Bandi sanjay: వాళ్లకు ఓట్లు వేస్తే బిచ్చమెత్తుకోవాల్సిందే - బండి సంజయ్
15 November 2023, 9:04 IST
- Bandi sanjay: కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలకు ఓట్లు వేస్తే బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.కరీంనగర్ పట్టణంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలుచోట్ల ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్
Bandi sanjay: మంత్రి కేటీఆర్ నోటికివచ్చినట్టు మాట్లాడుతున్నాడని,అమెరికాలో చిప్పలు కడుక్కునే కేటీఆర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే చూస్తు ఊరుకునేదని లేదని బండి సంజయ్ మండిపడ్డారు.తనపై ఇప్పటి వరకు 74 కేసులు పెట్టారని ప్రజలకోసం కొట్లాడే తనకు కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ అని ఎద్దేవా చేసారు.
బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ అని, మోదీ ఇచ్చిన హమీ మేరకు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదలను కూడా ఆదుకున్న ఘనత బీజేపీదేనని, తప్పిపోయి బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ఓట్లేస్తే బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందన్నారు.
ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరుతున్నానన్నారు. అటు ఇటు గాని పార్టీలకు ఓట్లేస్తే ఓటర్లు ఎటు కాకుండా పోతారన్నారు. కరీంనగర్ లో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాడని,కరీంనగర్ లో చెల్లని రూపాయి హుస్నాబాద్ లో ఎలా చెల్లుతుందని పొన్నంను విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే అయిన సతీష్ బాబుకు ప్రతి ఒక్కరు కాళ్లు మొక్కి దండం పెడితే తప్ప కనికరించడని అలాంటి నాయకులకు ఓట్లు వేయడం అవసరమా అని ప్రశ్నించారు.
తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం రావాలని డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణా అభివృద్ది సాధ్యమన్నారు. కేసీఆర్ పాలనలో ఇప్పటికే రాష్ట్రం ఎంతో నాశనమైందని, ఐదు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి పుట్టబోయో బిడ్డ పై కూడా లక్షా ఇరవై వేల అప్పుమోపాడన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ బండి సంజయ్ గెలవకూడదని.. ఏం చేసైనా సరే ఓడించాలని. బండి సంజయ్ గెలిస్తే మనకు ఇబ్బంది అంటూ బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ చెబుతున్నాడన్నారు.
ప్రజలకోసం యుద్దం చేసే బండి సంజయ్‌ను గెలిపించి ప్రశ్నించే గొంతుకను కాపాడుకుంటారా, పిసికి చంపుకుంటారా అనేది ప్రజలే నిర్ణయించు కోవాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతో చేసినవేనని... లైట్లకు, రోడ్లకు, ఉపాధి పనులకు, స్మశానవాటికలకుసహా అన్ని పనులకు కేంద్రమే నిధులిస్తోందని చెప్పారు.
రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తోంది కేంద్ర పైసలతోనేనని... సిగ్గు లేకుండా కేసీఆర్ తనే అవన్నీ పనులు చేసినట్లుగా ఫోజులిస్తూ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు.ప్రజలు ఆలోచించి ఓటెయాలని విజ్ఞప్తి చేశారు.