20

ఎన్నికల తేదీ: ఏప్రిల్ 19

కౌంటింగ్, ఫలితాలు: జూన్ 4

-----

సిక్కిం

ఒకే దశలో రాష్ట్రంలోని మొత్తం 32 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

నోటిఫికేషన్ : మార్చి 20

ఎన్నికల తేదీలు: ఏప్రిల్ 19

కౌంటింగ్, ఫలితాలు: జూన్ 4

తదుపరి వ్యాసం