తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Congress Manifesto : సిద్ధమైన కాంగ్రెస్ మేనిఫెస్టో - ధరణి స్థానంలో ‘భూ భారతి'..? ఆకట్టుకునేలా కీలక హామీలు!

Telangana Congress Manifesto : సిద్ధమైన కాంగ్రెస్ మేనిఫెస్టో - ధరణి స్థానంలో ‘భూ భారతి'..? ఆకట్టుకునేలా కీలక హామీలు!

16 November 2023, 19:34 IST

    • Telangana Assembly Elections 2023: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు ముహుర్తం ఖరారైంది. నవంబరు 17వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఎన్నికల హామీ పత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రజలను ఆకర్షించే కీలకమైన హామీలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో 2023
తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో 2023

తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో 2023

Telangana Congress Manifesto 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్. ఏడాది కాలంగా ప్రత్యేక దృష్టిపెట్టిన హస్తం పార్టీ…. ఇప్పటికే పలు డిక్లరేషన్లను ప్రకటించింది. ఆరు గ్యారెంటీల హామీతో ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే కీలకమైన మేనిఫెస్టో రూపకల్పన విషయంలోనూ లోతుగానే కసరత్తు చేసింది. శ్రీధర్ బాబు ఛైర్మన్ గా ఉన్న ఈ కమిటీ… పలు వర్గాల అభిప్రాయాలను సేకరించింది. ప్రజలను ఆకర్షించేలా కీలకమైన హామీలను ఇందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల పాటు దీనిపై కసరత్తు చేస్తున్న హస్తం పార్టీ…. మేనిఫెస్టో విడుదలకు ముహుర్తం ఖరారు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

CBN and Sajjala: అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు సజ్జల.. అధికారంలో ఉన్నపుడు ఇద్దరిదీ ఒకటే రాగం

Transfers in AP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ - పల్నాడు కలెక్టర్ బదిలీ, పలువురు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు

Khammam Bettings: ఏపీలో ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో లెక్కలు.. జోరుగా బెట్టింగులు!

YS Jagan With IPac: ఐపాక్‌ బృందంతో జగన్ భేటీ.. మళ్లీ అధికారంలోకి వస్తున్నామని ధీమా..

ఖర్గే చేతుల మీదుగా విడుదల

రేపు (నవంబరు 17) మేనిఫెస్టోను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రత్యేకంగా హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకొనున్నారు ఖర్గే. 11 గంటలకు గాంధీభవన్ చేరుకొనున్న ఖర్గే … 11 - 12 గంటల మధ్య టీపీసీసీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ బహిరంగ లో పాల్గొననున్నారు. రాత్రికి హైదరాబాద్ లోనే బస చేయనున్నారు. శనివారం ఉదయం 10 : 30 గంటలకు తిరిగి బెంగుళూరు వెళ్ళనున్నారు ఖర్గే.

కీలక హామీలు….!

- ధరణి స్థానంలో కొత్తగా "భూ భారతి" పోర్టల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

- "పసుపు కుంకుమ" పేరుతో పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం.

- ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు, రేషన్ డీలర్లు, వార్డు సభ్యులు గౌరవ వేతనం ప్రకటించే అవకాశం.

- ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రకటన

- జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించే అవకాశం.

- 'అమ్మ హస్తం' పథకం పేరుతో 9 నిత్యావసర సరుకుల పంపిణీ

- న్యాయవాదుల కోసం ప్రత్యేక హామీలు ప్రకటించే అవకాశం ఉంది.

- విద్యార్థులకు మెట్రోలో ఉచిత ప్రయాణం.

- రేషన్ కార్డు ఉన్న వాళ్లకు సన్న బియ్యం అందజేతపై ప్రకటన ఉండే అవకాశం.

- కాలేజీ మహిళ విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాలు అందజేత విషయంలో మేనిఫెస్టోలో ఉన్నట్లు తెలుస్తోంది.

- రూ. 2 లక్షల లోపు రైతు రుణమాఫీపై ప్రకటన.

-విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం.

పైన పేర్కొన్న అంశాలే కాకుండా మరిన్ని అంశాలు మేనిఫెస్టోలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ ప్రకటించే మేనిఫెస్టోలో ఏముందనేది రేపు అధికారికంగా తెలియబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించగా.... కాంగ్రెస్ మేనిఫెస్టోపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

తదుపరి వ్యాసం